Deva Naalo

Deva Naalo MP3(Download here)

దేవా నాలో నిర్మలహృదిని సృజియింపుము
దేవా నాలో స్థిరమైన మనసును కలిగించుము|2|
నీ సన్నిధి నుండి నన్ను గెంటివేయకయ్యా
నీ ఆత్మను నా నుండి తీసివేయకయ్యా..|2|
*యేసయ్యా నా యేసయ్యా ఈ పాపి..
మనస్సును మార్చుమయ్యా …….|2|

తల్లి గర్భమందే నేను కిల్భిషాత్ముడను…
పుట్టినప్పటినుండియే పాపాత్ముడను…|2|
నా మనస్సును నీ జ్ఞానముతో నింపుము..
హిస్సోపుతో నాలో పాపం కడుగుము..|2|
హిమము కంటే తెల్లగా నన్ను మార్చుము…
నీ రక్షణానందమును కలిగించుము….|2|
||యేసయ్యా నా యేసయ్యా||

విరిగి నలిగిన మనసుతో నిను చేరితిని…
పశ్చ్యాతాపము నొంది ప్రార్ధించితిని..|2|
నా దురితములన్నియు మన్నింపుము….
హిస్సోపుతో నాలో పాపం కడుగుము..|2|
హిమము కంటే తెల్లగా నన్ను మార్చుము..
నీ పరిశుద్ధ వస్త్రమును నాపై కప్పుము.|2|
||యేసయ్యా నా యేసయ్యా||

Mahonnatuni chatuna

Mahonnatuni chatuna MP3 (Download here

మహోన్నతుని చాటున నివసించువాడే
సర్వశక్తుని నీడను విశ్రమించువాడు |2|
*ఆయనే నా ఆశ్రయము ఆయనే నా కోట
నేను నమ్ముకొనిన దేవుడు యేసయ్య |2|

వేటకాని ఉరినుండి నన్ను విడిపించును
నాశనకరమైన తెగులు రాకుండా చేయును|2|
తన రెక్కలతో నను కాయును,
తన రెక్కల నీడలో ఆశ్రయము కలుగును
||ఆయనే నా ఆశ్రయము||

నేను మొఱ్ఱపెట్టగా నాకు ఉత్తరమిచ్చును
శ్రమలలో ఆయన నాకు తోడైయుండెను |2|
నన్ను విడిపించి గొప్ప చేసెను
రక్షణానందం నాకు చూపెను |2|
||ఆయనే నా ఆశ్రయము||

Another song on Psalm 91 is posted here.

Keerthana 43

Keerthana 43 MP3 song (Download here

దేవా నాకు న్యాయము తీర్చుమా
భక్తిలేని జనముతో నాకై వ్యాజ్యెమాడుమా|2|

ప్రాణమా నీ వేల క్రుంగియున్నావు
నాలో నీ వేల త్వరపడుచు ఉన్నావు|2|
నా దేవుని నిరీక్షణ మరచిపోకుమా |2|
||దేవా నాకు న్యాయము తీర్చుమా||

శత్రుబాధ చేత నే దుఃఖక్రాంతుడనై
నాకు దుర్గమైన* నీవైపె చూచితినీ |2|
నీ వెలుగు నీ సత్యము నాకు దారి చూపె|2|
||దేవా నాకు న్యాయము తీర్చుమా||

పరిశుద్ధ పర్వతమునకు నీ స్థలమునకు
నన్ను నడిపించు కడవరకు యేసయ్య |2|
నీ బలిపీఠం నీ సన్నిధే నాకు సంతోషం  |2|
||దేవా నాకు న్యాయము తీర్చుమా||

*దుర్గము=కోట (A strong-hold /Citadel)

