Suryuni dharinchi

Suryuni dharinchi MP3 (Click here)
(Click the “Download Arrow” button at the top to listen MP3.)

సూర్యుని ధరించి చంద్రుని మీద నిలచి
ఆకాశంలో కనిపించె ఈమె ఎవరు

1. అది అపోస్తులుల ఉపదేశములను మకుటముగా
ధరించియున్న క్రొత్త నిబంధన సంఘమే  ||సూర్యుని||

2. ఆత్మల భారం ఆత్మాభిషేకం ఆత్మవరములు
కలగియున్న మహిమ కలిగిన సంఘమే  ||సూర్యుని||

3. జయ జీవితము ప్రసవించుటకై వేదన పడుచు
సాక్షియైయున్న కృపలో నిలచిన సంఘమే  ||సూర్యుని||

Yesayya Naa Hrudaya Spandana

Yesayya Naa Hrudaya Spandana MP3 (Click here)
(Click the “Download Arrow” button at the top to listen MP3.)

యేసయ్యా నా హృదయ స్పందన నీవె కదా
విశ్వమంతా నీ నామము ఘననీయము

1. నీవు కనిపించని రోజున
ఒక్క క్షణమొక యుగముగ మారెనే
నీవు నడిపించిన రోజున
యుగయుగాల తలపు మది నిండెనే  ||యేసయ్యా||

2. నీవు మాట్లాడని రోజున
నా కనులకు నిద్దుర కరువాయెనే
నీవు పెదవిప్పిన రోజున
నీ సన్నిధి పచ్చిక బయలాయెనే  ||యేసయ్యా||

3. నీవు వరునిగ విచ్చేయువేళ
నా తలపుల పంట పండునే
వధువునై నేను నిను చేరగ
యుగయుగాలు నన్నేలు కొందువనే ||యేసయ్యా||

Daiva Janulu Kaavali

 Daiva Janulu Kaavali MP3 (Click here)
(Click the “Download Arrow” button at the top to listen MP3.)

దైవజనులు కావాలి కావాలి
దైవజనులు లేవాలి లేవాలి
ప్రభుసేవకు పరుగులెత్తువారు
ప్రభుకోసం ప్రాణమిచ్చెడివారు

1. నశించు పోవు దేశము కొరకు
కన్నీరు కార్చెడి వారు
పడిపోయిన ప్రాకారాలు కట్టగోరు నెహెమ్యాలు
తన ప్రజల పాపాలకై విలపించే సమూయేలులు

2. ప్రభు పిలుపు వినిన వెంటనే
వలలు విడిచి వెంబడించిన
పేతురు వంటి – శిష్యులు కావాలి కావాలి
ఎలిషా వంటి వారు కావాలి లేవాలి

3. కోతెంతో విస్తారము కోసెడి
పని వారు కొదువగా
పొలములో పనిచేయుటకు వస్తావా
నీవు వస్తావా – నీ పనికి జీతమున్నది
బహుమానమున్నది కిరీటమున్నది

Junte Tene Daarala kanna

Junte Tene Daaralu kanna MP3 (Click here)
జుంటె తేనె ధారలకన్న యేసు నామమే మధురం

యేసయ్యా సన్నిధినే మరువజాలను

జీవిత కాలమంతా ఆనదించెదాయేసయ్యనే ఆరాధించెదా

1.యేసయ్య నామమే బహు పూజ్యనీయము

నాపై దృష్టి నిలిపి సంతుష్టిగ నను ఉంచి

నన్నెంతగానో దీవించి జీవజలపు ఊటలతో ఉజ్జీవింపజేసెనే ||జుంటె||

2. యేసయ్య నామమే బలమైన ధుర్గము

నాతోడై నిలచి క్షేమముగా నను దాచి

నన్నెంతగానో కరుణించి పవిత్ర లేఖనాలతో ఉత్తేజింపజేసెనే ||జుంటె||

3. యేసయ్య నామమే పరిమళ తైలము

నాలో నివసించె సువాసనగా నను మార్చె

నన్నెంతగానో ప్రేమించి విజయోత్సవాలతో ఊరేగింపజేసెనే ||జుంటె||

Moodunalla Muchata Kosam

Moodunalla Muchata MP3 (Private song – Download here

మూడునాళ్ళ ముచ్చటకోసం ఈ మనిషి
పడే తపన చూడరా
నీటిబుడగ లాంటిది ఈ జీవితం
ఏనాడు సమసిపోవునో ఎరుగం

