Pranamunnantha varaku

Pranamunnantha varaku MP3 (Download here

“ఆదియందు నీవు భూమికి పునాది వేసితివి, ఆకాశములు కూడ నీ చేతిపనులే.” – కీర్తన 102:25 .  “నా జీవితకాలమంతయు నేను యెహోవాను స్తుతించెదను.”  – కీర్తన 146:2

ప్రాణమున్నంత వరకు నే పాడెద
జీవమున్నంత వరకు స్తుతియించెద |2|,
నీ నామం కొనియాడి దినమెల్లా పాడెదను
నీ పలుకే నా స్వరమై జగమంతా చాటెదను |2|
||ప్రాణమున్నంత వరకు||

లోకాన ధనవంతులే పుట్టినా
భూరాజులే భూమిని పాలించినా |2|,
నా శత్రువులు*** నన్ను తరుముచున్నా|2|
నీ చేయి అందించి నడిపించుము |2|
||ప్రాణమున్నంత వరకు||

నీ సిలువ చాటున నను దాయుము
నీ సాక్షిగా నన్ను నడిపించుము |2|,
నీ చేతి పనులను వివరించుట  |2|
నీ వాక్యమును నేను ప్రకటించుట(నెరవేర్చుట) |2|
||ప్రాణమున్నంత వరకు||

శత్రువులు*** (లోకము, సాతాను, శరీరము)

Paralokamandunna Maa Tandri

Paralokamandunna Maa Tandri MP3 (Download here

పరిశుద్ధుడు పరిశుద్ధుడు |2|
పరలోకమందున్న మా తండ్రీ
నీ నామము పరిశుద్ధ పరచబడునుగాక
నీ రాజ్యము మాకు వచ్చునుగాక |2|

నీ చిత్తము పరలోకమందు నెరవేరుచుండునట్లుగా |2|
ఈ భూమియందును నెరవేరునుగాక |2|
|| పరలోకమందున్న మా తండ్రీ||
పరిశుద్ధుడు పరిశుద్ధుడు |2|

మాకు కావలసిన ఆహారము అనుదినము
నీవు మాకు దయచేయుము |2| ,
మా ఋణస్థులను మేము క్షమియించినట్లు
నీవు మా ఋణములను క్షమియించుము |2|
|| పరలోకమందున్న మా తండ్రీ||

మమ్ములను శోధనలో పడనీయక
కీడునుండి మమ్ములను తప్పింపుము |2| ,
ఎందుచేతననగా రాజ్యము బలము
మహిమ నిరంతరం నీవైయున్నావు |2|
|| పరలోకమందున్న మా తండ్రీ ||
పరిశుద్ధుడు పరిశుద్ధుడు |2|

Shiramu meeda mulla sakshiga

Shiramu meeda mulla sakshiga MP3 (Download here)

శిరము మీద ముళ్ళ సాక్షిగా, కార్చిన కన్నీళ్ల సాక్షిగా |2|
పొందిన గాయాల సాక్షిగా, చిందిన రుధిరంబు సాక్షిగా  |2|
యేసు నిన్ను పిలచుచున్నాడు, నీకొరకే  నిలచియున్నాడు |3|

సర్వపాప పరిహారం కోసం, రక్త ప్రోక్షణం అవశ్యమని |2|
మనుషులలో ఎవ్వరు బలికి పనికి రారని
పరమాత్ముడే బలియై తిరిగి లేవాలని
ఆర్య ఋషులు పలికిన ఆ వేద సత్యం, యేసులోనే నెరవేరెనుగా
“సర్వ పాప పరిహరో  రక్త ప్రోక్షణమవశ్యం
తద్రక్తం పరమాత్మేణా పుణ్యదాన బలియాగం”
ఆర్య ఋషులు పలికిన  ఆ వేద సత్యం
క్రీస్తులోనే నెరవేరెనుగా, యేసే బలియైన పరమాత్మ
||శిరము మీద ముళ్ళ సాక్షిగా||

మహాదేవుడే ఇలకేతించి యజ్ఞ పశువుగా వధ పొందాలని |2|
కాళ్ళలోన చేతులలో మూడు మేకులుండాలని
శిరముపైన ఏడు-ముళ్ల గాయాలు పొందాలని
బ్రాహ్మణాలు పలికిన ఆ వేద సత్యం, క్రీస్తులోనే నెరవేరెనుగా
“చత్వారిశృజ్ఞర్తయో అశ్య పాదాద్వి శీర్షే సప్త అస్ధాశో
 అశ్య త్రిదాబద్ధో వృషభో రోరవీతి మహాదేవో మత్యాం ఆభివేశ యితీ”
బ్రాహ్మణాలు పలికిన వేదోక్తి, యేసులోనే నెరవేరెనుగా
యేసే మరణించి లేచిన యజ్ఞ పురుషుడుగా
||శిరము మీద ముళ్ళ సాక్షిగా||

