బంగారు బొమ్మవు నీవమ్మా

Bangaru Bhommavu MP3 (Click here)
(Click the “Download Arrow” button at the top to listen MP3.)

బంగారు బొమ్మవు నీవమ్మా వధువు సంఘమా రావమ్మా
శృంగార ప్రభువు యేసమ్మ వరుడు క్రీస్తు గొరియ పిల్లమ్మ

1. పశ్చాత్తాపమే పెండ్లి చూపులమ్మా- పాప క్షమాపనే నిశ్చితార్దమమ్మా
విరిగిన మనసే వరుని కట్నమమ్మా- నలిగిన హృదయమే పెళ్లి పత్రికమ్మా
గొరియ పిల్ల రక్తములొ తడిచిన – పవిత్ర కన్యవై నిలచేవమ్మా ||బంగారు||

2. కొరడా దెబ్బలే పెండ్లి నలుగమ్మా- అసూయ ద్వేషాలే సుగంధ ద్రవ్యమమ్మా
నెత్తుటి ధారలే పెళ్లి చీరమ్మా – ముళ్ళ కిరీటమే పెండ్లి ముసుగమ్మా
ప్రకాశమానమై నిర్మలమయమై పరిశుద్ధ క్రియలై నడిచేవమ్మా
||బంగారు||

3. కల్వరి కొండే పెళ్లి పీటమ్మా – దేవుని దూతలే పెండ్లి సాక్షులమ్మా
సిలువ దండనే పెండ్లి సూత్రమమ్మా – దూషణ క్రియలే పెండ్లి అక్షింతలమ్మా
సువర్ణమయమై స్వచ్చమైన స్పటికమువలే మెరిసేవమ్మా
||బంగారు||