శాశ్వతమైనది పరలోక ప్రేమ

Sashwatamainadi Para loka prema MP3 (Click here)

శాశ్వతమైనది పరలోక ప్రేమ క్షణిక మైనది ధరలోని ప్రేమ
గతియించి పోవును లోకాశలన్నీ ||2||
స్థిరమై నిలుచును ప్రభులో అన్నీ ||2||
ఏది కావాలో తెలుసుకో ఏది విడువాలో తేల్చుకో
లోకము కావాలా దైవము కావాలా ||2||

లోకము స్నేహించి పతనమైన తనయుని చూడు వ్యతల పాలాయ
తనువుని ప్రేమించి మోస పోయిన సంసోనుని చూడు నశియించి పోయె
ఏది కావాలో తెలుసుకో ఏది విడువాలో తేల్చుకో
లోకము కావాలా దైవము కావాలా ||2||

ధనమును ప్రేమించి వెర్రి వాడైన మనుషుని చూడు నరకము పాలాయె||2||
దేవుని ప్రేమించి సిరులను కాదన్న||2|| దీనుడు లాజరు పరవశమాయె||2||