Maratuna Naa Yesuni

మరతునా నా యేసును కలనైన మరతునా నా ప్రభువును
నజరేయుని పిలుపును నా యేసుని ప్రేమను

నను పిలచిన నా ప్రభువు నీతిమంతుడు
నా దేవుడు ఏనాడు మాట తప్పడు
విడువడు నిను ఎడబాయడు ఏనాడు
నీకు నిత్యజీవమిస్తానని పలికిన యేసయ్య మాటను ||మరతునా||

సత్య మార్గమందు నేను సాగిపోవుదున్
నిత్య రాజ్య మహిమలోన పాలు పొందెదన్
కడవరకు విశ్వాసం కొనసాగించి
ఆ కరుణామయుని కన్నులార వీక్షించెదన్ ||మరతునా||

ఇంత గొప్ప శక్తిమంతుడేసు ఉండగా
ఎంత గొప్ప శోధనైనా ఎదురునిలుచునా
చింతయేల జీవితాన క్రీస్తు ఉండగా
అత్యంతమైన ప్రభువు నాకు అండ ఉండగా ||మరతునా||

Swara Dhathaku

Swara Dhathaku MP3 (Download here

స్వరదాతకు స్వరాలాపన  |2|
సర్వేశుని స్తుతి ఆరాధన |2|
సంగీత ధ్వనులతో శృతిలయలతో |2|
ఆలపింతుము ఆరాధింతుము |2|
||స్వరదాతకు||

స్తోత్ర రూపమగు ఓ నూతన గీతం
మా నోట నుంచెను మా యేసుడు|2|
స్తుతి పాత్రునికి మా స్తుతి యాగం |2|
అర్పింతుము ఆరాధింతుము |2|
||స్వరదాతకు||

అల్పులమగు మాపై తన ఆత్మనుంచెను
విలువైన వరాలను మాకు నేర్పెను |2|
ఏమిత్తుము మా గురుదక్షిణ |2|
అర్పింతుము మా జీవితం |2|
||స్వరదాతకు||

Alakinchudi Priyuni Swaramu

ఆలకించుడి ప్రియుని స్వరము వినబడుచున్నది
ఇదిగో నా ప్రియుడు వచ్చుచున్నాడు
ఆనందం ఆనందం ఎంతో ఆనందం
ప్రియుడేసు సహవాసం ఎంతో సంతోషం

1. దవళవర్ణుడు రత్నవర్ణుడు అతి పరిశుద్ధుడు
ఎవరు సాటి లేరు పోటి కాదు ప్రియుడేసుకు ||ఆనందం||

2. ఆదరించి సేదదీర్చె ప్రియుడు నా వాడు
హత్తుకొనును ఎత్తుకొనును ఎంత ధన్యుడను ||ఆనందం||

3. పాపం తీసి శుద్ధి చేసి సౌందర్యము నిచ్చెను
ప్రియుని పైన ఆనుకొనుచు సాగిపోయెదను ||ఆనందం||

4. మేఘములపై ప్రియుడు త్వరగా రానైయున్నాడు
మహిమ ధరించి మేఘములపై ప్రియుని చేరెదను ||ఆనందం||

Keerthana 43

Keerthana 43 MP3 song (Download here

దేవా నాకు న్యాయము తీర్చుమా
భక్తిలేని జనముతో నాకై వ్యాజ్యెమాడుమా|2|

ప్రాణమా నీ వేల క్రుంగియున్నావు
నాలో నీ వేల త్వరపడుచు ఉన్నావు|2|
నా దేవుని నిరీక్షణ మరచిపోకుమా |2|
||దేవా నాకు న్యాయము తీర్చుమా||

శత్రుబాధ చేత నే దుఃఖక్రాంతుడనై
నాకు దుర్గమైన* నీవైపె చూచితినీ |2|
నీ వెలుగు నీ సత్యము నాకు దారి చూపె|2|
||దేవా నాకు న్యాయము తీర్చుమా||