Psalm 15

యెహోవా నీ గుడారములో MP3 (Download here

1.యెహోవా నీ గుడారములో
అతిధిగా ఉండదగిన వాడెవడు
నీ పరిశుద్ధ పర్వతముమీద
నివసింపదగిన వాడెవడు,
యధార్థమైన ప్రవర్తన
కలిగి నీతి ననుసరించుచు
హృదయ పూర్వకముగా
నిజము పలుకువాడే.
||యెహోవా నీ గుడారములో||

2.అట్టివాడు నాలుకతో
కొండెములాడడు ,
తన చెలికానికి కీడు చేయడు |2|
తన పొరుగువాని మీద
నిందమోపడు    |2|
అతని దృష్టికి నీచుడు అసహ్యుడు
, అతడు యెహోవాయందు
భయభక్తులు గలవారిని సన్మానించును.
||యెహోవా నీ గుడారములో||

3.అతడు ప్రమాణము చేయగా
నష్టము కలిగినను మాట తప్పడు |2|
తన ద్రవ్వము వడ్డి కియ్యడు |2|
నిరపరాధిని చెరుపుటకై
లంచము పుచ్చుకొనడు,
ఈ ప్రకారము చేయువాడు
ఎన్నడును కదల్చబడడు.
||యెహోవా నీ గుడారములో||

Deva Nee Krupa Choppuna

Deva Nee Krupa Choppuna MP3 (Download here

దేవా, నీ కృపచొప్పున నన్ను కరుణింపుము
నీ వాత్సల్య బాహుళ్యముచొప్పున
నా అతిక్రమములు తుడిచివేయుము
నా దోషము పోవునట్లు నన్ను బాగుగా కడుగుము
నా పాపము పోవునట్లు నన్ను పవిత్రపరచుము
||
దేవా, నీ కృపచొప్పున||

ఆంతర్యమున నాకు జ్ఞానము తెలియజేయుదువు
నేను పవిత్రుడనగునట్లు హిస్సోపుతో నా పాపము పరిహరింపుము
హిమముకంటె తెల్లగా నేనుండునట్లు నన్ను కడుగుము.
ఉత్సాహ సంతోషములు నాకు వినిపింపుము
అప్పుడు నీవు విరిచిన యెముకలు హర్షించును
|| 
దేవా, నీ కృపచొప్పున||

నా దోషములన్నిటిని తుడిచివేయుము
స్థిరమైన మనస్సు నూతనముగా నుంచుము
నా దోషములన్నిటిని తుడిచివేయుము
నాయందు శుద్ధహృదయము కలుగజేయుము
నీ సన్నిధిలోనుండి త్రోసివేయకు
నీ పరిశుద్ధాత్మ నానుండి తీసివేయకు
నీ రక్షణానందము నాకు మరల పుట్టించుము
సమ్మతిగలిగిన మనస్సుతో నన్ను దృఢపరచుము.
|| దేవా, నీ కృపచొప్పున||

Yehova Naa Deva

Yehova Naa Deva MP3 (Download here

యెహోవా నా దేవా, నేను నీ శరణుజొచ్చియున్నాను|2|
నన్ను తరుమువారిచేతిలోనుండి నన్ను తప్పించుము.
నన్ను తప్పించువాడెవడును లేకపోగా
యెహోవా నా దేవా, నేను నీ శరణుజొచ్చియున్నాను.

వారు సింహమువలె ముక్కలుగా చీల్చివేయకుండ
నన్ను తప్పించుము, యెహోవా నా దేవా,
నేను ఈ కార్యముచేసినయెడల
నాచేత పాపము జరిగినయెడల
నాతో సమాధానముగా నుండినవానికి
నేను కీడుచేసినయెడల |2|||యెహోవా నా దేవా||
శత్రువు నన్ను తరిమి పట్టుకొననిమ్ము
నా ప్రాణమును నేలకు అణగద్రొక్క నిమ్ము |2|
నా అతిశయాస్పదమును మంటిపాలు చేయనిమ్ము |2|
నిర్నిమిత్తముగా నన్ను బాధించినవారిని
నేను సంరక్షించితిని గదా.
||యెహోవా నా దేవా, నేను నీ శరణుజొచ్చియున్నాను||

