Varsha Dharaga

Varsha Dharaga MP3 (Download here)

వర్షధారగా రావా నా యేసయ్యా
ఎండిపోయిన భూమి నేనయ్యా |2|
ఈ నేలలో పంట లేదయ్యా
నా మనస్సులో శాంతి లేదయ్యా |2|
*వర్షధారగా రావా నా యేసయ్యా
ఫలింపజేయుమా పరమేశ్వరా |2|

పాపములన్ని పరిహరించుమా
భయములెల్ల పారద్రోలుమా |2|
యేసు నాథుడా నా రక్షకా! |2|
నీదు కృపతో ఆదరించుమా |2|
||*వర్షధారగా రావా||

మనో వ్యధలను గుణ పరచుమా
తనువు గాయమెల్ల స్వస్థపరచుమా|2|
యేసునాథుడా పరమ వైద్యుడా! |2|
గాయములెల్ల స్వస్థపరచుమా |2|
||*వర్షధారగా రావా||