Vyardhamu Vyardhamu

వ్యర్ధము వ్యర్ధము సోదరా యేసులేని బ్రతుకు నీకు వ్యర్ధమే
వ్యర్ధము వ్యర్ధము సోదరీ యేసులేని రోజంతా వ్యర్ధమే
యేసుని నమ్ముకుంటే స్వర్గమే స్వర్గమే
యేసుని నమ్మకుంటే నరకమే నరకమే

1. మణులు మాన్యాలు ఎన్ని నీకు ఉన్నా
తరగని ధనరాసులు నీ ఇంట ఉన్నా
బంధూబలగాలు అమితముగా నీకున్నా
పాపాలను క్షమియించే యేసయ్యను లేకున్నా ||వ్యర్ధము||

2. సృష్టిని పరికించే జ్ఞానము నీకెంతున్నా
సృష్టిని పూజించే అనుభవమే నీకున్నా
చిత్ర చిత్ర పనులు చేసి చరిత్రకే ఎక్కుతున్నా
ఈ సృష్టి కి మూలమైన యేసయ్యను లేకున్నా ||వ్యర్ధము||

3. కవుల కల్పనతో దేవుళ్ళను చేసుకున్న
భక్తిలో భ్రమ చెంది గోపురాలు కట్టుకున్నా
మతమౌఢ్యం రేపుకుంటూ రాజ్యాలే ఏలుతున్నా
దేవుళ్ళకు దేవుడైన యేసయ్య లేకున్నా ||వ్యర్ధము||

Special Telugu Christian MP3 songs of the week:
1. Nanu inninallu 

2. Adilo

Yentha Manchi Devudavayya

Yentha Manchi Devudavayya MP3 (Download here

ఎంత మంచి దేవుడవయ్యా యేసయ్యా
ఎంత మంచి దేవుడవయ్యా |2|
ఏ మంచియు నాలో లేదు
నీ మంచితనమే బ్రతికించెను |2|
*సర్వోన్నతుడు సర్వాధికారి
సర్వసృష్టికర్త వందనము |2|
వందనము తండ్రి వందనము దేవా |2|
ఎంత మంచి దేవుడవయ్యా యేసయ్యా
ఎంత మంచి దేవుడవయ్యా |2|

పాడైన దానిని బాగు చేయువాడు
విరిగిన దానిని కట్టువాడు
అవమానానికి రెట్టింపు ఘనతతో
నిత్యానందముతో నింపువాడు|2|
||సర్వోన్నతుడు||

కక్కులు పెట్టబడిన నురిపిడి మ్రానుగా**
నన్ను నియమించి ఉన్నావు
యెహోవాను బట్టి నే సంతోషించెద
ఆయనే నాకు అతిశయము |2|
||సర్వోన్నతుడు||

** యెషయా 41:15
I will make you into a new
threshing sledge(instrument)
with sharp teeth;
You shall thresh the mountains
and beat them small.

NeeVale Nanninthaga

NeeVale Nanninthaga MP3 (Download here

నీవలే నన్నింతగా ప్రేమించలేదెవ్వరు
నీవలె నాకై ప్రాణము ఇవ్వలేదెవ్వరు
నా ప్రాణ ప్రియుడా శ్రీ యేసు విభుడా |2|
నీ ప్రేమ మధురం మధురాతి మధురం|2|
నీ ప్రేమయే నాకాధారము
ప్రభు నీవేగా నాదు ఆశ్రయము
||నీవలే నన్నింతగా||

దారి ప్రక్కన పడియుంటిని
నే దారి తప్పి చెడియుంటిని|2|
యెల్లరు నను దాటిపోయిరి|2|
జాలియే చూపకను
నీవైతే నన్ను లేవనెత్తి
నాకు నీదు జీవమిచ్చి
నీదు గృహమున చేర్చితివే
ప్రభు నాకు సేదను తీర్చితివే
||నీవలె నన్నింతగా||

నాదు గతమును చూడలేదు
నా దోషములను ఎంచలేదు|2|
నీదు రూపును నాదు ముఖమున|2|
చూచి ఎంతో మురిసితివే
నీ రక్తమిచ్చి నన్ను కొంటివి
నీతిమంతునిగా నన్ను తీర్చి
వారసునిగా చేసితివే
ప్రభు నన్ను మహిమ పరచితివే
||నీవలే నన్నింతగా||

Deva Nee Krupa Choppuna

Deva Nee Krupa Choppuna MP3 (Download here

దేవా, నీ కృపచొప్పున నన్ను కరుణింపుము
నీ వాత్సల్య బాహుళ్యముచొప్పున
నా అతిక్రమములు తుడిచివేయుము
నా దోషము పోవునట్లు నన్ను బాగుగా కడుగుము
నా పాపము పోవునట్లు నన్ను పవిత్రపరచుము
||
దేవా, నీ కృపచొప్పున||

ఆంతర్యమున నాకు జ్ఞానము తెలియజేయుదువు
నేను పవిత్రుడనగునట్లు హిస్సోపుతో నా పాపము పరిహరింపుము
హిమముకంటె తెల్లగా నేనుండునట్లు నన్ను కడుగుము.
ఉత్సాహ సంతోషములు నాకు వినిపింపుము
అప్పుడు నీవు విరిచిన యెముకలు హర్షించును
|| 
దేవా, నీ కృపచొప్పున||

నా దోషములన్నిటిని తుడిచివేయుము
స్థిరమైన మనస్సు నూతనముగా నుంచుము
నా దోషములన్నిటిని తుడిచివేయుము
నాయందు శుద్ధహృదయము కలుగజేయుము
నీ సన్నిధిలోనుండి త్రోసివేయకు
నీ పరిశుద్ధాత్మ నానుండి తీసివేయకు
నీ రక్షణానందము నాకు మరల పుట్టించుము
సమ్మతిగలిగిన మనస్సుతో నన్ను దృఢపరచుము.
|| దేవా, నీ కృపచొప్పున||

Yehova Naa Deva

Yehova Naa Deva MP3 (Download here

యెహోవా నా దేవా, నేను నీ శరణుజొచ్చియున్నాను|2|
నన్ను తరుమువారిచేతిలోనుండి నన్ను తప్పించుము.
నన్ను తప్పించువాడెవడును లేకపోగా
యెహోవా నా దేవా, నేను నీ శరణుజొచ్చియున్నాను.

వారు సింహమువలె ముక్కలుగా చీల్చివేయకుండ
నన్ను తప్పించుము, యెహోవా నా దేవా,
నేను ఈ కార్యముచేసినయెడల
నాచేత పాపము జరిగినయెడల
నాతో సమాధానముగా నుండినవానికి
నేను కీడుచేసినయెడల |2|||యెహోవా నా దేవా||
శత్రువు నన్ను తరిమి పట్టుకొననిమ్ము
నా ప్రాణమును నేలకు అణగద్రొక్క నిమ్ము |2|
నా అతిశయాస్పదమును మంటిపాలు చేయనిమ్ము |2|
నిర్నిమిత్తముగా నన్ను బాధించినవారిని
నేను సంరక్షించితిని గదా.
||యెహోవా నా దేవా, నేను నీ శరణుజొచ్చియున్నాను||

యెహోవా, కోపము తెచ్చుకొని లెమ్ము
నా విరోధుల ఆగ్రహము అణచుటకై లెమ్ము |2|
నన్ను ఆదుకొనుటకై మేల్కొనుము |2|
న్యాయవిధిని నీవు, నియమించియున్నావు కదా|2|
||యెహోవా నా దేవా, నేను నీ శరణుజొచ్చియున్నాను||