Marachithinemo

Marachithinemo MP3(Download here)

మరచితినేమో మన్నించు దేవా
ఒంటరినైతి నీ ప్రేమ లేక..|2|

మా జన్మపాపం వెంటాడుతున్నవేళ
సాతాను శోధనలో నలిగిపోతిని నేను|2|,
రోదనలే వేదనలై నీ చెంత చేరువేళ|2|
పాపాల చెర నుంచి రక్షించవా దేవా|2|
||మరచితినేమో||

మోషేను మన్నించి మన్నాను కురిపించి
ఆ ప్రజల గుండెల్లో దీపాన్ని వెలిగించి|2|,
లోకాశ లోయల్లో జారిపోతున్నవేళ..|2|
నీ చేతితో పట్టి నడిపించవా దేవా..|2|
||మరచితినేమో||

జీవాత్మ వెలుగులో నడిపించు ఈ జీవితం
పరమాత్మ తేజమై పలికించు నీ వాక్యం |2|,
ప్రభు యేసు నామం మధురాతి మధురం|2|
లోకాన్ని నడిపించే జీవామృత వేదం..|2|
||మరచితినేమో||

Deva Naalo

Deva Naalo MP3(Download here)

దేవా నాలో నిర్మలహృదిని సృజియింపుము
దేవా నాలో స్థిరమైన మనసును కలిగించుము|2|
నీ సన్నిధి నుండి నన్ను గెంటివేయకయ్యా
నీ ఆత్మను నా నుండి తీసివేయకయ్యా..|2|
*యేసయ్యా నా యేసయ్యా ఈ పాపి..
మనస్సును మార్చుమయ్యా …….|2|

తల్లి గర్భమందే నేను కిల్భిషాత్ముడను…
పుట్టినప్పటినుండియే పాపాత్ముడను…|2|
నా మనస్సును నీ జ్ఞానముతో నింపుము..
హిస్సోపుతో నాలో పాపం కడుగుము..|2|
హిమము కంటే తెల్లగా నన్ను మార్చుము…
నీ రక్షణానందమును కలిగించుము….|2|
||యేసయ్యా నా యేసయ్యా||

విరిగి నలిగిన మనసుతో నిను చేరితిని…
పశ్చ్యాతాపము నొంది ప్రార్ధించితిని..|2|
నా దురితములన్నియు మన్నింపుము….
హిస్సోపుతో నాలో పాపం కడుగుము..|2|
హిమము కంటే తెల్లగా నన్ను మార్చుము..
నీ పరిశుద్ధ వస్త్రమును నాపై కప్పుము.|2|
||యేసయ్యా నా యేసయ్యా||

Pavitra Sanghamu

Pavitra Sanghamu MP3(Download here)

పవిత్ర సంఘము పావనాత్మ సంఘము
సద్భక్తుల సంఘం సౌవార్తిక సంఘం|2|
సంఘ శిరస్సు క్రీస్తుకు ఘనత మహిమ|2|
హల్లెలూయా* హల్లెలూయా……….
హల్లెలూయా హల్లెలూయా……….

క్రీస్తు అనే బండమీద కట్టబడినది ….
భువిని ఏనాటికైన కూలిపోనిది…..|2|
ఆది సంఘము ఆరాధన సంఘం…..
సత్య జీవ మార్గమైన క్రైస్తవ సంఘం|2|
||పవిత్ర సంఘము||

అపొస్తలుల ఆదరణను పంచుకొన్నది..
క్రీస్తు సిలువ సూత్రానికి కేంద్రమైనది…|2|
విశ్వాసుల సంఘం విజ్ఞాపన సంఘం
వాస్తవమై నిలుచునది క్రైస్తవ సంఘం|2|
||పవిత్ర సంఘము||

లోకానికి వెలుగునే యిచ్చుచున్నది
ఉప్పువలె రుచులను పంచుచున్నది|2|
ప్రేమ నేర్పు సంఘము క్షేమమిచ్చు సంఘము
నీతి కలిగి నిల్చునది క్రైస్తవ సంఘం|2|
||పవిత్ర సంఘము||

*హల్లెలూయా = దేవునికి స్తోత్రము

Prathi Udayam

Prathi Udayam MP3(Download here

ప్రతి ఉదయం నా మొదటి పాట
నా ప్రియ యేసునితో
మందమారుతాలతో* మరుమల్లెలతో
గొంతు కలిపి పాడిన గీతం నా యేసునితో
॥ప్రతి ఉదయం॥

