Yesayya Naa Pranamu

Yesayya Naa Pranamu MP3 (Download here

యేసయ్యా నా ప్రాణము నా ప్రాణము (My Soul) నీదేనయ్యా నా యేసయ్యా |2|
నాకున్న సర్వము నీవేనయ్యా నాదంటు ఏదీ లేనే లేదయ్యా |2|
||యేసయ్యా నా ప్రాణము||

నా తల్లి గర్భమున నేనున్నప్పుడే నీ హస్తముతో నన్ను తాకితివే |2|
రూపును దిద్ది ప్రాణము పోసి |2| నను ఇలనిలిపిన నా యేసయ్యా
||యేసయ్యా నా ప్రాణము||

బుద్ధియు జ్ఞానము సర్వ సంపదలు గుప్తమైయున్నవి నీయందే |2|
జ్ఞానమునిచ్చి ఐశ్వర్యముతో |2| నను ఇలమలచిన నా యేసయ్యా
||యేసయ్యా నా ప్రాణము||

లోకములోనుండి నన్ను వేరుచేసి, నీదు ప్రేమతో ప్రత్యేకపరచి |2|
అభిషేకించి ఆశీర్వదించి |2| నన్నిల నడిపిన నా యేసయ్యా
||యేసయ్యా నా ప్రాణము||

Yesu Vypu Choochuchu

Yesu Vypu Choochuchu MP3 (Download here – Right Click – Save

యేసు వైపు చూచుచు, పందెములో ఓపికతో పరుగెత్తుదము |2|
వెనుతిరిగి చూడక విశ్వాసం వీడక |2| సాగి పోవాలీ |2| ||యేసు వైపు||

వాక్యమనే ఖడ్గమును పట్టుకొని, వీడని విశ్వాసమును కట్టుకొని |2|
అపవాది తంత్రములను అణగత్రొక్కుదాం, అంధకార క్రియలను అణిచివేయుదాం |2|
రక్షణనే శిరస్త్రాణము ధరియించుదము, నిరీక్షణ కలిగి మనము సాగిపోదము |2|
వెనుతిరిగి చూడక విశ్వాసం వీడక |2| సాగి పోవాలీ |2| ||యేసు వైపు||

సత్యమనే దట్టిని కట్టుకొని, నీతిఅనే మైమరువును తొడుగుకొని |2|
సమాధాన శుభవార్తను ప్రకటించుదాం ,సిద్ధమనసు అను జోడు తొడుగుకుందము |2|
అపవాది అగ్ని పొదిని ఆర్పి వేయుదాం, ఆత్మలో ప్రతి సమయము ప్రార్థింతుము |2|
వెనుతిరిగి చూడక విశ్వాసం వీడక |2| సాగి పోవాలీ |2| ||యేసు వైపు||

Yoodudavaina anyudavaina

Yoodudavaina anyudavaina MP3 (Download here – Right Click – Save

యూదుడవైనా అన్యుడవైనా |2| తీర్పు రోజున నీవుందువు
పరమ తీర్పరి లెక్కచూసి, నీ క్రియలకు జీతమిచ్చును |2|

విలువపెట్టి కొనబడిన నీ దేహముతో వ్యభిచార సాంగత్యము చేసెదవా |2|
దేవుని నివాసమైన నీ హృదయములో మోసకరమైనవి యోచింతువా |2|
అయ్యో! ఎలా మనము తప్పించుకొందుము, ఆ దినము ఏల సహింతుము |2|
||యూదుడవైనా అన్యుడవైనా||

ఇతరులకు బోధించుచున్న నీవు, నీకు నీవే బోధించుకొనవా |2|
ప్రేమ** ప్రేమని చెప్పి ప్రేమించకపోతే యేసయ్య నిన్ను ప్రశ్నించడా |2|
అయ్యో! ఎలా మనము తప్పించుకొందుము, ఆ దినము ఏల సహింతుము |2|
||యూదుడవైనా అన్యుడవైనా||

ఆకాశ భూమికి మధ్య వ్రేలాడి, ఉభయులకూ యేసు సంధి చేసెను |2|
దేవుని కోపమును చల్లార్చెను, మనకు శాంతికర్తయై యుండెను
అదిగో ఆ యేసును చూడు నేడే క్షమ వేడు, ఆ నిత్య రాజ్యములో నీవుందువు |2|
||యూదుడవైనా అన్యుడవైనా||

ప్రేమ**  (1 Corinthians 13)

Manaserigina Yesayya

Manaserigina Yesayya MP3 (Download here – Right Click-Save)

మనసెరిగిన యేసయ్యా,
మదిలోన జతగా నిలిచావు |2|
హృదయాన నీ ఆజ్ఞలు వ్రాసి
నీ పత్రికనుగా మార్చావు |2| ॥మనసెరిగిన॥

నిర్జీవక్రియలను విడిచి
పరిపూర్ణ పరిశుద్ధతకై
సాగిపోదును నేను ఆగిపోలేనుగా |2|
సాహసక్రియలు చేయు నీ హస్తముతో
నన్ను పట్టుకొంటివే
విడువలేవు ఎన్నడు |2| ॥మనసెరిగిన॥

వెనకున్న వాటిని మరచి నీతోడు నేను కోరి,
ఆత్మీయ యాత్రలొ నేను సొమ్మసిల్లి పోనుగా |2|
ఆశ్ఛర్యక్రియలు చేయు దక్షిణ హస్తముతో
నన్ను ఆదుకొంటివే
ఎడబాయవు ఎన్నడు |2| ॥మనసెరిగిన॥

మర్త్యమైన దేహము వదిలి
అమర్త్యతను పొందుటకై
ప్రభు బల్లారాధనకు దూరము కాలేనుగా |2|
నేలమంటితో నన్ను రూపించిన హస్తములే
నన్ను కౌగిలించెనే
వదలలేవు ఎన్నడు |2| ॥మనసెరిగిన॥

నా దేవుడు ప్రతి అవసరమును

Naa Devudu – Audio MP3 (Click here):

నా దేవుడు ప్రతి అవసరమును తీర్చును మహిమైశ్వరములో
తల్లి వలె ప్రేమించును తండ్రి వలె పోషించును
కాపరి వలె నడిపించును వైద్యునిలా స్వస్థపరచును

కలవరిపడి నే కొండలవైపు కన్నులెత్తుదునా
నా సహాయము నీవేగ నా యేసు నా రాజా ||తల్లి||

జీవించుచున్నది నేను కాదు జీవించు క్రీస్తేసే
నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే చావైతే నాకు లాభమే ||తల్లి||