1. మనిషికి తన మనసే చెరసాలరా
అవి మమతల మమకారాల బంధాలురా
వళ్ళకాటి వరకేరా భవబంధాలు
నీ కల్లానికి చేరవురా అనుబంధాలు
కల్లలైన కలలు మానుకో
ఎల్లవేళలా ప్రభుని వేడుకో  ||మూడునాళ్ళ||

2. ఇంద్రధనస్సు లాంటిదోయి సంసారము
అది కనిపించి మాయమయే రంగుల వలయం
గడ్డిపువ్వు లాంటిదోయి ఇలలో సౌఖ్యం
అది పాపానికి జీతమురా మనిషికి మరణం
నిత్యమైన సుఖము వెదకరా
నిరతము ఆ ప్రభుని కోరరా ||మూడునాళ్ళ||

3. తప్పిదములు దాచువాడు వర్దిల్లడు
అవి ఒప్పుకొని విడిచిపెట్టు ఓ సోదరా
జిగటగల ఊబి నుండి పైకి లేపి
నీ పాదములను స్థిరముగా నిలుపును ప్రభువే
తీర్పు తీర్చబడకమునుపే
తప్పక ఆ ప్రభుని కోరరా ||మూడునాళ్ళ||

Rende Rendu Daarulu

    Rende Rendu Daarulu MP3 (Click here)   
    (Click the “Download Arrow” button at the top
to listen MP3.)

    రెండే రెండు దారులు ఏ దారి కావాలో మానవా
    ఒకటి పరలోకం మరియొకటి పాతాళం

    1. పరలోకం గొప్ప వెలుగుతో ఉన్నది పరిశుద్ధులకోసం
    రాత్రి ఉండదు పగలు ఉండదు – సూర్యుడుండడు చంద్రుడుండడు
    దేవుడైన ప్రభువే ప్రకాశించుచుండెను –
    యుగయుగములు పరలోక  రాజ్యమేలుచుండెను –
    యేసు ప్రభుని నమ్ముకో పరలోకం చేరుకో ||రెండే||

    2. పాతాళం అగ్నిగుండము ఉన్నది ఘోర పాపుల కోసం
    అగ్ని ఆగదు పురుగు చావదు –
    అగ్నిలోన ధనవంతుడు బాధపడుచుండెను
    అబ్రాహాము రొమ్మున లాజరును చూశాడు –
    లాజరును చూసి దాహమని అడిగాడు –
    యేసు ప్రభుని నమ్ముకో పరలోకం చేరుకో ||రెండే||

    3. పుడతావు నీవు దిగంబరిగ వెళతావు నీవు దిగంబరిగ
    గాలి మేడలు ఎన్నో కడతావు – నాకంటే ఎవ్వరు ఉన్నారంటావు
    లోకంలో ఘోరమైన పాపాలు చేస్తావు – ఆ పాపాలే నిన్ను అగ్నిపాలు చేస్తాయి
   అగ్నిలోన పడకుండా యేసు ప్రభుని నమ్ముకో ||రెండే||

Nee Chethitho

Nee Chetitho MP3 (Click here)
(Click the “Download Arrow” button at the top to listen MP3.)

నీ చేతితో నన్ను పట్టుకో – నీ ఆత్మతో నన్ను నడుపు
శిల్పి చేతిలో శిలను నేను – అనుక్షణము నన్ను చెక్కుము

1. అంధకార లోయలోన సంచరించిన భయములేదు
నీ వాక్యం శక్తి గలది – నాత్రోవకు నిత్య వెలుగు  ||నీ చేతితో ||

2. ఘోర పాపిని నేను తండ్రి – పాప ఊబిలో పడియుంటిని
లేవ నెత్తుము శుద్ది చేయుము పొందనిమ్ము నీదు ప్రేమను  ||నీ చేతితో||

3. ఈ భువిలో రాజు నీవే నా హృదిలో శాంతి నీవే
కుమ్మరించుము నీదు ఆత్మను – జీవితాంతం నీ సేవచేసెదన్‌ ||నీ చేతితో||

Mene Mene Tekel

Mene Mene Tekel MP3 (Click here)
(Click the “Download Arrow” button at the top to listen MP3.)

