Adigo Anjooramu

Adigo Anjooramu MP3 (Download here

NEW: 1 Thessalonians 5 MP4 posted here.

అదిగో అంజూరము ఓ క్రైస్తవ
చిగురించెను చూడుము |2|
ఇదిగో నేను త్వరగా వత్తును
సిద్ధ పడుడి అను స్వరమును వినవా
||అదిగో అంజూరము||

నూట ఇరువది సంవత్సరములు
చాటెను నోవాహు దేవుని వార్తను
పాటించక ప్రభు మాటలు వారలు |2|
నీటిలో మునిగిరి పాఠము నీకిది |2|
||అదిగో అంజూరము||

జ్ఞాపకముంచుము లోతు సతీమణి
శాప నగర ప్రియ స్నేహితురాలు
ఆపద నెరిగియు ఆశలు వీడక |2|
నాశనమొందెను పాఠము నీకిది|2|
||అదిగో అంజూరము||

లోకము మోసము రంగుల వలయము
నాశన కూపము నిరతము శోకము
యేసే మార్గము సత్యము జీవము|2|
యేసుని రాజ్యము నిత్యానందము|2|
||అదిగో అంజూరము||

Twaraga Vastadu Yesayya

Twaraga Vastadu Yesayya MP3 (Download here

త్వరగా వస్తాడు యేసయ్య తరుణము నీకిక లేదయ్యా |2|
కృపా కాలం దాటి పోతే కఠిన శ్రమలు ఎదురవును
రేపు అన్నది నీది కాదు, రక్షనొందుము నేడే నీవు|2|
||త్వరగా వస్తాడు యేసయ్య||

కరుణమూర్తి అయి-వచ్చెన్ మొదటిసారి
మహోగ్రుడై వచ్చున్ రెండవసారి
యూదా గోత్రపు సింహమై తీర్పు చేయ దిగివచ్చున్
రాజులు రణధీరులు భూప్రజలందురు భయపడి వణికెదరు,
తాళగలవా తీర్పును, ఓర్చగలవా ఉగ్రతను |2|
||త్వరగా వస్తాడు యేసయ్య||

సృష్టి లయమై పోవును ఉగ్రత దినమందు
భూమి దద్దరిల్లుచు స్థానము తప్పగా
అయ్యో అయ్యో శ్రమయనుచు గుండె బాదుచు ఏడ్చినా
దొరకదు నీకాశ్రయం ఎటుపోయినా, దుఃఖమే సుమా
ప్రభుని నమ్ము ఈ దినమే తొలగిపోవును ఆ ప్రళయం
ప్రభుని నమ్ము ఈ దినమే తొలగిపోవును ఆ నరకం
||త్వరగా వస్తాడు యేసయ్య||

Vevela Parishuddulatho

Vevela Parishuddulatho MP3 (Download here-Right Click-Save

ప్రభువు తన వేవేల పరిశుద్ధుల పరివారముతో వచ్చును.  –యూదా 1:15

వేవేల పరిశుద్ధులతో యేసు వేగమే రానైయున్నాడు  |2|
మనము మహిమ శరీరము దాల్చి మధ్యాకాశము చేరెదము |2| ||వేవేల పరిశుద్ధులతో||

కోటాను కోట్ల దూతలతో మన యేసు ప్రభువు దిగి వచ్చును |2|
విజయ వీణలు మ్రోగగా  పరమ వరుడు అరుదెంచును |2| ||వేవేల పరిశుద్ధులతో||

గొర్రె పిల్ల పరిణయ విందుకు పిలువబడిన ధన్య జీవులు |2|
పెండ్లి వస్త్రమును ధరియించి వివాహ వేదిక పైనుందురు |2| ||వేవేల పరిశుద్ధులతో||

రాకడ సమయము

———————————————————
లూకా సువార్త 21: 34 -మీ హృదయములు ఒకవేళ తిండివలనను, (లోక) మత్తువలనను, ఐహిక విచారములవలనను మందముగా ఉన్నందున ఆ దినము అకస్మాత్తుగా మీ మీదికి ఉరివచ్చినట్టు రాకుండ మీ విషయమై మీరు జాగ్రత్తగా ఉండుడి.

———————————————————
లూకా సువార్త 12:35-36 మీ నడుములు కట్టుకొనియుండుడి, మీ దీపములు వెలుగుచుండనియ్యుడి. తమ ప్రభువు పెండ్లివిందునుండి వచ్చి తట్టగానే అతనికి తలుపుతీయుటకు అతడెప్పుడు వచ్చునో అని అతనికొరకు ఎదురు చూచు మనుష్యులవలె ఉండుడి.

