ఐక్యతను ఇవ్వవా ప్రభూ

Ikyatanu MP3 (Download here

ఐక్యతను ఇవ్వవా ప్రభూ
సమైక్యతను మా సంఘములలో ఉంచవా

1. పెట్టినాడయా సాతాను కలహంబులను
చెదరగొట్టి నాడయా విశ్వాసులను
గద్దించవా తండ్రి అపవాదిని
ఆత్మ బలమును మాకియ్యవా ప్రభు
||ఐక్యత||

2. సడలిన మా చేతులను బలపరచయ్యా
కృంగిన మా కాళ్ళను ధృడపరచయ్యా
తత్తరిల్లు హృదయాలను ధైర్యపరచయ్యా
విశ్వాసములో మమ్ము స్థిరపరచయ్యా
||ఐక్యత||

3. ఆత్మీయ పోరాటం మాకు నేర్పయ్యా
యుద్ధములో జయమును మాకు ఇమ్మయ్యా
జీవింపజేయుమా నీ ఆత్మ ను
ఆత్మల భారము మాకీయవా ప్రభు
||ఐక్యత||

4. కాచినావు సంఘమును నీ దయ వలెనే
నిలిపినావు బండపై నీ కృప వలెనే
చిరకాలం ఐక్యతనే బంధకములతో,
సిద్ధ పరచయ్యా నీ రాకడ కొరకు
||ఐక్యత||

Poratam Athmeeya Poratam

Poratam Athmeeya Poratam MP3 (Click here):

పోరాటం ఆత్మీయ పోరాటం
చివరి శ్వాస వరకు ఈ పోరాటం ఆగదు
సాగి పోవుచున్నాను సిలువను మోసుకొని నా గమ్య స్థానానికి

1. నా యేసుతో కలసి పోరాడుచున్నాను
అపజయమే ఎరుగని జయశీలుడాయనే
నా యేసు కొరకు సమర్పించుకున్నాను
ఆగిపోను నేను సాగిపోవుచున్నాను. ||పోరాటం||

2. నా యేసు వెళ్ళిన మార్గము లేనని
అవమానములైనా ఆవేదనలైనా
నా యేసు కృప నుండి దూరపరచలేవని
ఆగిపోను నేను సాగిపోవుచున్నాను. ||పోరాటం||

3. ఆదియు అంతము లేనివాడు నా యేసు
ఆసీనుడయ్యాడు సింహాసనమందు
ఆ సింహాసనం నా గమ్యస్థానం
ఆగిపోను నేను సాగిపోవుచున్నాను. ||పోరాటం||