మాటలాడని మౌనమా v2

Prana tyagamu chesina – Maataladani Mounama MP3 (Click here)

ప్రాణ త్యాగము చేసిన నా దైవమా రక్తమంతా ఓర్చిన నా జీవమా ||2||

మాటలాడని మౌనమా మనసు తెలిసిన దైవమా
మరచిపోని స్నేహమా మోక్ష రాజ్యపు ద్వారమా
యేసు రాజా నీవె నాకిల జీవము నా జీవము
||మాటలాడని||

కఠినులైన మనుషులు సిలువ మ్రానును మోపిరి
కందిపోవు మోమున కంట నీరే నిలిపిరి ||2||
వారి హింసకు బదులుగా క్షమాపననే చూపిన
||మాటలాడని||

ముళ్ళతో కిరీటము అల్లి శిరస్సున గ్రుచ్చిరి
దాహమని నీవడిగిన చేదు చిరకని ఇచ్చిరి ||2||
దూషణలకు బదులుగా ఏమి తెలియని వారని ||2||
క్షమాపననే చూపిన ||మాటలాడని||

శాశ్వతమైనది పరలోక ప్రేమ

Sashwatamainadi Para loka prema MP3 (Click here)

శాశ్వతమైనది పరలోక ప్రేమ క్షణిక మైనది ధరలోని ప్రేమ
గతియించి పోవును లోకాశలన్నీ ||2||
స్థిరమై నిలుచును ప్రభులో అన్నీ ||2||
ఏది కావాలో తెలుసుకో ఏది విడువాలో తేల్చుకో
లోకము కావాలా దైవము కావాలా ||2||

లోకము స్నేహించి పతనమైన తనయుని చూడు వ్యతల పాలాయ
తనువుని ప్రేమించి మోస పోయిన సంసోనుని చూడు నశియించి పోయె
ఏది కావాలో తెలుసుకో ఏది విడువాలో తేల్చుకో
లోకము కావాలా దైవము కావాలా ||2||

ధనమును ప్రేమించి వెర్రి వాడైన మనుషుని చూడు నరకము పాలాయె||2||
దేవుని ప్రేమించి సిరులను కాదన్న||2|| దీనుడు లాజరు పరవశమాయె||2||
ఏది కావాలో తెలుసుకో ఏది విడువాలో తేల్చుకో
లోకము కావాలా దైవము కావాలా ||2||

శాశ్వతమైనది పరలోక ప్రేమ క్షణిక మైనది ధరలోని ప్రేమ
గతియించి పోవును లోకాశలన్నీ ||2||
స్థిరమై నిలుచును ప్రభులో అన్నీ ||2||
ఏది కావాలో తెలుసుకో ఏది విడువాలో తేల్చుకో
లోకము కావాలా దైవము కావాలా ||2||

మాటలాడని మౌనమా

Maataladani Mounama MP3 (Click here)

మాటలాడని మౌనమా మమత చూపిన దైవమా
మరువలేని స్నేహమా మోక్ష రాజ్యపు ద్వారమా
యేసు రాజా నీదు సిలువలో త్యాగము పర జీవము ||మాటలాడని||

కఠినమైన మనుజులు సిలువ మ్రానును మోపిరి
కందిపోవు మోమున కంట నీరే నిలిపిరి
వారి హింసకు బదులుగా క్షమాపననే చూపిన ||2|| ||మాటలాడని||

ముళ్ళతో కిరీటము అల్లి శిరమున గ్రుచ్చిరి
దాహమని నీవడిగిన చేదు చిరకని ఇచ్చిరి
దూషణలకు బదులుగా ఏమి తెలియని వారని ||2|| ||మాటలాడని||

అగ్ని మండించు

Agni Mandinchu MP3 (Click here)

అగ్ని మండించు – అగ్ని మండించు
పరిశుద్ధాత్ముడా – నాలో అగ్ని మండించు – |2|

1. అగ్ని మండుచుండెనే – పొద కాలిపోలేదుగా
ఆ అగ్ని లో నుండే – నీవు మోషేను దర్శించినావే ||అగ్ని||

2. అగ్ని కాల్చి వేసెనే – సిద్ధం చేసిన అర్పణను
ఆ అగ్ని ద్వారానే – నీవు గిద్యోన్ని దైర్యపరచితివే ||అగ్ని||