ప్రతిదినము నా మొదటి అడుగు
నా ప్రియ యేసునితో|2|
కొండలైన లోయలైన పొంగిపారు ఏరులైన|2|
వెంట ఉండి నడిపించే నా యేసునితో|2|
॥ప్రతి ఉదయం॥

ప్రతి దినము నా మొదటి మాట
నా ప్రియ యేసునితో |2|
సమయోచిత జ్ఞానమిచ్చి
సరియగు ఆలోచన చెప్పి|2|
నిజమగు నా స్నేహితుడు నా యేసునితో
నిజమగు ఆలోచన చెప్పి
నిజమగు నా స్నేహితుడు నా యేసునితో|2|
॥ప్రతిఉదయం॥

*మందమారుతము = సన్నగాలి

Yesayya Nee Prema

Yesayya Nee Prema MP3(Download here)

యేసయ్యా నీ ప్రేమ బాంధవ్యము
మాకు అపురూప సౌందర్యము|2|
చాటింప సాగింతునా…………
నా జ్ఞానము అత్యల్పము ……..|2|
లేఖనాలు విప్పనా ప్రవచనాలు చదవనా
మన్నాను రుచిచూచి మహిమ పరచనా|2|
||యేసయ్యా నీ ప్రేమ||

మోయాబీయ సంతానం శాపగ్రస్తమైనది
నీ వంశావళియందు రూతు చేరియున్నది|2|
నీ జన్మ చరితమే నిలువెత్తు దర్మనము|2|
దిక్కులలో వెదకనా దివ్యతార నడగనా
ఆ తార వెలుగులో నీ ప్రేమను చూపనా
||యేసయ్యా నీ ప్రేమ||

కానాను విందు నీ కరుణతో నిండినది
రసము నింపియుంటివి రాతి బానల నిండ|2|
ఆపదల యందున ఆదుకొనే మిత్రుడవు|2|
అమ్మనే అడగనా రసమునే త్రాగనా
అతిధిగా నున్న నిన్ను ఆరాధించనా
||యేసయ్యా నీ ప్రేమ||

పయనించితి పయనించితి…………….
లోకమందు పయనించితి…………….
రాళ్ళురువ్వి చంపమని………………….
నీ మందర నను నిల్పగ………………|2|
ఎల్లప్పుడు నీతిగా జీవించమంటివి..|2|
నేలగీత నడగనా నీ పాదము తుడువనా
సిలువ నీడ విశ్రమించి సేదదీరనా………
||యేసయ్యా నీ ప్రేమ||

Kalatha Chendaku

Kalatha Chendaku MP3(Download here)  

“కలతచెందకు కరుణించువారు లేరని
వేదనచెందకు రక్షించువారు లేరని”

*కలతచెందకూ కరుణించువారు లేరని
వేదనతో ఉండకూ దుఃఖముతో నిండకూ
దిగులు చెందకు దరిచేర్చువారు రారని
ధైర్యము వీడనీయకూ ఓటమి చెంతచేరకూ
తల్లి నిన్ను మరచినా మరువనన్నవాడు
నిన్నుకాచువాడు యేసు కునికి నిదురపోడు|2|
కుమిలిపోకు నేస్తమా కృంగిపోకు మిత్రమా|2|
||*కలతచెందకూ||

అందరు నావారనీ ప్రేమచూపువారేనని
నాకంటు ప్రాణమిచ్చువారు నాకున్నారని|2|
ఆశించిన యోసేపుకు శ్రమలు పలికే స్వాగతం|2|
అన్నలు అమ్మిననూ అందరూ దూరమైనా
నిందలు పైబడినా చెరసాల పాలైనా|2|
పాపము అంటక ఫలియించెను కొమ్మలా
పరిశుద్ధత కలిగిన భక్తుడు యోసెపులా
ధైర్యము వీడనీయకూ నేస్తమా ఓటమి చెంతచేరకూ|2|
||*కలతచెందకూ||

కడవరకుంటాడని కన్నవారి నొదులుకొని
కలిసి కలకాలం కాపురం చేయాలని |2|
ఆశించిన రూతుకు శ్రమలు పలికే స్వాగతం|2|
బ్రతుకుట బరువైన బ్రతుకే భారమైనా
చెలిమి కరువైనా చెరయే వరమనుచూ|2|
అత్తను హత్తుకున్న అనురాగమూర్తిలా…
ఆదరించబడినా అలనాటి రూతులా..
ధైర్యము వీడనీయకూ నేస్తమా ఓటమి చెంతచేరకూ|2|
||*కలతచెందకూ||