Deva Jali Choopumu

Deva Jali Choopumu MP3 (Click here to download)

దేవా జాలి చూపుము , నా ప్రార్థన నీవు ఆలకించుము |2|
వ్యర్ధమైన వాటిని చూడకుండా నా కనులను త్రిప్పి వేయుము
హేయమైన మాటలు పలుకుకుండా నా నాలుక అదుపు చేయుము |2|
నా శరీరమందు ఏ పాపమును |2| ఏలనీయకుము |2| ||దేవా ||

అల్ప కాల భోగము ఆశించకుండా నీ కొరకే బ్రతుకనీయుము
క్షణికమైన వాంఛలను కోరకుండా నా హృదయము శుద్ధి చేయుము |2|
నా జీవిత మంతా నీదు చిత్తమే |2| నెరవేర్చ కృప చూపుము |2| ||దేవా ||

చేయగలిగినంత మేలు పొరుగు వానికి చేయుటకు మనసునీయుము
నశియించిపోతున్న ఆత్మలను రక్షింపగ శక్తి నీయుము |2|
నా బ్రతుకు ద్వారా లోకానికి |2| నీ నీతి ప్రకటింపనిమ్ము |2| ||దేవా ||

Shuddha Hrudayam

శుద్ధ హృదయం కలుగ జేయుము (2)
నాలోనా . . నాలోనా (2)

నీ వాత్సల్యం నీ బాహుళ్యం నీ కృప కనికరము చూపించుము (2)
పాపము చేశాను దోషినై యున్నాను (2)
తెలిసియున్నది నా అతిక్రమమే తెలిసియున్నవి నా పాపములే (2)
నీ సన్నిధిలో నా పాపములే ఒప్పుకుందునయ్య (2) 

నీ జ్జానమును నీ సత్యమును నా అంతర్యములో పుట్టించుమా (2)
ఉత్సాహ సంతోషం నీ రక్షణానందం (2)
కలుగజేయుము నా హృదయములో (4)
నీ సన్నిధిలో పరిశుద్ధాత్మతో నన్ను నింపుమయ్యా (2)

Asha padaku ee lokam kosam

“Asha Padaku Ee Lokam kosam” MP3 Audio: Click here

ఆశ పడకు ఈ లోకం కోసం చెల్లెమ్మా

ఆశించేది ఏదైనా అది మట్టేనమ్మా

మనిషి ఆశించేది ఏదైనా అది మట్టేనమ్మా ||ఆశ పడకు|| (ప్రసంగి 12:6-7)

ఆశలు రేపే సుందర దేహం మట్టి బొమ్మ ఓ చెల్లెమ్మా

దేహం కోరేదేదైనా అది మట్టిలోనే పుట్టిందమ్మ ||ఆశలు రేపే||

వెండి బంగారు వెలగల వస్త్రం పరిమళ పుష్ప సుగంధములు ||వెండి||

మట్టిలో నుండి వచ్చినవేనని మరువబోకు నా చెల్లెమ్మ ||మట్టి|| || ఆశ పడకు||

అందమైన ఓ సుందర స్త్రీకి గుణము లేక ఫలమేలమ్మా

పంది ముక్కున బంగరు కమ్మి పెట్టిన ఫలితం లేదమ్మా ||అందమైన|| (సామెతలు 11:22)

అందమైన ఆ దీనా షెకెములో హద్దు లేక ఏమయ్యిందమ్మ ||అందమైన||

అంతరంగమున గుణము కలిగిన సారా చరిత్రకెక్కినదమ్మ ||అంతరంగమున|| || ఆశ పడకు|| (ఆదికాండము 34:1, 1 పేతురు 3:4-6)

జాతి కొరకు ఉపవాస దీక్షతో పోరాడిన ఎస్తేరు రాణిలా (ఎస్తేరు 4:16)

నీతి కొరకు తన అత్తను విడువక హత్తుకున్న రూతమ్మ ప్రేమలా ||జాతి కొరకు|| (రూతు 1:14)

కన్నీళ్ళతో ప్రభు కాళ్ళు కడిగి తన కురులతో తుడిచిన మగ్దలేనలా ||కన్నీళ్ళతో||

హన్నా వలె దొర్కా వలె ప్రిస్కిల్ల వలె విశ్వాస వనితలా ||హన్నా వలె||

(యోహాను 12:3, 1 సమూయేలు 2:1-10, అపొస్తలుల కార్యములు 9:36, 18:26, రోమీయులకు 16:3-4)

వారి దీక్షయే వారసత్వమై అనంత రాజ్యపు నిత్య స్వాస్థ్యమై ||వారి దీక్షయే||

పవిత్రమైన హృదయము కలిగి ప్రభువు కొరకు జీవించాలమ్మ ||పవిత్రమైన|| || ఆశ పడకు||