3. అగ్ని కాన రానందునా – వారు సిగ్గు పడిపోయిరే
నీ అగ్ని దిగిరాగా – నీవు ఏలియాను ఘన పరచినావే ||అగ్ని||

4. ప్రాణ ఆత్మ శరీరము – నీకే అర్పించు చున్నానయ్యా
నీ ఆత్మ వరములతో – నను అలంకరించుమయా ||అగ్ని||

నమ్మి నమ్మి మనుష్యులను

Nammi Nammi MP3 (Click here)

నమ్మి నమ్మి మనుష్యులను నీవు నమ్మి నమ్మీ
పలుమార్లు మోసపోయావు పలుమార్లు మోసపోయావు
ఇలా… ఎంత కాలము… నీవు సాగిపోదువు…
1. రాజులను నమ్మి – బహుమతిని ప్రేమించినా
బిలాము ఏమాయెను? – దైవదర్శనం కోల్పోయెను (2 Peter 2:15)
నాయేసయ్యను నమ్మిన యెడల
ఉన్నత బహుమానము నీకు నిశ్చయమే \”నమ్మినమ్మి\”
2. ఐశ్వర్యము నమ్మి – వెండి బంగారము ఆశించిన
ఆకాను ఏమాయెను? -అగ్నికి ఆహుతి ఆయెను
నాయేసయ్యను నమ్మిన యెడల (యెహోషువ 7:21,26 )
మహిమైశ్వర్యము నీకు నిశ్చయమే \”నమ్మినమ్మి\”
3. సుఖ భోగము నమ్మి – ధనాపేక్షతో పరుగెత్తిన
గెహజీ ఏమాయెను? – రోగమును సంపాదించెను
నాయేసయ్యను నమ్మిన యెడల ( 2 రాజులు 5:26,27 )
శాశ్వతమైన ఘనత నీకు నిశ్చయమే \”నమ్మినమ్మి\”

కృపవెంబడి కృప పొందితిని

Krupa vembadi krupa MP3 (Click here)

కృపవెంబడి కృప పొందితిని నీ కృపలో తలదాచితిని
కృపవెంబడి కృప పొందితిని నీ కృపలో తలదాచితిని
యేసయ్య హల్లేలూయా యేసయ్యా హల్లేలూయా
క్షమవెంబడి క్షమ పొందితిని నీ క్షమలో కొనసాగితిని
మెస్సియ్యా హల్లేలూయా మెస్సియ్యా హల్లేలూయా
కృపా సత్య సంపూర్ణుడా – క్షమా ప్రేమ పరిపూర్ణుడా ||కృప||
1. పాపములో పరి తాపమును – పరితాపములో పరివర్తనను
పరివర్తనలో ప్రవర్తనను-ప్రవర్తనలో పరిశుద్దతను
ప్రశవించెను పరిశుద్దాత్ముడు – ప్రశరించెను శిలువ శిక్షణలో ||2|| ||కృప||
2. ఆత్మలో దీనత్వమును – దీనత్వములో సాత్వీకతను
సాత్వీకతలో మానవత్వమును – మానవత్వములో దైవత్వమును
ప్రసవించెను పరిశుద్దాత్ముడు – ప్రసరించెను దైవ రక్షణలో ||2|| ||కృప||

Poratam Athmeeya Poratam

Poratam Athmeeya Poratam MP3 (Click here):

పోరాటం ఆత్మీయ పోరాటం
చివరి శ్వాస వరకు ఈ పోరాటం ఆగదు
సాగి పోవుచున్నాను సిలువను మోసుకొని నా గమ్య స్థానానికి

1. నా యేసుతో కలసి పోరాడుచున్నాను
అపజయమే ఎరుగని జయశీలుడాయనే
నా యేసు కొరకు సమర్పించుకున్నాను
ఆగిపోను నేను సాగిపోవుచున్నాను. ||పోరాటం||

2. నా యేసు వెళ్ళిన మార్గము లేనని
అవమానములైనా ఆవేదనలైనా
నా యేసు కృప నుండి దూరపరచలేవని
ఆగిపోను నేను సాగిపోవుచున్నాను. ||పోరాటం||

3. ఆదియు అంతము లేనివాడు నా యేసు
ఆసీనుడయ్యాడు సింహాసనమందు
ఆ సింహాసనం నా గమ్యస్థానం
ఆగిపోను నేను సాగిపోవుచున్నాను. ||పోరాటం||