యుద్ధ వీరులం

Yudha veerulam MP3 (Click here)

యుద్ధ వీరులం – మనము యుద్ధ వీరులం
మహిమాత్మను పొందిన ప్రార్థనా వీరులం
భయపడము జడియము
అపవాదిని ఎదిరించే ఆత్మఖడ్గ యోధులం

1. కృపకు ఆధారమగు – ఆత్మ పొందియున్నాము
పిరికి ఆత్మను పొంది – బానిసలము కాలేదు
బలహీనతలో – మనము బలవంతులమయ్యాము
శక్తిమంతుడగు యేసు – మనలో నిలిచి యుండగా ॥ యుద్ధ ॥

2. విశ్వాసమనే డాలు చేతితో పట్టుకొని
మహిమ శిరస్త్రాణమును – యేసువలన పొందాము
సర్వాంగ కవచమును – ధరించుకొని యున్నాము
స్వీకృత పుత్రాత్మయే – జయం మనకు ఇవ్వగా ॥ యుద్ధ ॥

సీయోను యాత్రికులం

Seeyonu Yatrikulam MP3 (Download here

సీయోను యాత్రికులం సిలువ సైనికులం
విశ్వాస యోధులం శ్రీయేసు శిష్యులం
సిలువను చాటెదం ప్రేమను చూపెదం
ప్రభు యేసు కొరకు జీవించెదం
హల్లెలూయ జయం మనదే  |2|

1. చేతట్టి పాడెదం బాకాలు ఊదెదం
ఆత్మతో పోరాడెదం ఆర్బాటం చేసెదం ||సిలువను||

2. ఎరికోను కూల్చెదం ఎడతెగక ప్రార్దించెదం
సాతాన్నిఎదిరించెదం జయభేరి మ్రోగించెదం ||సిలువను||

3. దివిటీలు వెలిగించెదం ప్రభు రాకడ చాటెదం
సర్వ లోకమునకు సాక్షార్ధమై నిలచెదం ||సిలువను||