Naa Pranamunaku

Naa Pranamunaku MP3 (Click here)

నా ప్రాణమునకు సేదను దీర్చి నా అలుపును బాపుము దేవా
నా అలసటను దీర్చుము దేవా , అల్పుని బలపరచుము
ఈ అల్పుని బలపరచుము, నా ప్రాణమునకు సేదనుదీర్చుము

నీ పవిత్రతకు శత్రుత్వం విశ్రాంతి లేదు ఏమాత్రం |2|
వెలుపట పోరాటములు లోపట భయకంపములు |2|
అపార్ధములు అపోహలు అపనిందనలు అభాండములు |2|
దురవగాహన దూషణల మధ్యన |2|
కావాలి ఆదరణ నీ నిత్య ఆదరణ |2| ||నా ప్రాణమునకు||

స్వశక్తి చేత ఈ యాత్ర సాగించుట అసాధ్యము |2|
శక్తి గల హస్తముతో పట్టుకొని నడుపుము
నీ శక్తి గల హస్తముతో పట్టుకొని నడుపుము
నీ దర్శన వెలుగులో ధైర్యము దయచేయుము
నీ సన్నిధిలో ఈ జీవితం
నీ సన్నిధిలో ఈ జీవితం తరించే కృప నీయుము ||నా ప్రాణమునకు||

Silvalo Nakai Karchenu

silvalo-naakai-kaarchenu-yesu-rakhthamu.mp3

సిల్వలో నాకై కార్చెను యేసు రక్తము
శిలనైన నన్ను మార్చెను యేసు రక్తము
యేసు రక్తము ప్రభు యేసు రక్తము
అమూల్యమైన రక్తము యేసు రక్తము
1.సమకూర్చు నన్ను తండ్రితో యేసు రక్తము
సంధి చేసి చేర్చునుయేసు రక్తము
యేసు రక్తము ప్రభు యేసు రక్తము
ఐక్యపరచును తండ్రితో యేసు రక్తము
2.సమాధాన పరచును యేసు రక్తము
సమస్యలన్ని తీర్చును యేసు రక్తము
యేసు రక్తము ప్రభు యేసు రక్తము
సంపూర్ణ శాంతినిచ్చును యేసు రక్తము
3.నీతి మంతులుగా చేయును యేసు రక్తము
ధుర్నీతినంత బాపును యేసు రక్తము
యేసు రక్తము ప్రభు యేసు రక్తము
నిబంధన నిలుపును యేసు రక్తము
4.రోగములను బాపును యేసు రక్తము
దురాత్మన్‌ పారద్రోలును యేసు రక్తము
యేసు రక్తము ప్రభు యేసు రక్తము
శక్తి బలము నిచ్చును యేసు రక్తము

Shuddha Hrudayam

శుద్ధ హృదయం కలుగ జేయుము (2)
నాలోనా . . నాలోనా (2)

నీ వాత్సల్యం నీ బాహుళ్యం నీ కృప కనికరము చూపించుము (2)
పాపము చేశాను దోషినై యున్నాను (2)
తెలిసియున్నది నా అతిక్రమమే తెలిసియున్నవి నా పాపములే (2)
నీ సన్నిధిలో నా పాపములే ఒప్పుకుందునయ్య (2) 

నీ జ్జానమును నీ సత్యమును నా అంతర్యములో పుట్టించుమా (2)
ఉత్సాహ సంతోషం నీ రక్షణానందం (2)
కలుగజేయుము నా హృదయములో (4)
నీ సన్నిధిలో పరిశుద్ధాత్మతో నన్ను నింపుమయ్యా (2)

Jayahe Jayahe

జయహే.. జయహే.. జయహే.. జయహే..
జయ జయ దేవసుతా జయ జయ విజయసుతా
1. సిలువలో పాపికి విడుదల కలిగెను- విడుదల కలిగెను
కలువరిలో నవ జీవన మొదవెను – జీవన మొదవెను
సిలువ పతాకము జయమును గూర్చెను
జయమని పాడెదను-నా విజయము పాడెదను
నా విజయము పాడెదను
2. మరణపు కోటలో మరణమే సమసెను – మరణమే సమసెను
ధరణిలో జీవిత భయములు దీరెను – భయములు దీరెను
మరణములో సహ జయములు నావే (2) “జయమని”
3. శోదనలో ప్రభుసన్నిది దొరికెను – సన్నిది దొరికెను
వేధనలే రణభూమిగా మారెను భూమిగ మారెను
శోధన భాధలు బలమును గూర్చెను (2) “జయమని”
4. ప్రార్ధనకాలము బహుప్రియమాయెను – బహుప్రియ మాయెను
సార్ధకమాయెను దేవుని వాక్యము – దేవుని వాక్యము
ప్రార్ధనలే భలి పీఠములాయెను (2) “జయమని”
5. పరిశుద్ధాత్ముని ప్రాపక మొదవెను – ప్రాపక మొదవెను
వరుడగు యేసుని వధువుగ మారితి – వధువుగ మారితి
పరిశుద్ధుడు నను సాక్షిగ పిలచెను (2) “జయమని”