Yesayya Naa Pranamu

Yesayya Naa Pranamu MP3 (Download here

యేసయ్యా నా ప్రాణము నా ప్రాణము (My Soul) నీదేనయ్యా నా యేసయ్యా |2|
నాకున్న సర్వము నీవేనయ్యా నాదంటు ఏదీ లేనే లేదయ్యా |2|
||యేసయ్యా నా ప్రాణము||

నా తల్లి గర్భమున నేనున్నప్పుడే నీ హస్తముతో నన్ను తాకితివే |2|
రూపును దిద్ది ప్రాణము పోసి |2| నను ఇలనిలిపిన నా యేసయ్యా
||యేసయ్యా నా ప్రాణము||

బుద్ధియు జ్ఞానము సర్వ సంపదలు గుప్తమైయున్నవి నీయందే |2|
జ్ఞానమునిచ్చి ఐశ్వర్యముతో |2| నను ఇలమలచిన నా యేసయ్యా
||యేసయ్యా నా ప్రాణము||

లోకములోనుండి నన్ను వేరుచేసి, నీదు ప్రేమతో ప్రత్యేకపరచి |2|
అభిషేకించి ఆశీర్వదించి |2| నన్నిల నడిపిన నా యేసయ్యా
||యేసయ్యా నా ప్రాణము||

Twaraga Vastadu Yesayya

Twaraga Vastadu Yesayya MP3 (Download here

త్వరగా వస్తాడు యేసయ్య తరుణము నీకిక లేదయ్యా |2|
కృపా కాలం దాటి పోతే కఠిన శ్రమలు ఎదురవును
రేపు అన్నది నీది కాదు, రక్షనొందుము నేడే నీవు|2|
||త్వరగా వస్తాడు యేసయ్య||

కరుణమూర్తి అయి-వచ్చెన్ మొదటిసారి
మహోగ్రుడై వచ్చున్ రెండవసారి
యూదా గోత్రపు సింహమై తీర్పు చేయ దిగివచ్చున్
రాజులు రణధీరులు భూప్రజలందురు భయపడి వణికెదరు,
తాళగలవా తీర్పును, ఓర్చగలవా ఉగ్రతను |2|
||త్వరగా వస్తాడు యేసయ్య||

సృష్టి లయమై పోవును ఉగ్రత దినమందు
భూమి దద్దరిల్లుచు స్థానము తప్పగా
అయ్యో అయ్యో శ్రమయనుచు గుండె బాదుచు ఏడ్చినా
దొరకదు నీకాశ్రయం ఎటుపోయినా, దుఃఖమే సుమా
ప్రభుని నమ్ము ఈ దినమే తొలగిపోవును ఆ ప్రళయం
ప్రభుని నమ్ము ఈ దినమే తొలగిపోవును ఆ నరకం
||త్వరగా వస్తాడు యేసయ్య||

Nilupuma Deva Nee Sannidhilo

Nilupuma Deva Nee Sannidhilo MP3 (Download here

నిలుపుమా దేవా నీ సన్నిధిలో, నిలుపుమా దేవా నీ సన్నిధిలో
అల్ఫా ఓమెగయు నీవే ప్రభువా , ఆదియు అంతము నీవే దేవా
||నిలుపుమా దేవా||

మమ్ముల ప్రేమించి నీ రక్తముతో మా పాపములను కడిగియున్నావు |2|
ఆదిసంభూతుడా ఆశ్చర్యకరుడా |2| నీ నామమునకే మహిమ ప్రభావము |2|
||నిలుపుమా దేవా||

మా రక్షకుడవు శక్తిగల దేవుడవు, నీదు మహిమలో ఆనందముతో |2|
పరిశుద్ధాత్మతో ప్రార్ధన చేయుచు |2| నీ నామమునే స్తుతియించెదము |2|
||నిలుపుమా దేవా||

అద్వితీయుడవు ఆలోచనకర్తవు, నిత్యనివాసివి  నిర్మల హృదయుడా |2|
నిరుపమాన దివ్య తేజోమయుడా |2| నీ నామమునకే స్తుతియు ఘనతయు |2|
||నిలుపుమా దేవా||

Oh Manasa Digulu Chendaku

NEW: New MP4 Videos (with Holy Bible Verses Slides) posted here.
ఓ మనసా దిగులు చెందకు, ప్రభు యేసుని విడిచి వెళ్ళకు |2|
శ్రమలు నిన్ను చుట్టినా భీతి చెందకు |2|
||ఓ మనసా దిగులు చెందకు ||
1. అవిశ్వాసివై క్రుంగకు, విశ్వాసిగా సాగు ముందుకు |2|
ప్రభు చూపిన ప్రేమను నీవు మరువకు |2|
సిలువ లేని కిరీటం నీవు కోరకు |2|
||ఓ మనసా దిగులు చెందకు ||
2. కుడి ఎడమల నీకు తోడుగా, నడయాడే దైవము ఉండగా |2|
ఖడ్గమైన కరువైన లెక్క చేయకు, కడవరకు విశ్వాసం నీవు వీడకు |2|
||ఓ మనసా దిగులు చెందకు ||