అబ్బా తండ్రి అని

Abba Tandri MP3 (Click here)
(Click the “Download Arrow” button at the top to listen MP3.)

అబ్బా తండ్రి అని ప్రార్థించెదము
విజ్ఞాపనలు యాచనలు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదము

1. విశ్వాస ప్రార్ధన రోగిని స్వస్థపరుచును
ఏకాంత ప్రార్ధన ఆత్మను బలపరుచును
కన్నీటి ప్రార్ధన కనికరము పుట్టించును. || అబ్బా||

2. ఉపవాస ప్రార్ధన ఉజ్జీవం కల్గించును
సహవాస ప్రార్ధన చెర నుండి విడిపించును
ఆత్మలో ప్రార్ధన అభిషేకం నింపును. || అబ్బా||

3. కనిపెట్టు ప్రార్ధన దర్శనము కల్గించును
విజ్ఞాపనా ప్రార్ధన ఆత్మలను కాపాడును
ఆసక్తితో ప్రార్ధన అద్భుతములు జరిగించును. || అబ్బా||