———————————————————–

ప్రకటన 3:3 – నీవేలాగు ఉపదేశము పొందితివో యేలాగు వింటివో జ్ఞాపకము చేసికొని దానిని గైకొనుచు మారుమనస్సు పొందుము.

రాకడ సమయములో – కడబూర శబ్ధముతో
యేసుని చేరు కొనే – విశ్వాసము నీకుందా (2)
రావయ్య యేసయ్యా – వేగమే రావయ్యా – 2
1. యేసయ్య రాకడ సమయములో – ఎదురేగే రక్షణ నీకుందా?
లోకాశలపై విజయము నీకుందా? (2)
2. ఇంపైన దూప వేదికగా – ఏకాంత ప్రార్ధన నీకుందా? (2)
యేసుని ఆశించే దీన మనస్సుందా ? (2)
3. దినమంతా దేవుని సన్నిదిలో- వాక్యం కొరకు ఆకలి నీకుందా? (2)
యేసు నాధునితో సహవాసం నీకుందా? (2)
4. శ్రమలోన సహనం నీకుందా- స్తుతియించే నాలుక నీకుందా? (2)
ఆత్మలకొరకైన భారం నీకుందా? (2)
5. నీ పాత రోత జీవితము – నీ ఘోర హృదయము మారిందా?(2)
నూతన హృదయముతో ఆరాధన నీకుందా ?(2)
6. అన్నిటి కన్న మిన్నగా – కన్నీటి ప్రార్ధన నీకుందా? (2)
ఎల్లవేళలలో స్తుతి యాగం నీకుందా? (2)

వస్తానని చెప్పినాడు lyrics

Vastanani Cheppinadu Naa Yesu MP3 (Click here to download)

వస్తానని చెప్పినాడు నా యేసు వచ్చి తీరుతాడు నేడో రేపో ||2||
సంఘమా సిద్ధముగా నుండుమా ||2||
సంసిద్ధతతో ఎదురు చూడుమా ||2||
|| వస్తానని చెప్పినాడు |2| ||

గురుతులు జరుగుచుండెను వాక్యము నెరవేరుచుండెను ||2||
జనముపైకి జనమును రాజ్యములపై రాజ్యములు ||2||
యుద్ధములు భూకంపములు ఎటు చూసినా మరణములు ||2||
|| వస్తానని చెప్పినాడు |2| ||

గురిలేని పయనమెచటికో గమనించు గమ్యమేమిటో ||2||
మార్పు లేని మానవా మరణముంది ఎరుగవా
మార్పు లేని మానవా నరకముంది ఎరుగవా
మారు మనసు పొందకపోతే మరి రాదు ఈ సమయము ||2||
|| వస్తానని చెప్పినాడు |2| ||

మహిమ విడచి నరుడై ధరకరుదెంచెను ఆనాడు
మహిమ తోడ వరుడై ధరకరుదెంచును ఈనాడు ||2||
కోటి సూర్య తేజోమాయి కొదమసింహమై రాజు ||2||
తోడేళ్ళను చీల్చి అగ్నికేయును తన మందను మోక్షపురికి నడుపును ||2||
ఆమెన్ హల్లెలూయ ||2|| ||2||
|| వస్తానని చెప్పినాడు|2| ||

ఎటు చూచినా యుద్ధ సమాచారాలు

Etu Choosina MP3 (Click here)
(Click the “Download Arrow” button at the top to listen MP3.)

ఎటు చూచినా యుద్ధ సమాచారాలు
ఎటు చూచినా కరువు భూకంపాలు
ఎటు చూచినా దోపిడి దౌర్జన్యాలు
ఎటు చూచినా ఎన్నో అత్యాచారాలు
ఓ సోదరా సోదరీ రాకడ గురుతులని తెలుసుకో
తినుటకు త్రాగుటకు ఇది సమయమా

1. మందసం ఈ ప్రజలు గుడారములో నివసిస్తుండగా
యోవాబు నీ సేవకులు దండులో ఉండగను
తినుటకు త్రాగుటకు భార్య తో ఉండుటకు
ఇది సమయమా ఇది సమయమా అని
ఆనాడు ఊరియా దావీదు నడిగాడు
ఈనాడు నిన్ను కూడా ప్రభువు అడుగుచున్నాడు ||ఎటు||

2. నా పితరులు యొక్క సమాధులుండు పట్టణము
పాడైపోయెను పాడైపోయెను
యెరుషలేము గుమ్మములు అగ్ని చేత కాల్చబడగా
సంతోషముగా ఉండుటకు ఇది సమయమా అని ఆనాడు
నెహమ్యా ఫరో రాజునడిగాడు
ఈనాడు నిన్ను కూడా ప్రభువు అడుగుచున్నాడు ||ఎటు||

