దేవా మా కుటుంబము

Deva Ma Kutumbamu MP3 (Download)

దేవా మా కుటుంబము,
నీ సేవకే అంకితము |2|
యీ శాప లోకాన, నీ సాక్షులుగా నిలువ
నీ ఆత్మతో నింపుమా|2|||దేవా||

కాపరి మా యేసు ప్రభువే,
కొదువేమి లేదు మాకు
మాకేమి భయము, మాకేమి దిగులు
నీకే వందనములయ్యా,
లోబడి జీవింతుము,
లోపంబులు సవరించుము
లోకాశలు వీడి, లోకంబులోన
నీ మందగా ఉందుము ||దేవా||

సమృద్ధి జీవంబును, సమృద్ధిగా మాకిమ్ము
నెమ్మది గల ఇల్లు, నిమ్మళమగు మనస్సు
ఇమ్మహిలో మాకిమ్మయ్యా
ఇమ్ముగ దయచేయుము,
గిన్నె నిండిన అనుభవము
ఎన్నో కుటుంబాల ధన్యులుగా జేయంగా
మమ్ములను బలపరచుము ||దేవా||

ఏ కీడు రాకుండగా
కాపాడుము మా పిల్లలను
లోక దురు-వ్యసనముల తాకుడు లేకుండా
దాచుము నీ చేతులలో,
ఒలీవ మొక్కల వలెను ద్రాక్షా తీగెలను పోలి
ఫల సంపదలతోను కలకాలము జీవించ
కురుపించుము నీ దీవెనలన్ ||దేవా||

పెంపారు జేయుము మాలో,
సొంపుగ నీ ఘన ప్రేమన్
నింపు మా హృదయములు
శాంతి భాగ్యంబులతో
సంతసంబుగ సాగెదము,
వింతైన నీ ప్రేమను అంతట ప్రకటింతుము
కొంత కాలమే మేము ఉందుము లోకాన
చెంత చేరగ కోరెదము,
నీ చెంత చేరగ కోరెదము.||దేవా||

యెహోవా నా కాపరి

Yehova Na Kapari MP3 (Download)

NEW: More Telugu English Parallel Verse Images posted here.

యెహోవా నా కాపరి నీవేనయ్యా
యెహోవా నా ఊపిరి నీవేనయ్యా
నా గానము నా ధ్యానము
నా గమ్యము నీవయ్యా
నా స్నేహము నా సర్వము
సమస్తము నీవే యేసయ్యా
యెహోవా నా కాపరి నీవేనయ్యా
యెహోవా నా ఊపిరి నీవేనయ్యా

అనుదినము నీ సన్నిధిలో
స్తుతియించి పాడెదను,
తంబురతో సితారాలతో
ఆరాధిస్తూ ఘనపరచదన్,
శోధనలు ఎదురొచ్చినా
వేదనలు వెంటాడినా
బంధువులే వేదించినా
స్నేహితులే శోధించినా
నిను విడువనయ్యా మరువనయ్యా
కడవరకు నీవేనయ్యా

అనుక్షణము నీ వాక్యముతో
నిను వెంబడించెదను,
సంతోషముతో నీ సువార్తకై
కరపత్రిక వలే మారెదన్,
లోకమే భయపెట్టినా
మనుష్యులే  నను చుట్టినా
శక్తులే నను కూల్చినా
మరణమునకు చేర్చినా
నే బెదరనయ్యా జడవనయ్యా
కడవరకు నీవేనయ్యా.

Jalari oh jalari

Jalari oh jalari MP3 (Download here)

జాలరి ఓ జాలరి , కాపరి నా మంచి కాపరి |2|
మనుషుల పట్టు జాలరి , ఆత్మల కాయు కాపరి |2|
జాలరి ఓ జాలరి , కాపరి నా మంచి కాపరి

శోకపు సంద్రాలలో , శోధన కెరటాలలో
నిలవరేమీ లేని చిన్ని చేపనయ్యా |2|
మనసున్న మంచి జాలరి , చేర్చవా నీ వలలోకి |2|
మనుషుల పట్టు జాలరి , ఆత్మల కాయు కాపరి |2|
జాలరి ఓ జాలరి , కాపరి నా మంచి కాపరి

చీకటి మార్గాలలో , లోకాశల ముళ్ల కంచెలో
తిరుగులాడుచున్న చిన్ని గొఱ్ఱెనయ్యా |2|
మనసున్న మంచి కాపరి , చేర్చవా నీ దరి |2|
మనుషుల పట్టు జాలరి , ఆత్మల కాయు కాపరి |2|
జాలరి ఓ జాలరి , కాపరి నా మంచి కాపరి |2| ||మనుషుల||

Jalari oh jalari, kapari na manchi kapari |2|
manushula pattu jalari, athmala kayu kapari |2|
jalari oh jalari, kapari na manchi kapari

sokapu sandralalo, sodhana keratalalo
nilavaremi leni chinni chepanayya |2|
manasunna manchi jalari, cherchava nee valaloki |2|
manushula pattu jaralri, athmala kayu kapari |2|
jalari oh jalari, kapari na manchi kapari

Cheekati margalalo, lokasala mulla kanchelo
tiruguladuchunna chinni gorrenayya |2|
manasunna manchi kapari, cherchava nee dari |2|
manushula pattu jaralri, athmala kayu kapari |2|
jalari oh jalari , kapari na manchi kapari |2| ||manushula||

Yehova Naa Kaapari

యెహోవా నా కాపరీ – నాకు లేమిలేదు – 2
పచ్చిక గలచోట్ల – పరుండ జేయును – 2
1. గాఢాందకారపు లోయలలో – నేను నడచినను
ఏ ఆపదలకు భయపడను – నీవు నాతోనుండగా – 2
నా బ్రతుకంతయు – కృపాక్షేమములు వచ్చును – 2 “యెహోవా”
2. నా శత్రువులయొద్ద – బల్లను సిద్ధ పరచెదవు
నూనెతో నా తలను – అంటి యున్నావు – 2
జీవితమంతయూ – నీ సన్నిదిలో గడిపెదను – 2 “యెహోవా”