ప్రకటింతునయ్యా

ప్రకటింతునయ్యా MP3(Download)

ప్రకటింతునయ్యా ప్రతి చోట నీ ప్రేమ వార్త
యేసయ్యా ప్రచురింతు నీదు సువార్త మెస్సయ్యా
రారండి జనులారా రారండి ప్రజలారా
నేను చేసినవన్నీ నాతో చెప్పినవానిని చూశానండీ
అతడే మెస్సయ్యా ఆయనే యేసయ్యా

1. ఎండ వేళలో ఎంతో అలసి ఒంటరిగా ఒకనాడు
యాకోబు బావి దగ్గర కూర్చున్నాడే
నీటికై నేను వెళ్ళగా దాహామిమ్మని నన్నడిగాడే ||అతడే||

2. ఎరుగకనే ఎన్నో ప్రశ్నలు వేసారక అడిగానే
విసుకకనే వినయముగా వివరముగా చెప్పాడే
నేనిచ్చు నీళ్ళు త్రాగితే ఎన్నడు దప్పిక కావన్నాడే ||అతడే||

3. జీవజలం తానన్నాడే జీవం తానన్నాడే
ఆ జలములు త్రాగాలంటే పాపపుకుండ విడువాలంట,
ఆ కుండను అచటే వదలి ఆయన సాక్షిగా నేనొచ్చానే||అతడే||

Jeeva Nadi

జీవనదిని నా హృదయములో ప్రవహింప చేయుమయా (2)

1. శరీరక్రియులన్నియు నాలో నశియించేయుమయు (2)

2. బలహీన సమయుములో నీ బలము ప్రసాదించుము (2)

3. ఆత్మీయవరములతో నన్ను అభిషేకం చేయుమయ (2)

4. ఎండిన ఎముకలన్నియు తిరిగి జీవింపచేయుమయ (2)

Junte Tene Daarala kanna

Junte Tene Daaralu kanna MP3 (Click here)
జుంటె తేనె ధారలకన్న యేసు నామమే మధురం

యేసయ్యా సన్నిధినే మరువజాలను

జీవిత కాలమంతా ఆనదించెదాయేసయ్యనే ఆరాధించెదా

1.యేసయ్య నామమే బహు పూజ్యనీయము

నాపై దృష్టి నిలిపి సంతుష్టిగ నను ఉంచి

నన్నెంతగానో దీవించి జీవజలపు ఊటలతో ఉజ్జీవింపజేసెనే ||జుంటె||

2. యేసయ్య నామమే బలమైన ధుర్గము

నాతోడై నిలచి క్షేమముగా నను దాచి

నన్నెంతగానో కరుణించి పవిత్ర లేఖనాలతో ఉత్తేజింపజేసెనే ||జుంటె||

3. యేసయ్య నామమే పరిమళ తైలము

నాలో నివసించె సువాసనగా నను మార్చె

నన్నెంతగానో ప్రేమించి విజయోత్సవాలతో ఊరేగింపజేసెనే ||జుంటె||