Yenthaina Nammadagina

ఎంతైనా నమ్మదగిన దేవుడవయ్యా
నా పక్షమున యుద్ధమాడు శూరుడవయ్యా
తొట్రుపడే ప్రాయములో నేనుండగా
నా కేడెము ఆధారము నా యేసయ్యా
హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ

1. ఎల్లప్పుడు ప్రభువు నిన్ను విడనాడడు
యవ్వన కాలమున కాడిమోయు నరునికి
కృపని బట్టి జాలి పడే నా దేవుడు
నా ప్రార్ధనకు చెవియొగ్గే నీతిసూర్యుడు ||హల్లెలూయ||

2. క్షమనొందని దోషినని అనుకొనవద్దు
నన్ను కాదనుకొని నిన్ను కూడా పిలచుచున్నాడు
సిగ్గు వీడి బిడియపడక ప్రభుని వేడు
ఆపదలో అండైన మహాదేవుడు ||హల్లెలూయ||

Jalari oh jalari

Jalari oh jalari MP3 (Download here)

జాలరి ఓ జాలరి , కాపరి నా మంచి కాపరి |2|
మనుషుల పట్టు జాలరి , ఆత్మల కాయు కాపరి |2|
జాలరి ఓ జాలరి , కాపరి నా మంచి కాపరి

శోకపు సంద్రాలలో , శోధన కెరటాలలో
నిలవరేమీ లేని చిన్ని చేపనయ్యా |2|
మనసున్న మంచి జాలరి , చేర్చవా నీ వలలోకి |2|
మనుషుల పట్టు జాలరి , ఆత్మల కాయు కాపరి |2|
జాలరి ఓ జాలరి , కాపరి నా మంచి కాపరి

చీకటి మార్గాలలో , లోకాశల ముళ్ల కంచెలో
తిరుగులాడుచున్న చిన్ని గొఱ్ఱెనయ్యా |2|
మనసున్న మంచి కాపరి , చేర్చవా నీ దరి |2|
మనుషుల పట్టు జాలరి , ఆత్మల కాయు కాపరి |2|
జాలరి ఓ జాలరి , కాపరి నా మంచి కాపరి |2| ||మనుషుల||

Jalari oh jalari, kapari na manchi kapari |2|
manushula pattu jalari, athmala kayu kapari |2|
jalari oh jalari, kapari na manchi kapari

sokapu sandralalo, sodhana keratalalo
nilavaremi leni chinni chepanayya |2|
manasunna manchi jalari, cherchava nee valaloki |2|
manushula pattu jaralri, athmala kayu kapari |2|
jalari oh jalari, kapari na manchi kapari

Cheekati margalalo, lokasala mulla kanchelo
tiruguladuchunna chinni gorrenayya |2|
manasunna manchi kapari, cherchava nee dari |2|
manushula pattu jaralri, athmala kayu kapari |2|
jalari oh jalari , kapari na manchi kapari |2| ||manushula||

Gali Samudrapu alalatho

Gali Samudrapu alalatho MP3

గాలి సముద్రపు అలలతో నేను – కొట్ట బడి, నెట్టబడి ఉండినప్పుడు(2)
ఆదరించెనూ నీ వాక్యము – లేవనెత్తెనూ నీ హస్తము…(2)
1. శ్రమలలో నాకు తోడుంటివి – మొర్ర పెట్టగా నా మొర్ర వింటివి
ఆదు కొంటివి నన్నాదు కొంటివీ – నీ కృపలో నను బ్రోచితివి (2)
2. వ్యాధులలో నిన్ను వేడు కొనగా – ఆపదలలో నిన్ను ఆశ్రయించగా
చూపితివీ నీ మహిమన్‌ – కొని యాడెదము ప్రియయేసుని (2)

Chemata Raktha Binduvulaye

Chemata Raktha Binduvulaye MP3 (Download here)  

ఆయన వేదనపడి మరింత ఆతురముగా ప్రార్థన చేయగా ఆయన చెమట, నేల పడుచున్న గొప్ప రక్త బిందువులవలె ఆయెను.” లూకా సువార్త 22:45

చెమట రక్త బిందువులాయే |2| చెమట రక్త బిందువులాయే |2|
నా పాపమే యేసయ్యను ఈడ్చగా, నా దోషమే ప్రభుని సిలువేయగా |2|
నా దోషమే ప్రభుని సిలువేయగా,
యేసయ్యా యేసయ్యా , యేసయ్యా నా యేసయ్యా |2|
చెమట రక్త బిందువులాయే |2|