మెనే మెనే టెకేల్ ఉఫార్సీన్ మెనే మెనే టెకేల్ ఉఫార్సీన్
వ్రాసెను శాసనం దేవుని చేతితో
దేవుని త్రాసులో నీవు తేలిపోదువో

1. న్యాయమైన త్రాసులో నిను తూచును
ఆజ్ఞలనే రాళ్ళు వేసి తేల్చును
రాజగు బెల్షేజరు తెలిపోయును  
మరి నీ గతి ఏమవుతుందో తెలుసుకో ||మెనే||

2. సౌలు రాజు తేలిపోయెను
అహాబు రాజు తేలి కూలెను
నీ క్రియలను బట్టి తీర్పు తీర్చును
మరి నీ గతి ఏమౌతుందో తెలుసుకో ||మెనే||

3. ఘనుడవైన అల్పుడవైనా
ఈ లోకమేలే అధిపతివైనా
క్రీస్తు న్యాయపీఠము ఎదుట
మరి నీ గతి ఏమౌతుందో తెలుసుకో  ||మెనే||

Mandiramuloniki

Mandiramuloniki MP3 (Click here)
(Click the “Download Arrow” button at the top to listen MP3.)

మందిరములోనికి రారండి
వందనీయుడేసుని చేరండి
కలవరమైనా కలతలు ఉన్నా

పల్లవి: తొలగిపోవును ఆలయాన చేరను
కలుగు శాంతులు ఆ ప్రభుని వేడను

1. దేవుని తేజస్సు నిలచే స్థలమిది
క్షేమము కలిగించు ఆశ్రయపురమిది
వెంటాడే భయములైనా వీడని అపజయములైనా ||తొలగిపోవును||

2. సత్యము భోదించు దేవుని బడి ఇది
ప్రేమను చాటించు మమతల గుడి ఇది
శ్రమలవలన చింతలైనా శత్రువులతో చిక్కులైనా ||తొలగిపోవును||

3. శాంతి ప్రసాదించు దీవెన గృహమిది
స్వస్థత కలిగించు అమృత జలనిధి
కుదుటపడని రోగమైనా ఎదను తొలచు వేదనైనా ||తొలగిపోవును||

సిలువలో సాగింది యాత్రా

Telugu Christian Lyrics – Siluvalo Saagindi

Siluvalo Saagindi Yatra MP3 (Click here)
(Click the “Download Arrow” button at the top to listen MP3.)

సిలువలో సాగింది యాత్రా కరుణామయుని దయగల పాత్ర
ఇది ఎవరి కోసమో…. ఈ జగతి కోసమే ఈ జనుల కోసమే…

1. పాలుగారు దేహముపైనా – పాపాత్ముల కొరడాలెన్నో
నాట్యమాడి నాయి నడి వీదిలో నడిపాయి
నోరుతెరువ లేదాయె ప్రేమా…బదులు పలుక లేదాయె ప్రేమా ||ఇది||

2. వెనుక నుండి తన్నింది ఒకరు – తనముందు నిలచి నవ్వింది మరియొకరు
బంతులాడినారు పలు బాధలు పెట్టినారు
నోరుతెరువ లేదాయె ప్రేమా…బదులు పలుక లేదాయె ప్రేమా  ||ఇది||

3. చెళ్ళుమని కొట్టింది ఒకరు – తన మోముపైన ఊసింది మరియొకరు
గేలిచేసి నారు పరిహాస మాడినారు
నోరుతెరువ లేదాయె ప్రేమా…బదులు పలుక లేదాయె ప్రేమా  ||ఇది||

 

 

చూచుచున్న దేవుడవయ్యా

Telugu Christian Lyrics – Choochuchunna Devudavayya

Choochuchunna Devudavayya MP3 (Click here)
(Click the “Download Arrow” button at the top to listen MP3.)