యెహోవా, కోపము తెచ్చుకొని లెమ్ము
నా విరోధుల ఆగ్రహము అణచుటకై లెమ్ము |2|
నన్ను ఆదుకొనుటకై మేల్కొనుము |2|
న్యాయవిధిని నీవు, నియమించియున్నావు కదా|2|
||యెహోవా నా దేవా, నేను నీ శరణుజొచ్చియున్నాను||

Kondala Tattu

Kondala Tattu MP3 (Download here

కొండలతట్టు నా కన్నులెత్తుచున్నాను
నాకు సహాయము ఎక్కడనుండి వచ్చును?
యెహోవావలననే నాకు సహాయము కలుగును
ఆయన భూమ్యాకాశములను సృజించినవాడు.
ఆయన నీ పాదమును తొట్రిల్లనియ్యడు
నిన్ను కాపాడువాడు కునుకడు నిద్రపోడు.
యెహోవాయే నిన్ను కాపాడువాడు,
నీ కుడిప్రక్కన యెహోవా నీకు నీడగా ఉండును.
పగలు ఎండ దెబ్బయైనను నీకు తగులదు.
రాత్రి వెన్నెల దెబ్బయైనను నీకు తగులదు.
ఏ అపాయమును రాకుండ
యెహోవా నిన్ను కాపాడును.
ఆయన నీ ప్రాణమును కాపాడును.
ఇది మొదలుకొని నిరంతరము
నీ రాకపోకలయందు యెహోవా నిన్ను కాపాడును.

Yehova Neeve Naa Ashrayam

Yehova Neeve Naa Ashrayam Mp3 (Download here)

యెహోవా నీవే నా ఆశ్రయం ఆధారం
వేటకాని ఉరిలో నుండి విడిపించినావే
నాశనకరమైన తెగులు రాకుండా చేసితివే
దీర్ఘాయువు చేత నన్ను తృప్తి పరతునని
గొప్ప చేతునని అభయమందించిన
||యెహోవా నీవే నా ఆశ్రయం ||

రాత్రి కలుగు భయమునకైన
పగలు ఎగురు బాణముకైన
చీకటిలో సంచరించు
ఎటువంటి తెగులునుకైనా
మధ్యాహ్నమందున
పాడు చేయు రోగముకైన
జడియకుము నేనున్నానని
గొప్ప అభయమందించిన
||యెహోవా నీవే నా ఆశ్రయం ||

వేయి మంది నీ ప్రక్క పడిన
పదివేలుగ కుడి ప్రక్క కూలిన
ఆపదలు ఏ అపాయములు
నీ దరికి చేరలేవు
నిన్ను కాచి కాపాడుటకు
నా దూతలకాజ్ఞాపింతును, కనుక
నీవు భయపడవలదని వాగ్దానమిచ్చిన
||యెహోవా నీవే నా ఆశ్రయం ||

Yehova Rajyamu

Yehova Rajyamu MP3 (Download here)

“తన భక్తుల ప్రాణములను ఆయన కాపాడుచున్నాడు. -కీర్తన 97:10

యెహోవా రాజ్యము చేయుచున్నాడు, భూలోకమంతయు ఆనందమే
యెహోవా రాజ్యము చేయుచున్నాడు, ద్వీపములన్నిట సంతోషమే
హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా ఆమెన్ |2|

నీతి న్యాయములను సింహాసనమునకు ఆధారము చేసెను |2|
ఆయన నీతిని ఆకాశము సైతం వివరించుచున్నది |2|
||యెహోవా రాజ్యము చేయుచున్నాడు||

నీతిమంతులను కాపాడువాడు కునుకడు నిద్రించడు |2|
ఆయన పరిశుద్ధ నామమునుబట్టి స్తుతులను చెల్లించుడి |2|
||యెహోవా రాజ్యము చేయుచున్నాడు||