ప్రేతోర్యములో నిన్ను కొట్టగా, రక్త సిక్తమాయే నీ దేహము |2|
కొరడాలతో నిన్ను కొట్టగా , చిల్ల పెంకులాయే నీ దేహము |2|
చాళ్ల వలే ఆయనా, నీ దివ్య దేహము |2|
నా బ్రతుకుని ఆ చాళ్ళలో నీ కృపా |2| నాటగా ఫలింతును ఆత్మీయ ఫలముగా
యేసయ్యా యేసయ్యా , యేసయ్యా నా యేసయ్యా |2|
చెమట రక్త బిందువులాయే |2|

ఘోరమైన ఆ సిలువను మోపగా , నా పాపమే మేకులై నిను చీల్చగా |2|
బల్లెముతో నిన్ను పొడువగా , నా కొరకు జీవ జలము ప్రవహించగా |2|
నీ రూపమే మారెనా, నా ఘోర పాపముకై |2|
కడవరకు నీ కృపలో సాక్షిగా |2|
బ్రతికెదను నీ కొరకు నీ పెండ్లి కుమార్తెగా |2|
యేసయ్యా యేసయ్యా , యేసయ్యా నా యేసయ్యా |2|

చెమట రక్త బిందువులాయే |2| చెమట రక్త బిందువులాయే |2|
నా పాపమే యేసయ్యను ఈడ్చగా, నా దోషమే ప్రభుని సిలువేయగా |2|
నా దోషమే ప్రభుని సిలువేయగా,
యేసయ్యా యేసయ్యా , యేసయ్యా నా యేసయ్యా |2|
చెమట రక్త బిందువులాయే |2|

Chemata Raktha Binduvulaye |2| Chemata Raktha Binduvulaye |2|
Naa papame Yesayyanu eedchaga, naa doshame Prabhuni siluveyaga |2|
naa doshame Prabhuni siluveyaga
Yesayya Yesayya, Yesayya naa Yesayya |2|
Chemata Raktha Binduvulaye |2|

Pretoryamulo ninnu kottaga, raktha sikthamaye nee dehamu |2|
Koradalatho ninnu kottaga, chilla penkulaye nee dehamu |2
chaalla vale ayana, nee divya dehamu |2|
naa bratukuni aa challalo nee krupa |2|
naataga phalintunu athmeeya phalamuga
Yesayya Yesayya, Yesayya naa Yesayya |2|
Chemata Raktha Binduvulaye |2|

Ghoramaina aa siluvanu mopaga, naa papame mekulai ninu cheelchaga |2|
Ballemutho ninnu poduvaga, naa koraku jeeva jalamu pravahinchaga |2|
Nee roopame marena, naa ghora papamukai |2|
Kadavaraku nee krupalo sakshiga |2|
brathikedanu nee koraku nee pendli kumarthega |2|
Yesayya Yesayya, Yesayya naa yesayya |2|

Chemata Raktha Binduvulaye |2|
Naa papame Yesayyanu eedchaga, naa doshame Prabhuni siluveyaga |2|
Na doshame Prabhuni siluveyaga
Yesayya Yesayya, Yesayya naa Yesayya |2|
Chemata Raktha Binduvulaye |2|

Hrudayame Agadhamaina

హృదయమే అగాధమైన లోయరా
మానవులను మలచే కార్ఖానరా
మంచి చెడుల మిళితము పాప పుణ్య ఫలితము
మనిషి మనిషి దోచుకొనే చోటురా

1. ఆదిలోన హవ్వ పడెను – ఆ లోయలో
ఆదామును హతమార్చెను – ఆ లోయలో
పాపమపుడు పుట్టినది – ఆ లోయలో
పురిటికందు ఏడ్చినది – ఆ లోయలో ||హృదయమే||
2. ఆశలణగ ద్రొక్కెను – ఆ లోయలో
యూదా ఇస్కరియోతును – ఆ లోయలో
రాణువులకు నాణెములకు దాసుడాయను
ఘోర మరణమొందెను ఆ లోయలో ||హృదయమే||
3. ఎదేనును దూరపరచె ఆ హృదయము
సిలువ రహదారి వేసే ఆ హృదయము
మదన పడక మారుమనస్సు తుదకు వేడుము
హృదయమిచ్చి తలలు వంచి తుదకు వేడుమా ||హృదయమే||