పరిశుద్ధ పర్వతమునకు నీ స్థలమునకు
నన్ను నడిపించు కడవరకు యేసయ్య |2|
నీ బలిపీఠం నీ సన్నిధే నాకు సంతోషం  |2|
||దేవా నాకు న్యాయము తీర్చుమా||

*దుర్గము=కోట (A strong-hold /Citadel)

Psalm 15

యెహోవా నీ గుడారములో MP3 (Download here

1.యెహోవా నీ గుడారములో
అతిధిగా ఉండదగిన వాడెవడు
నీ పరిశుద్ధ పర్వతముమీద
నివసింపదగిన వాడెవడు,
యధార్థమైన ప్రవర్తన
కలిగి నీతి ననుసరించుచు
హృదయ పూర్వకముగా
నిజము పలుకువాడే.
||యెహోవా నీ గుడారములో||

2.అట్టివాడు నాలుకతో
కొండెములాడడు ,
తన చెలికానికి కీడు చేయడు |2|
తన పొరుగువాని మీద
నిందమోపడు    |2|
అతని దృష్టికి నీచుడు అసహ్యుడు
, అతడు యెహోవాయందు
భయభక్తులు గలవారిని సన్మానించును.
||యెహోవా నీ గుడారములో||

3.అతడు ప్రమాణము చేయగా
నష్టము కలిగినను మాట తప్పడు |2|
తన ద్రవ్వము వడ్డి కియ్యడు |2|
నిరపరాధిని చెరుపుటకై
లంచము పుచ్చుకొనడు,
ఈ ప్రకారము చేయువాడు
ఎన్నడును కదల్చబడడు.
||యెహోవా నీ గుడారములో||

Neethi Suryuda Udayinchu

"నా నామమందు భయభక్తులుగల వారగు మీకు నీతి సూర్యుడు ఉదయించును"-మలాకీ 4:2
నీతి సూర్యుడా ఉదయించు నీ వెలుగులో నను నడిపించు|2|
నీ భక్తునిగా నీకు సాక్షిగా నీ దాసుడ-నను కరుణించు |2|
నీతి సూర్యుడా ఉదయించు
1. నీటి వాగులకు దుప్పిని నేనై నీపై ఆశతో చూస్తున్నాను |2|
నీ ప్రేమను నదిగా  ప్రవహించి నాదు దాహమును తీర్చుమయ్యా|2|
||నీతి సూర్యుడా ఉదయించు||
2. నిండు మనసుతో నిను సేవించే నిర్మల చిత్తము నాకిమ్ము|2|
నీ ప్రేమ-ధ్వజమును* దాల్చి నిఖిల జగతికి నిను చాటింతు|2|
||నీతి సూర్యుడా ఉదయించు||
3. నీ గుడారమున ఒక దివసము నిలచిన నాకది వెయ్యేండ్లు |2|
నీ దివ్య ప్రసన్నత** లవలేశము*** తిలకించిన నాకది చాలు|2|
||నీతి సూర్యుడా ఉదయించు||
*ధ్వజము=టెక్కెము=Flag/Banner;
**ప్రసన్నత=Purity;
***లవలేశము=రవ్వంత

Ma Nanna Intiki

మా నాన్న యింటికి నేను వెళ్ళాలి
నా తండ్రి యేసుని నేను చూడాలి
మా నాన్న యింటిలో ఆదరణ ఉన్నది
మా నాన్న యింటిలో సంతోషం ఉన్నది
మా నాన్న యింటిలో నాట్యమున్నది
1. మగ్ధలేని మరియలాగా నీ పాదాలు చేరెదను
కన్నీటితో నేను కడిగెదను
తల వెంట్రుకలతో తుడిచెదను  ||మా నాన్న యింటికి||
2. బేతనీయ మరియలాగా నీ సన్నిధి చేరెదను
నీ వాక్యమును నేను ధ్యానించెదను
ఎడతెగక నీ సన్నిధి చేరెదను  ||మా నాన్న యింటికి||
3. నీ దివ్య సన్నిధి నాకు మధురముగా ఉన్నదయ్యా
పరలోక ఆనందం పొందెదను
ఈ లోకమును నేను మరిచెదను ||మా నాన్న యింటికి||