Deva Jali Choopumu

Deva Jali Choopumu MP3 (Click here to download)

దేవా జాలి చూపుము , నా ప్రార్థన నీవు ఆలకించుము |2|
వ్యర్ధమైన వాటిని చూడకుండా నా కనులను త్రిప్పి వేయుము
హేయమైన మాటలు పలుకుకుండా నా నాలుక అదుపు చేయుము |2|
నా శరీరమందు ఏ పాపమును |2| ఏలనీయకుము |2| ||దేవా ||

అల్ప కాల భోగము ఆశించకుండా నీ కొరకే బ్రతుకనీయుము
క్షణికమైన వాంఛలను కోరకుండా నా హృదయము శుద్ధి చేయుము |2|
నా జీవిత మంతా నీదు చిత్తమే |2| నెరవేర్చ కృప చూపుము |2| ||దేవా ||

చేయగలిగినంత మేలు పొరుగు వానికి చేయుటకు మనసునీయుము
నశియించిపోతున్న ఆత్మలను రక్షింపగ శక్తి నీయుము |2|
నా బ్రతుకు ద్వారా లోకానికి |2| నీ నీతి ప్రకటింపనిమ్ము |2| ||దేవా ||

Alayamlo pravesinchandi

ఆలయంలో ప్రవేశించండి అందరూ
స్వాగతం సుస్వాగతం యేసునామంలో
మీ బ్రతుకులో పాపమా కలతలా
మీ హృదయంలో బాధలా కన్నీరా
మీ కన్నీరంతా తుడిచి వేయు రాజు యేసు కోసం
1. దీక్ష స్వభావంతో ధ్యాన స్వభావమై
వెదకే వారికంతా కనబడు దీపము
యేసురాజు మాటలే వినుట ధన్యము
వినుట వలన విశ్వాసం అధికమధికము
ఆత్మలో దాహము తీరెను రారండి
ఆనందమనందం హల్లెలూయా ||ఆలయంలో||
2. ప్రభు యేసు మాటలే పెదవిలోమాటలై
జీవ వృక్షంబుగా ఫలియించాలని
పెదవితో పలికెదం మంచి మాటలే
హృదయమంతా యేసు ప్రభుని ప్రేమ మాటలై
నింపెదం నిండెదం కోరేదం పొందెదం
ఆనదంమానదం హల్లెలూయా ||ఆలయంలో||

Tallila lalinchunu

తల్లిలా లాలించును తండ్రిలా ప్రేమించును “2”
ముదిమి వచ్చువరకు ఎత్తుకొని ముద్దాడును
చంక పెట్టుకొని కాపాడును యేసయ్యా “తల్లిలా”
1. తల్లియైన మరచునేమో – నేను నిన్ను మరువను
చూడుము నా అరచేతులలో – నిన్ను చెక్కియున్నాను “2”
నీ పాదము త్రొట్రిల్లనీయను నేను నిన్ను కాపాడువాడు
కునుకడు నిదురపోడు అనిచెప్పి వాగ్దానము చేసిన యేసయ్యా “తల్లిలా”
2. పర్వతాలు తొలగవచ్చు – తత్తరిల్లు మెట్టలన్నీ
వీడిపోదు నాకృప నీకు – నానిబంధనా తొలగదు “2”
దిగులుపడకు భయపడకు నిన్ను విమోచించెదా
నీదుభారమంతా మోసి నాదు శాంతినొసగెదా
అనిచెప్పి వాగ్దానము చేసిన యేసయ్యా “తల్లిలా”

Mahima gala Tandri

మహిమగల తండ్రి – మంచి వ్యవసాయకుడు
మహితోటలో నర మొక్కలు నాటించాడు
తన పుత్రుని రక్తనీరు – తడి కట్టి పెంచాడు
తన పరిశుద్ధాత్మను – కాపుగావుంచాడు (2)
కాయవే తోట – కమ్మని కాయలు
పండవే చెట్టా – తియ్యని ఫలములు “కాయవే”
1. నీతి పూత జాతికాపు – ఆత్మశుద్ది ఫలములు
నీ తండ్రి నిల్వచేయు – నిత్య జీవ నిదులు
అనంతమైన ఆత్మ బందు – అమరసుఖ శాంతులు
అనుకూల సమయిమిదే – పూయు పరమ పూతలు (2) “కాయవే”
2. అపవాది కంటబడి – కుంటుబడి పోకు
కాపు పట్టి చేదు పండ్లు – గంపలుగా కాయకు
వెర్రిగా చుక్కలంటి – ఎదిగి విర్రవీగకు
అదిగో గొడ్డలి వేరున – పదును పెట్టియున్నది (2) “కాయవే”
3. ముద్దుగా పెంచాడు – మొద్దుగా నుండకు
ముదముతో పెంచాడు – మోడుబారిపోకు
ముండ్ల పొదలలో కృంగి – మెత్తబడిపోకు
పండ్లుకోయువాడు వచ్చి – అగ్నివేసి పోతాడు

Yehova Naa Kaapari

యెహోవా నా కాపరీ – నాకు లేమిలేదు – 2
పచ్చిక గలచోట్ల – పరుండ జేయును – 2
1. గాఢాందకారపు లోయలలో – నేను నడచినను
ఏ ఆపదలకు భయపడను – నీవు నాతోనుండగా – 2
నా బ్రతుకంతయు – కృపాక్షేమములు వచ్చును – 2 “యెహోవా”
2. నా శత్రువులయొద్ద – బల్లను సిద్ధ పరచెదవు
నూనెతో నా తలను – అంటి యున్నావు – 2
జీవితమంతయూ – నీ సన్నిదిలో గడిపెదను – 2 “యెహోవా”