Nee Gudilo Nivasinchuta

“జీవముగల దేవుని దర్శించుటకు నా హృదయమును
నా శరీరమును ఆనందముతో కేకలు వేయుచున్నవి.”
 -కీర్తన 84:2

నీ గుడిలో నివసించుట నాదు భాగ్యము
నీ ఒడిలో పవళించుట నాకు క్షేమము |2|
ఒక్క క్షణమైనా వీడిపోకు నా మిత్రమా
ఓంటరిని చేసి వెళ్ళిపోకు ఐశ్వర్యమా,
ఒక్క క్షణమైనా వీడిపోకుమా
ఓంటరిని చేసి వెళ్ళిపోకుమా
|| నీ గుడిలో నివసించుట||

నీ మందిరమందు ఒక రోజు మేము
గడిపామంటే చాలయ్యా యేసయ్యా,
ఈ లోకమందు గడిపిన రోజులన్నీ
అందుకు సరికానేకావు యేసయ్యా |2|
నీ చెంతగా చేరాలని, నీ పాటలే పాడాలని
గొప్ప ఆశతో ఉన్నానయా  నా ఆశనే తీర్చాలయా
|| నీ గుడిలో నివసించుట||

గూటిస్థలమందు పిల్లలు చేరుకొనుటకు
వానకోయిలకు ధన్యతా యేసయ్యా,
బలిపీఠమందు బలములేని మాకు
నివసింప భాగ్యమా యేసయ్యా |2|
నీ పాటలే పాడాలని నీ చెంతగా చేరాలని
గొప్ప ఆశతో ఉన్నానయా  నా ఆశనే తీర్చాలయా
|| నీ గుడిలో నివసించుట||

Daiva Putrulara

Daiva Putrulara MP3 (Download here

దైవపుత్రులారా, యెహోవాకు ఆరోపించుడి |2|
ప్రభావ మహాత్మ్యములను యెహోవాకు ఆరోపించుడి
యెహోవా నామమునకు చెందవలసిన
ప్రభావమును ఆయనకు ఆరోపించుడి.
||దైవపుత్రులారా||

ప్రతిష్ఠితములగు ఆభరణములను ధరించుకొని
ఆయన యెదుట సాగిలపడుడి,
యెహోవా స్వరము జలములమీద వినబడుచున్నది
మహిమగల దేవుడు ఉరుమువలె గర్జించుచున్నాడు
మహాజలములమీద సంచరించుచున్నాడు
యెహోవా స్వరము బలమైనది
యెహోవా స్వరము ప్రభావము గలది.
యెహోవా స్వరము దేవదారు వృక్షములను విరచును |2|
||దైవపుత్రులారా||

యెహోవా స్వరము అగ్నిజ్వాలలను ప్రజ్వలింప జేయుచున్నది.
యెహోవా స్వరము అరణ్యములను కదలించుచున్నది
యెహోవా కాదేషు అరణ్యమును కదలించును |2|
యెహోవా స్వరము లేళ్ళను ఈనజేయును |2|
అది ఆకులు రాల్చును.
||దైవపుత్రులారా||

ఆయన ఆలయములో నున్నవన్నియు
ఆయనకే ప్రభావము అనుచున్నవి,
యెహోవా ప్రళయజలములమీద ఆసీనుడాయెను
యెహోవా నిత్యము రాజుగా ఆసీనుడైయున్నాడు |2|
యెహోవా తన ప్రజలకు బలము ననుగ్రహించును
యెహోవా తన ప్రజలకు సమాధానము కలుగజేయును.
||దైవపుత్రులారా||

Yevaru Nannu Vadali Pettinanu

ఎవరు నన్ను వదలి పెట్టినను
నా యేసు నన్ను విడచిపెట్టరు |2|,
కునుకుతీయరు నిదురపోరు |2|
తన రెక్కలతో నన్ను కాచును
||ఎవరు నన్ను వదలి పెట్టినను||
1.తల్లి వారే తండ్రి వారే |2|
జోల పాట పాడి కాపాడతారు |2|
||ఎవరు నన్ను వదలి పెట్టినను||
2.వేదనలో కష్టాలు కమ్ముకొచ్చినా  |2|
ఓదార్చి నన్ను కాపాడతారు |2|
||ఎవరు నన్ను వదలి పెట్టినను||
References:
కీర్తనలు 121:3, 91:4, 22:10, 119:50, 94:19
హెబ్రీయులకు 13:5

Ravayya Yesayya

Ravayya Yesayya MP3 (Download here

NEW: New Mobile verses wallpapers posted here.