చూచుచున్న దేవుడవయ్యా నన్ను చూచినావు
నీ పేరేమిటో ఎరుగనయ్యా
నా పేరుతో నన్ను పిలిచావయ్యా

1. శారాయి మాటలే విన్నాను అబ్రాముకే భార్యనయ్యాను
ఈ అరణ్య దారిలో ఒంటరినై
దిక్కులేక తిరుగుతున్న –
హాగరును నేను హాగరును ||చూచుచున్న||

2. ఇష్మాయేలుకు తల్లినైతిని
అయినవారితో త్రోసివేయబడితిని
కన్నకొడుకు మరణమును చూడలేక
తల్లడిల్లిపోతున్న తల్లిని నేను  ||చూచుచున్న||

3. పసివాడి మొరను ఆలకించావు
జీవజలములనిచ్చి బ్రతికించావు
నీ సంతతిని దీవింతునని
వాగ్దానమిచ్చిన దేవుడవు –
నీవు గొప్ప దేవుడవు ||చూచుచున్న||

అనుభవానికి వచ్చెనా

Anubhavaniki Vachena MP3 (Click here)
(Click the “Download Arrow” button at the top to listen MP3.)

అనుభవానికి వచ్చెనా అంతులేని వేదన
దైవవాక్కును మీరినందుకు పడెను నీకు కఠిన శిక్ష

1. మట్టినుండి మనిషిగా ప్రభు నిన్ను మలిపినాడే
ప్రక్కటెముకల పడతి చేసి నీకు తోడుగ పంపినాడే
భువిని స్వర్గము చేసి మంచి చెడులను తెలిపినాడే||అనుభవానికి||

2. రాజు నీవు రాలిపడితివి రాయి రప్పల మధ్యన
కలికి మాటకు విలువ ఫలముగ కష్టములు నిన్ను ముసిరెనా
ఆదరించిన ప్రకృతే నిను వికృతముగా మార్చెనా ||అనుభవానికి||

3. మనిషి మనుగడ విలువ ఫలముగ జన్మ పాపము అంటగట్టి
ఆరు ఋతువుల కాల చక్రం పాపభారము తలన పెట్టి
తరతరాలుగా జాతిని మరణ భయమున త్రోసినావే   ||అనుభవానికి||

బంగారు బొమ్మవు నీవమ్మా

Bangaru Bhommavu MP3 (Click here)
(Click the “Download Arrow” button at the top to listen MP3.)

బంగారు బొమ్మవు నీవమ్మా వధువు సంఘమా రావమ్మా
శృంగార ప్రభువు యేసమ్మ వరుడు క్రీస్తు గొరియ పిల్లమ్మ

1. పశ్చాత్తాపమే పెండ్లి చూపులమ్మా- పాప క్షమాపనే నిశ్చితార్దమమ్మా
విరిగిన మనసే వరుని కట్నమమ్మా- నలిగిన హృదయమే పెళ్లి పత్రికమ్మా
గొరియ పిల్ల రక్తములొ తడిచిన – పవిత్ర కన్యవై నిలచేవమ్మా ||బంగారు||

2. కొరడా దెబ్బలే పెండ్లి నలుగమ్మా- అసూయ ద్వేషాలే సుగంధ ద్రవ్యమమ్మా
నెత్తుటి ధారలే పెళ్లి చీరమ్మా – ముళ్ళ కిరీటమే పెండ్లి ముసుగమ్మా
ప్రకాశమానమై నిర్మలమయమై పరిశుద్ధ క్రియలై నడిచేవమ్మా
||బంగారు||

3. కల్వరి కొండే పెళ్లి పీటమ్మా – దేవుని దూతలే పెండ్లి సాక్షులమ్మా
సిలువ దండనే పెండ్లి సూత్రమమ్మా – దూషణ క్రియలే పెండ్లి అక్షింతలమ్మా
సువర్ణమయమై స్వచ్చమైన స్పటికమువలే మెరిసేవమ్మా
||బంగారు||

ఎటు చూచినా యుద్ధ సమాచారాలు

Etu Choosina MP3 (Click here)
(Click the “Download Arrow” button at the top to listen MP3.)