Cheekati loyalo

చీకటి లోయలో నేను పడియుండగా
నేవే దిగివచ్చి నన్ను కనుగొంటివి
మరణపు గడియలో నేను చేరియుండగా
నీ రక్తమిచ్చి నన్ను బ్రతికించితివి
నీవే, దేవా నీవే, నీవే నీవే
నా ప్రాణదాతవు నీవే ప్రభు
చేర్చు దేవా చేర్చు, నన్ను చేర్చు
ఎత్తెన కొండపైకి నన్ను చేచ్చు
1. అరణ్యములో నేను సంచరించినను
ఏ అపాయమునకు భయపడను
నీవే నా మార్గమని నిన్ను వెంబడించెదను
నా చేయిపట్టి నన్ను నడిపించుము
నీకే, దేవా నీకే, నీకే నీకే
నా సమస్తమును నీకే అర్పింతును
చేర్చు దేవా చేర్చు, నన్ను చేర్చు
నా తండ్రి ఇంటికి నను చేర్చు ప్రభు
2. ఆకలి దప్పులు లేని  శ్రమలు అలసటలు లేని
శోధన అవేదన లేని  భయము దుఃఖములేని
మరణం కన్నీరు లేని  చీకటి ప్రవేశం లేని
నా తండ్రి ఇంటికి నన్ను చేర్చు ప్రభు
సకల సమృద్ధి ఉండు  దూతల స్తుతిగానాలుండు
భక్తుల సమూహముముండు  మహిమ ప్రవాహముండు
నిత్యం ఆరాధన ఉండు  శాశ్వత ఆనందముండు
నా తండ్రి ఇంటికి నన్ను చేర్చు ప్రభు

Jeeva Nadi

జీవనదిని నా హృదయములో ప్రవహింప చేయుమయా (2)

1. శరీరక్రియులన్నియు నాలో నశియించేయుమయు (2)

2. బలహీన సమయుములో నీ బలము ప్రసాదించుము (2)

3. ఆత్మీయవరములతో నన్ను అభిషేకం చేయుమయ (2)

4. ఎండిన ఎముకలన్నియు తిరిగి జీవింపచేయుమయ (2)

Manasunna Manchi Deva

Manasunna Manchi Deva MP3

మనసున్న మంచిదేవా నీ మనసును నాకిచ్చావా
మనసు మలినమైన నాకై మనిషిగా దిగి వచ్చావా
నా మది నీ కోవెలగా మలచుకోవయా
నా హృదిని రారాజుగా నిలిచిపోవయా

1. హృదయము వ్యాధితో నిండిన కపట కేంద్రము
దానిని గ్రహియించుట ఎవరి సాధ్యము
మనసు మర్మమెరిగిన మహనీయుడా
మనసు మార్చగలిగిన నిజదేవుడా

2. చంచల మనస్సాడించు బ్రతుకు ఆటను
వంచన చేసి నడుపును తప్పు బాటను
అంతరంగమును పరిశీలించు యేసయ్యా
స్ధిరమనస్సుతో నీ దారిలో సాగనీవయ్యా

3. నిండు మనస్సుతో నిన్ను ఆశ్రయించితి
దీనమనస్సుతో నీకడ శిరము వంచితి
పూర్ణశాంతి గలవానిగా నన్ను మార్చుమా
తరతరములకు క్షేమము చేకూర్చుమా

oh kraistavuda

ఓ క్రైస్తవుడా ఓ విశ్వాసి
నిరాశ మాటలు పలుకొద్దురా నిరీక్షణతో కొనసాగరా
దేవుని వాగ్దనం నమ్ముమురా
జీవపు మాటలు పలుకుమురా

1. నిరాశలో ఉన్న అబ్రాముకు
నక్షత్రములు చూపెను దేవుడు (2)
నిరాశను పారద్రోలెనురా నిరీక్షణతో కొనసాగెరా
వాగ్దానములను నమ్మెనురా
వాగ్దాన పుత్రుని పొందెనురా (2)

2. నిరాశలో ఉన్న పేతురు
తన దోనె యేసుకు ఇచ్చెను (2)
ఆయన మాటలు  నమ్మెనురా
చేపలతో తనదోనెనిండెనురా
యేసయ్యను వెంబడించెనురా
మనుష్యుల జాలరి ఆయెనురా (2)