యేసు నీ కార్యములు

Yesu Nee Karyamulu (Download here)

యేసు నీ కార్యములు ఎంతో గొప్పవి
తండ్రి నీ తలంపులు లెక్కలేనివి|2|
కంటికి కనపడవు
హృదయానికి అంతుచిక్కవు,
అవి కంటికి కనపడవు
హృదయానికి అంతుచిక్కవు
||యేసు నీ కార్యములు||

కానా విందులో ఒకే మాటతో
అద్భుతము చేసితివి,
చేప కడుపులో ఆశ్చర్యముగా
యోనాను ఉంచితివి|2|
అవి కంటికి కనపడవు
హృదయానికి అంతుచిక్కవు|2|
||యేసు నీ కార్యములు||

షద్రకు,మేషాకు,అబేద్నగో లతో
అగ్నిలో నిలచితివి,
దానియేలుకు సింహపు బోనులో
విజయము నిచ్చితివి|2|
అవి కంటికి కనపడవు
హృదయానికి అంతుచిక్కవు|2|
||యేసు నీ కార్యములు||

పౌలు సీలయు ప్రార్ధించగా
చెరసాల బ్రద్దలాయెనే,
గొర్రెల కాపరి దావీదును
రాజును చేసితివి|2|
అవి కంటికి కనపడవు
హృదయానికి అంతుచిక్కవు.|2|
||యేసు నీ కార్యములు||