ఎటు చూచినా యుద్ధ సమాచారాలు
ఎటు చూచినా కరువు భూకంపాలు
ఎటు చూచినా దోపిడి దౌర్జన్యాలు
ఎటు చూచినా ఎన్నో అత్యాచారాలు
ఓ సోదరా సోదరీ రాకడ గురుతులని తెలుసుకో
తినుటకు త్రాగుటకు ఇది సమయమా

1. మందసం ఈ ప్రజలు గుడారములో నివసిస్తుండగా
యోవాబు నీ సేవకులు దండులో ఉండగను
తినుటకు త్రాగుటకు భార్య తో ఉండుటకు
ఇది సమయమా ఇది సమయమా అని
ఆనాడు ఊరియా దావీదు నడిగాడు
ఈనాడు నిన్ను కూడా ప్రభువు అడుగుచున్నాడు ||ఎటు||

2. నా పితరులు యొక్క సమాధులుండు పట్టణము
పాడైపోయెను పాడైపోయెను
యెరుషలేము గుమ్మములు అగ్ని చేత కాల్చబడగా
సంతోషముగా ఉండుటకు ఇది సమయమా అని ఆనాడు
నెహమ్యా ఫరో రాజునడిగాడు
ఈనాడు నిన్ను కూడా ప్రభువు అడుగుచున్నాడు ||ఎటు||

అదిగో అదిగో రెండవ రాకడ

అదిగో అదిగో అదిగో అదిగో రెండవ రాకడ
అది ఉప్పెన లాగ వస్తుందండి రెండవ రాకడ

1. ప్రళయం వలె వచ్చునండి రెండవ రాకడ
అది పరిశుద్దుల కొరకేనండి రెండవ రాకడ

2. మంగళ ధ్వనులు మింటగ మ్రోగను రెండవ రాకడ
ప్రధాన దూత శబ్దము తోను రెండవ రాకడ

3. మేఘారూడై వచ్చును యేసు రెండవ రాకడ
ఎవరికీ వారే ఎత్తబడుదురు రెండవ రాకడ

4. శబ్దం విన్నా సోదరులంతా రెండవ రాకడ
ఎవరికీ వారే ఎత్తబడుదురు రెండవ రాకడ

5. మిగిలిన వారికి ముప్పతిప్పలు రెండవ రాకడ
తప్పుకొనుటకు తావే లేదు రెండవ రాకడ

6. ఆకాశమందు వింతలు కల్గును రెండవ రాకడ
శక్తులు కదలి మింటను రాలును రెండవ రాకడ
7. భరించలేని బాధలు కలుగును రెండవ రాకడ
చద్దామన్నా చావే రాదు రెండవ రాకడ
8. సూర్య చంద్రులు చీకటి కలుగును రెండవ రాకడ
ఎక్కడ చూచిన అందకారమే రెండవ రాకడ
9. ఇద్దరు తిరగలి విసరుచుండగ రెండవ రాకడ
అందులో ఒకరు ఎత్తబడుదురు రెండవ రాకడ
10. ఇద్దరు పొలములో – పనికి వెళ్ళగా రెండవ రాకడ
అందులో ఒకరు ఎత్తబడుదురు రెండవ రాకడ
11. బస్సులో డ్రైవరు ఎగిరి పోవును రెండవ రాకడ
బస్సు గుంటలో బోల్తాపడును రెండవ రాకడ
12. శవమును మోసుకుపోవుచుండగా రెండవ రాకడ
మధ్యలో శవము లేచిపోవును రెండవ రాకడ
13. బడిలో పిల్లలు చదువుచుండగా రెండవ రాకడ
అందులో అందరు ఎత్తబడుదురు రెండవ రాకడ
14. తప్పవు తిప్పలు తక్కిన వారికి రెండవ రాకడ
తప్పుకొనుటకు తావే లేదు రెండవ రాకడ
15. నదిలో నీళ్ళు రక్తం అగును రెండవ రాకడ
త్రాగాలంటే నీరే దొరకదు రెండవ రాకడ

రక్షననే ఓడ తలుపు


       
Rakshanane Oda MP3 (Click here)

