చూచుచున్న దేవుడవయ్యా

Telugu Christian Lyrics – Choochuchunna Devudavayya

Choochuchunna Devudavayya MP3 (Click here)
(Click the “Download Arrow” button at the top to listen MP3.)

చూచుచున్న దేవుడవయ్యా నన్ను చూచినావు
నీ పేరేమిటో ఎరుగనయ్యా
నా పేరుతో నన్ను పిలిచావయ్యా

1. శారాయి మాటలే విన్నాను అబ్రాముకే భార్యనయ్యాను
ఈ అరణ్య దారిలో ఒంటరినై
దిక్కులేక తిరుగుతున్న –
హాగరును నేను హాగరును ||చూచుచున్న||

2. ఇష్మాయేలుకు తల్లినైతిని
అయినవారితో త్రోసివేయబడితిని
కన్నకొడుకు మరణమును చూడలేక
తల్లడిల్లిపోతున్న తల్లిని నేను  ||చూచుచున్న||

3. పసివాడి మొరను ఆలకించావు
జీవజలములనిచ్చి బ్రతికించావు
నీ సంతతిని దీవింతునని
వాగ్దానమిచ్చిన దేవుడవు –
నీవు గొప్ప దేవుడవు ||చూచుచున్న||