రావయ్యా యేసయ్యా నా ఇంటికి,
నీ రాకకై నే వేచియుంటిని |3|
కన్నులార నిన్ను చూడాలని|2|
కాచుకొని ఉన్నాను, వేచి నే ఉన్నాను|2|
||రావయ్యా యేసయ్యా||

యథార్థ హృదయముతో నడుచుకొందును,
ఏ దుష్కార్యమును కనులయెదుట ఉంచుకొనను |2|
భక్తిహీనుల క్రియలు నాకు-అంటనియ్యను
మూర్ఖచిత్తుల నుండి తొలగిపోదును |2|
||రావయ్యా యేసయ్యా||

దౌష్ట్యము నేనెన్నడు అనుసరింపను,
నా పొరుగువారికి దూషింపను |2|
అహంకారము గర్వము అంటనియ్యను,
నమ్మకస్థునిగా నే నడచుకొందును |2|
||రావయ్యా యేసయ్యా||

నిర్దోష మార్గమున నడచుకొందును,
మోసము నా యింట నిలువనీయను|2|
అబద్ధికులెవ్వరిని ఆదరింపను,
భక్తిహీనుల మార్గము నే త్రొక్కను|2|
||రావయ్యా యేసయ్యా||

Reference: కీర్తన 101

Mannu Ninnu Sthutinchuna

Mannu Ninnu Sthutinchuna MP3 (Download here

మన్ను నిన్ను స్తుతించునా? – కీర్తన 30:9

మన్ను నిన్ను స్తుతించునా ప్రభువా, సమాధి నిన్ను కీర్తించునా |2|
దేవా యెహోవా రావా కనరావా, కరుణించుము
నన్ను బ్రతికించుము, నిత్యము నేను నిన్ను స్తుతియించెదను

పాడైన స్థలములోని పగిడికంటివోలె** నిశీధిలో నేను తిరుగులాడుచుంటిని |2|
నీటి కొరకు వేచిన గూడబాతువోలె|2| నీదు రాకకై ఎదురుచూచుచుంటిని|2|
||మన్ను నిన్ను స్తుతించునా ప్రభువా||

ఎగిరిపోవు పొగవలె కరిగిపోవుచుంటిని, మరల తిరిగిరాని ఆవిరివలె యుంటిని |2|
నా జీవిత దినములు యుద్ధ దినములాయె|2| నీ చేతి సాయముకై ఎదురుచూచుచుంటిని|2|
||మన్ను నిన్ను స్తుతించునా ప్రభువా||

** కీర్తన 102:3-6

Deva Naa Devudavu Neeve

Deva Naa Devudavu Neeve MP3 (Download here

దేవా, నా దేవుడవు నీవే
వేకువనే నిన్ను వెదకుదును|2|
నీ బలమును ప్రభావమును చూడ
నేనెంతో ఆశతో ఉన్నాను
||దేవా, నా దేవుడవు నీవే||

నీరు లేని దేశమందు దప్పిగొన్నది నా ప్రాణం |2|
నీ మీద ఆశ చేత సొమ్మసిల్లెను నా శరీరము |2|
||దేవా, నా దేవుడవు నీవే||

ఉత్సహించు పెదవులతో నా నోరు చేసేను గానం
నీ రెక్కలు చాటున శరణన్నది నా ప్రాణం |2|
||దేవా, నా దేవుడవు నీవే||