అదిగో అదిగో రెండవ రాకడ

అదిగో అదిగో అదిగో అదిగో రెండవ రాకడ
అది ఉప్పెన లాగ వస్తుందండి రెండవ రాకడ

1. ప్రళయం వలె వచ్చునండి రెండవ రాకడ
అది పరిశుద్దుల కొరకేనండి రెండవ రాకడ

2. మంగళ ధ్వనులు మింటగ మ్రోగను రెండవ రాకడ
ప్రధాన దూత శబ్దము తోను రెండవ రాకడ

3. మేఘారూడై వచ్చును యేసు రెండవ రాకడ
ఎవరికీ వారే ఎత్తబడుదురు రెండవ రాకడ

4. శబ్దం విన్నా సోదరులంతా రెండవ రాకడ
ఎవరికీ వారే ఎత్తబడుదురు రెండవ రాకడ

5. మిగిలిన వారికి ముప్పతిప్పలు రెండవ రాకడ
తప్పుకొనుటకు తావే లేదు రెండవ రాకడ

6. ఆకాశమందు వింతలు కల్గును రెండవ రాకడ
శక్తులు కదలి మింటను రాలును రెండవ రాకడ
7. భరించలేని బాధలు కలుగును రెండవ రాకడ
చద్దామన్నా చావే రాదు రెండవ రాకడ
8. సూర్య చంద్రులు చీకటి కలుగును రెండవ రాకడ
ఎక్కడ చూచిన అందకారమే రెండవ రాకడ
9. ఇద్దరు తిరగలి విసరుచుండగ రెండవ రాకడ
అందులో ఒకరు ఎత్తబడుదురు రెండవ రాకడ
10. ఇద్దరు పొలములో – పనికి వెళ్ళగా రెండవ రాకడ
అందులో ఒకరు ఎత్తబడుదురు రెండవ రాకడ
11. బస్సులో డ్రైవరు ఎగిరి పోవును రెండవ రాకడ
బస్సు గుంటలో బోల్తాపడును రెండవ రాకడ
12. శవమును మోసుకుపోవుచుండగా రెండవ రాకడ
మధ్యలో శవము లేచిపోవును రెండవ రాకడ
13. బడిలో పిల్లలు చదువుచుండగా రెండవ రాకడ
అందులో అందరు ఎత్తబడుదురు రెండవ రాకడ
14. తప్పవు తిప్పలు తక్కిన వారికి రెండవ రాకడ
తప్పుకొనుటకు తావే లేదు రెండవ రాకడ
15. నదిలో నీళ్ళు రక్తం అగును రెండవ రాకడ
త్రాగాలంటే నీరే దొరకదు రెండవ రాకడ

Ade Ade aa Roju

Ade Ade Aaroju MP3 (Click here)
Rakada Roju – Video (Must watch)

అదే అదే ఆ రోజు యేసయ్య ఉగ్రత రోజు
ఏడేండ్ల శ్రమల రోజు పాపులంతా ఏడ్చేరోజు
1. వడగండ్లు కురిసే రోజు, భూమి సగం కాలేరోజు నక్షత్రములు రాలే రోజు
నీరు చేదు అయ్యే రోజు, ఆ నీరు సేవించిన మనుషులంతా చచ్చే రోజు ||అదే||
2. సూర్యుడు నలుపయ్యే రోజు చంద్రుడు ఎరుపయ్యే రోజు
భూకంపం కలుగే రోజు దిక్కులేక అరిచే రోజు
ఆ రోజు శ్రమ నుండి తప్పించే నాధుడు లేడు ||అదే||
3. మిడతల దండొచ్చే రోజు, నీరు రక్తమయ్యే రోజు కోపాగ్ని రగిలే రోజు,
పర్వతములు పగిలే రోజు, ఆ రోజు శ్రమ నుండి తప్పించే నాధుడు లేడు
||అదే||
4. వ్యభిచారులు ఏడ్చే రోజు, మోసగాళ్లు మసలే రోజు
అబద్ధికులు అరిచేరోజు, దొంగలంతా దొరిలే రోజు
ఆ రోజు శ్రమ నుండి తప్పించే నాధుడు లేడు ||అదే||
5. పిల్ల జాడ తల్లికి లేదు తల్లి జాడ పిల్లకులేదు
చెట్టు కొకరై పుట్ట కొకరై అనాధలై అరిచే రోజు
ఆ రోజు శ్రమనుండి తప్పించే నాధుడు ||అదే||
6. ఓ మనిషి యోచింపవా నీ బ్రతుకు ఎలా ఉన్నాదో
బలము చూచి భంగ పడకుమా ధనము చూచి దగా పడకుమా
ఆ రోజు శ్రమనుండి తప్పించే నాధుడు లేడు ||అదే||