ఒక్కడే యేసు ఒక్కడే

NEW: More Verse images posted here.

ఒక్కడే యేసు ఒక్కడే – ఒక్కడే పరిశుద్ధుడు
ఒక్కడే మహా దేవుడు మహిమోన్నతుడు
లోకానికి రక్షకుడు యేసు ఒక్కడే

పాపిని విడిపించువాడు – యేసు ఒక్కడే
పాపిని ప్రేమించువాడు – యేసు ఒక్కడే
జీవ మార్గమై – సత్య దైవమై
మోక్షానికి చేర్చువాడు యేసు ఒక్కడే

అద్వితీయ దేవుడు యేసు ఒక్కడే
అద్భుతములు చేయువాడు యేసు ఒక్కడే
ఆదరించి ఆశ్రయమిచ్చి
అనుక్షణము కాపాడు యేసు ఒక్కడే

నిత్యము ప్రేమించువాడు యేసు ఒక్కడే
నిత్య శాంతి నిచ్చువాడు యేసు ఒక్కడే
నా వేదనలో నా బాధలలో
నా అండగా నిలుచువాడు యేసు ఒక్కడే

మరణము గెలచినవాడు యేసు ఒక్కడే
మరల రానున్న వాడు యేసు ఒక్కడే
పరిశుద్ధులను ఆ పరమునకు
కొనిపోవువాడు యేసు ఒక్కడే

Prathi Udayam

Prathi Udayam MP3(Download here

ప్రతి ఉదయం నా మొదటి పాట
నా ప్రియ యేసునితో
మందమారుతాలతో* మరుమల్లెలతో
గొంతు కలిపి పాడిన గీతం నా యేసునితో
॥ప్రతి ఉదయం॥

ప్రతిదినము నా మొదటి అడుగు
నా ప్రియ యేసునితో|2|
కొండలైన లోయలైన పొంగిపారు ఏరులైన|2|
వెంట ఉండి నడిపించే నా యేసునితో|2|
॥ప్రతి ఉదయం॥

ప్రతి దినము నా మొదటి మాట
నా ప్రియ యేసునితో |2|
సమయోచిత జ్ఞానమిచ్చి
సరియగు ఆలోచన చెప్పి|2|
నిజమగు నా స్నేహితుడు నా యేసునితో
నిజమగు ఆలోచన చెప్పి
నిజమగు నా స్నేహితుడు నా యేసునితో|2|
॥ప్రతిఉదయం॥

*మందమారుతము = సన్నగాలి

Yatrikulam Paradeshulam

Yatrikulam Paradeshulam MP3 (Download here

యాత్రికులం పరదేశులం, మా ఊరు పరలోకము |2|
ఇది యాత్రా, కానాను యాత్రా, సీయోను యాత్రా,
యెరూషలేము యాత్రా, యెరూషలేము యాత్ర
||యాత్రికులం పరదేశులం||

ఈ యాత్రలో ఆటుపోటులు ఎదురైననూ ఆగిపోను నేను |2|
నా విశ్వాసము కాపాడుకొనుచు, ఇలలో సాగెదనూ |2|
విశ్వాస ప్రేమ నిరీక్షణ నడుపును సీయోనుకు
||యాత్రికులం పరదేశులం||

శత్రుసమూహము వెంటాడినను భయపడనూ ఓడించును ప్రభువే |2|
ఎర్ర సముద్రము ఎదురైననూ, యేసే నడిపించునూ పాయలుగా చేయును|2|
జయమిచ్చును నడిపించును చేర్చును కానానుకు
||యాత్రికులం పరదేశులం||

నమ్మి నమ్మి మనుష్యులను

Nammi Nammi MP3 (Click here)

నమ్మి నమ్మి మనుష్యులను నీవు నమ్మి నమ్మీ
పలుమార్లు మోసపోయావు పలుమార్లు మోసపోయావు
ఇలా… ఎంత కాలము… నీవు సాగిపోదువు…
1. రాజులను నమ్మి – బహుమతిని ప్రేమించినా
బిలాము ఏమాయెను? – దైవదర్శనం కోల్పోయెను (2 Peter 2:15)
నాయేసయ్యను నమ్మిన యెడల
ఉన్నత బహుమానము నీకు నిశ్చయమే \”నమ్మినమ్మి\”
2. ఐశ్వర్యము నమ్మి – వెండి బంగారము ఆశించిన
ఆకాను ఏమాయెను? -అగ్నికి ఆహుతి ఆయెను
నాయేసయ్యను నమ్మిన యెడల (యెహోషువ 7:21,26 )
మహిమైశ్వర్యము నీకు నిశ్చయమే \”నమ్మినమ్మి\”
3. సుఖ భోగము నమ్మి – ధనాపేక్షతో పరుగెత్తిన
గెహజీ ఏమాయెను? – రోగమును సంపాదించెను
నాయేసయ్యను నమ్మిన యెడల ( 2 రాజులు 5:26,27 )
శాశ్వతమైన ఘనత నీకు నిశ్చయమే \”నమ్మినమ్మి\”