చీకటి లోయలో నేను పడియుండగా
నేవే దిగివచ్చి నన్ను కనుగొంటివి
మరణపు గడియలో నేను చేరియుండగా
నీ రక్తమిచ్చి నన్ను బ్రతికించితివి
నీవే, దేవా నీవే, నీవే నీవే
నా ప్రాణదాతవు నీవే ప్రభు
చేర్చు దేవా చేర్చు, నన్ను చేర్చు
ఎత్తెన కొండపైకి నన్ను చేచ్చు
1. అరణ్యములో నేను సంచరించినను
ఏ అపాయమునకు భయపడను
నీవే నా మార్గమని నిన్ను వెంబడించెదను
నా చేయిపట్టి నన్ను నడిపించుము
నీకే, దేవా నీకే, నీకే నీకే
నా సమస్తమును నీకే అర్పింతును
చేర్చు దేవా చేర్చు, నన్ను చేర్చు
నా తండ్రి ఇంటికి నను చేర్చు ప్రభు
2. ఆకలి దప్పులు లేని  శ్రమలు అలసటలు లేని
శోధన అవేదన లేని  భయము దుఃఖములేని
మరణం కన్నీరు లేని  చీకటి ప్రవేశం లేని
నా తండ్రి ఇంటికి నన్ను చేర్చు ప్రభు
సకల సమృద్ధి ఉండు  దూతల స్తుతిగానాలుండు
భక్తుల సమూహముముండు  మహిమ ప్రవాహముండు
నిత్యం ఆరాధన ఉండు  శాశ్వత ఆనందముండు
నా తండ్రి ఇంటికి నన్ను చేర్చు ప్రభు