Asha padaku ee lokam kosam

“Asha Padaku Ee Lokam kosam” MP3 Audio: Click here

ఆశ పడకు ఈ లోకం కోసం చెల్లెమ్మా

ఆశించేది ఏదైనా అది మట్టేనమ్మా

మనిషి ఆశించేది ఏదైనా అది మట్టేనమ్మా ||ఆశ పడకు|| (ప్రసంగి 12:6-7)

ఆశలు రేపే సుందర దేహం మట్టి బొమ్మ ఓ చెల్లెమ్మా

దేహం కోరేదేదైనా అది మట్టిలోనే పుట్టిందమ్మ ||ఆశలు రేపే||

వెండి బంగారు వెలగల వస్త్రం పరిమళ పుష్ప సుగంధములు ||వెండి||

మట్టిలో నుండి వచ్చినవేనని మరువబోకు నా చెల్లెమ్మ ||మట్టి|| || ఆశ పడకు||

అందమైన ఓ సుందర స్త్రీకి గుణము లేక ఫలమేలమ్మా

పంది ముక్కున బంగరు కమ్మి పెట్టిన ఫలితం లేదమ్మా ||అందమైన|| (సామెతలు 11:22)

అందమైన ఆ దీనా షెకెములో హద్దు లేక ఏమయ్యిందమ్మ ||అందమైన||

అంతరంగమున గుణము కలిగిన సారా చరిత్రకెక్కినదమ్మ ||అంతరంగమున|| || ఆశ పడకు|| (ఆదికాండము 34:1, 1 పేతురు 3:4-6)

జాతి కొరకు ఉపవాస దీక్షతో పోరాడిన ఎస్తేరు రాణిలా (ఎస్తేరు 4:16)

నీతి కొరకు తన అత్తను విడువక హత్తుకున్న రూతమ్మ ప్రేమలా ||జాతి కొరకు|| (రూతు 1:14)

కన్నీళ్ళతో ప్రభు కాళ్ళు కడిగి తన కురులతో తుడిచిన మగ్దలేనలా ||కన్నీళ్ళతో||

హన్నా వలె దొర్కా వలె ప్రిస్కిల్ల వలె విశ్వాస వనితలా ||హన్నా వలె||

(యోహాను 12:3, 1 సమూయేలు 2:1-10, అపొస్తలుల కార్యములు 9:36, 18:26, రోమీయులకు 16:3-4)

వారి దీక్షయే వారసత్వమై అనంత రాజ్యపు నిత్య స్వాస్థ్యమై ||వారి దీక్షయే||

పవిత్రమైన హృదయము కలిగి ప్రభువు కొరకు జీవించాలమ్మ ||పవిత్రమైన|| || ఆశ పడకు||