Hrudayama Hrudayama

Hrudayama Hrudayama MP3 (Download here

నా ప్రాణమా, నీవు ఏల క్రుంగియున్నావు? – కీర్తన 43:5

హృదయమా హృదయమా |2|
నీవేల క్రుంగియున్నావు ,
నాలో నీవేల తొందర పడుచున్నావు |2|
హృదయమా హృదయమా |2|

దేవునియందు నిరీక్షణ ఉంచుము
దేవుడే నీకు సహాయం చేయును |2|
ఆయనే నీ రక్షకుడు నీ విమోచకుడు |2|
ఆయనయందే విశ్వాసముంచుము |2|
||హృదయమా హృదయమా||

క్రుంగియున్నవేళలో లేవనెత్తి
మరణము నుండి విడిపించి |2|
శ్రమయు దుఃఖమును తీసి వేసి
సంతోషవస్త్రము ధరింప చేయును |2|
||హృదయమా హృదయమా||

Kurchundunu nee sannidhilo

Kurchundunu nee sannidhilo MP3 (Download here – Right Click – Save

కూర్చుందును నీ  సన్నిధిలో  దేవా  ప్రతి  దినం
ధ్యానింతును నీ  వాక్యమును  దేవా  ప్రతి  క్షణం |2|
నిరంతరం నీ  నామమునే గానము చేసెదను
ప్రతిక్షణం నీ  సన్నిధినే అనుభవించెదను ||కూర్చుందును నీ  సన్నిధిలో||
1. ప్రతి విషయం నీకర్పించెద, నీ  చిత్తముకై  నే  వేచెద  |2|
నీ  స్ఫూర్తినే  పొంది  నే  సాగెద|2|  నీ  నామమునే  హెచ్చించెద |2|
నా అతిశయము  నీవే,  నా  ఆశ్రయము  నీవే
నా  ఆనందము  నీవే,  నా  ఆధారము నీవే
యేసు  యేసు,  యేసు  యేసు ||కూర్చుందును నీ  సన్నిధిలో||
2. ప్రతి దినము నీ ముఖ కాంతితో నా హృదయ దీపము వెలిగించెద |2|
నీ వాక్యానుసారము జీవించెద |2|  నీ ఘన కీర్తిని వివరించెద |2|
నా దుర్గము నీవే, నా ధ్వజము నీవే
నా ధైర్యము నీవే, నా దర్శనం నీవే
యేసు  యేసు,  యేసు  యేసు ||కూర్చుందును నీ  సన్నిధిలో||

Nakentho Priyamu

Nakentho Priyamu MP3

Nakentho Priyamu MP3 Download (Click here)

    • “నీ ధర్మశాస్త్రము నాకెంతో ప్రియముగానున్నది, దినమెల్ల నేను దానిని ధ్యానించుచున్నాను.” – కీర్తన 119:97

నాకెంతో ప్రియము నాకెంతో ప్రియము
నాకెంతో ప్రియము నీ ధర్మశాస్త్రము , దినమెల్ల దానిని ధ్యానించెదను |2|
నాకెంతో ప్రియము నాకెంతో ప్రియము

తేనె కంటే తియ్యనైనది, పాల కంటే తెల్లనైనది |2|
నా ఎముకలన్నిటికి బలమునిచ్చునది
నా నోటికి ఎంతో మధురమైనది
అదరాలకు మధురం, అణువణువునా అమృతం |2| ||నాకెంతో ప్రియము||

వెన్నకంటే కమ్మనైనది, మన్నాకంటే మరువలేనిది |2|
నా కాళ్లకు మార్గం చూపించినది, నా వ్రేళ్లకు యుద్ధం నేర్పించినది
దేహానికి దీపం, ప్రాణానికి ప్రాణం |2| ||నాకెంతో ప్రియము||

Category: Psalms as Telugu Songs

Tags: Psalm 119:97,103,105
Psalm 18:32-34,
Psalm 144:1
Psalm 19:10