        రక్షననే ఓడ తలుపు తెరువబడింది –
        నాటి కంటే నేడు మరి చేరువలో ఉంది
        ఆలస్యం చేయకుండా కేవు తీసుకో –
        అవకాశం ఉండగానే రేవు చేరుకో
        1. నూటిరువది వత్సరాల నోవహు సువార్తను
        లెక్కచేయలేదు మరి వెక్కిరించారు ప్రజలు
        వర్షమెక్కువయింది  ఓడ తేలిపోయింది
        తట్టి తడివి చూసినా తలుపు మూయబడింది ||ఆలస్యం||
        2. చిక్కుడు కాయల కూరతో ఒకపూట కూటికొరకై
        జేష్టత్వం అమ్ముకొని బ్రష్టుడైన ఏశావు
        ఒక్క దీవెనైన నాకు దక్కలేదు తండ్రియని
        సమీపించి ఏడ్చినా శాపమే మిగిలింది  ||ఆలస్యం||
        3. మీలో ఒక్కరు నన్నుఅప్పగింప నున్నారని చెప్పగానే
        ప్రభుని మాట ఒప్పుకోలేదు యూదా
        తప్పుకుని తరలిపోయి తల్లకిందులా పడి
        నట్టనడుమ బ్రద్దలై నశియించినాడు చూడు  ||ఆలస్యం||

నేడు ఇక్కడ రేపు ఎక్కడో

Nedu Ikkada Repu Yekkado MP3 (Click here)

నేడు ఇక్కడ రేపు ఎక్కడో తెలియని పయనము ఓ మానవా
దిగంబరిగ నీవు పుడతావు దిగంబరిగానే నీవు వెళతావు

1. నీవు ఉన్నప్పుడే యేసు ప్రభుని నమ్ముకో
నమ్ముకుంటే నీవు మోక్షమునకు పోదువు ||దిగం||

2. అది నాది ఇది నాదని అదిరి పడతావు
చివరికి ఏది రాదు నీ వెంట ||దిగం||

3. ఎప్పుడు పోవునో ఎవ్వరికి తెలియదు
ఎక్కడ ఆగునో ఎవ్వరు ఎరుగరు  ||దిగం||

ఆకాశమందున్న ఆసీనుడా

Akasamandunna MP3 (Click here)

ఆకాశమందున్న ఆసీనుడా
నీ తట్టు కనులెత్తుచున్నాను – నేను
నీ తట్టు కనులెత్తుచున్నాను

1.దారి తప్పిన గొర్రెను నేను
త్రోవ కానక తిరుగుచున్నాను

కరుణించుమా యేసు కాపాడుమా
నీ తట్టు కనులెత్తుచున్నాను  ||ఆకాశ||

2. గాయపడిన గొర్రెను నేను
బాగుచేయుమా పరమవైద్యుడా ||కరుణించుమా||

3. పాప ఊబిలో పడివున్నాను
లేవనెత్తుమా బాగుచేయుమా ||కరుణించుమా||

4.ఎండిపోయిన ఎముకను నేను
ఆత్మ నింపుము బ్రతికించుము ||కరుణించుమా||

5.పనికి రాని పాత్రను నేను
సరిచేయుమా ప్రభు వాడుకొనుమా ||కరుణించుమా||

కొంతసేపు కనపడి

Kontha Sepu Kanapadi MP3 (Download here

కొంతసేపు కనపడి అంతలోనే మాయమయ్యే
ఆవిరివంటిదిరా ఈ జీవితం లోకాన కాదేది శాశ్వతం
యేసే నిజ దేవుడు నిత్య జీవమిస్తాడు మరణమైన జీవమైన నిన్ను విడువడు

1. ఎదురవుతారెందరో నీ పయనములో – నిలిచేది ఎందరో నీ అక్కరలో
వచ్చేదెవరో నీతో మరణము వరకు – ఇచ్చేదెవరో ఆపై నిత్యజీవం నీకు
||యేసే||

2. చెమటోడ్చి దేవుని విడిచి కష్టములోర్చి – ఆస్తులు సంపాదించిన శాంతి ఉన్నదా – ఈ రాత్రే దేవుడు నీ ప్రాణమడిగితే – సంపాదన ఎవరిదగునో యోచించితివా ||యేసే||

3. నీ శాపము తానుమోసి పాపముతీసి  – రక్షణ భాగ్యము నీకై
సిద్ధము చేసి విశ్రాంతినియ్యగా నిన్నుపిలువగా-నిర్లక్ష్యము చేసినా తప్పించుకుందువా ||యేసే||