కుమ్మరి  కుమ్మరి

Kummari Kummari MP3 (Click here)

కుమ్మరి  ఓ  కుమ్మరి  జగతుత్పత్తిదారి
జిగట  మన్నైన  నా  వంక  చల్లగా చూడుమయ్యా

1. పనికిరాని  పాత్రనని  పారవేయకుమా
పొంగి పొరలు  పాత్రగా  నన్ను  నింపుమయా ||కుమ్మరి ||

2. సువార్తలోని  పాత్రలన్నీ  శ్రీ  యేసుని
పొగడుచుండ సాక్షిగా  నుండు  పాత్రగాజేసి 
సత్యముతో నింపుము తండ్రీ   ||కుమ్మరి ||

3. విలువలేని  పాత్రను   నేను  కొనువారు
లేరెవ్వరు వెలలేని  నీదు   రక్తంబుతో
వెలుగొందు   పాత్రగా చేయుమయ్యా   ||కుమ్మరి ||

4. ఆటంకముల నుండి తప్పించి  నన్ను  ఎల్లప్పుడూ కావుమయ్యా
పగిలియున్న  పాత్రను  నేను  సరిచేసి  వాడుమయ్యా ||కుమ్మరి ||

క్రీస్తు సాక్షిగ నీవు ఉంటావా

Kreesthu Saakshiga MP3 (Click here)

క్రీస్తు సాక్షిగ నీవు ఉంటావా
నీదు సాక్ష్యము నిలుపుకుంటావా

అన్యజనుల మధ్యన క్రీస్తు మధురనామము
నీ వలన దూషింపబడుచున్నదా
నీ క్రియల వలన అవమానం పొందుచున్నదా

1. యవ్వనుడు యేసేపు ఐగుప్తు దేశమందున
యెహోవాను ఘనపరిచాడు
పోతెఫరు భార్య యొక్క కామ క్రోధ చేష్టలకు
లొంగక తప్పించుకున్నాడు తన సాక్ష్యము నిలుపుకున్నాడు ||క్రీస్తు||

2. చెరలోనున్న యూదా దాసి సిరియా దేశమందున
యెహోవాను ఘనపరిచింది
కుష్టు రోగి నయమానును షోమ్రోనుకు వెళ్లమన్నది ఎలీషా ప్రవక్త యొద్దకు,
తన సాక్ష్యము నిలుపుకున్నది  ||క్రీస్తు||

3. దైవజనుడు దానియేలు బబులోను దేశమందున
యెహోవాను ఘనపరిచాడు
తన దేవునికే తప్ప అన్యమైన ప్రతిమలకు
ఏ మాత్రం మొక్కనన్నాడు
తన సాక్ష్యము నిలుపుకున్నాడు ||క్రీస్తు||

మా నాన్న యింటికి

Maa Naanna Intiki MP3 (Click here)

మా నాన్న యింటికి నేను వెళ్ళాలి
నా తండ్రి యేసుని నేను చూడాలి
మా నాన్న యింటిలో ఆదరణ ఉన్నది
మా నాన్న యింటిలో సంతోషం ఉన్నది  
మా నాన్న యింటిలో నాట్యమున్నది

1. మగ్ధలేని మరియలాగా నీ పాదాలు చేరెదను
కన్నీటితో నేను కడిగెదను
తల వెంట్రుకలతో తుడిచెదను  ||మా నాన్న యింటికి||

2. బేతనీయ మరియలాగా నీ సన్నిధి చేరెదను
నీ వాక్యమును నేను ధ్యానించెదను
ఎడతెగక నీ సన్నిధి చేరెదను  ||మా నాన్న యింటికి||

3. నీ దివ్య సన్నిధి నాకు మధురముగా ఉన్నదయ్యా
పరలోక ఆనందం పొందెదను
ఈ లోకమును నేను మరిచెదను ||మా నాన్న యింటికి||

అబ్బా తండ్రి అని

Abba Tandri MP3 (Click here)
(Click the “Download Arrow” button at the top to listen MP3.)

అబ్బా తండ్రి అని ప్రార్థించెదము
విజ్ఞాపనలు యాచనలు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదము

1. విశ్వాస ప్రార్ధన రోగిని స్వస్థపరుచును
ఏకాంత ప్రార్ధన ఆత్మను బలపరుచును
కన్నీటి ప్రార్ధన కనికరము పుట్టించును. || అబ్బా||

2. ఉపవాస ప్రార్ధన ఉజ్జీవం కల్గించును
సహవాస ప్రార్ధన చెర నుండి విడిపించును
ఆత్మలో ప్రార్ధన అభిషేకం నింపును. || అబ్బా||

3. కనిపెట్టు ప్రార్ధన దర్శనము కల్గించును
విజ్ఞాపనా ప్రార్ధన ఆత్మలను కాపాడును
ఆసక్తితో ప్రార్ధన అద్భుతములు జరిగించును. || అబ్బా||

ఆశలన్నీ నీ మీదనే

Asalanni Nee meedane MP3 (Click here):

ఆశలన్నీ నీ మీదనే నా ఆశలన్నీ నీ మీదనే
నిరీక్షణ కలిగి ఎదురు చూచుచుంటిని
చెదరిన మనస్సు నలిగిన హృదయం
ఎండిన ఎముకై నేనుంటిని

1. పక్షిరాజు యవ్వనం వలె నూతన పరచుమా
అలయక సొలయక పరుగెత్తెద సేవలో
నీ కొరకై ఆశ కలిగినట్టివారు ధన్యులు
గుప్పిలి విప్పి నా కోరిక తీర్చుమా ||ఆశలన్నీ||

2. వెలుగునిచ్చు జ్యోతినై ఉండాలని
లోకమునకు ఉప్పునై బ్రతకాలని
రోగులకే ఔషదం అవ్వాలని
జీవజలపు నదిగ నేను ప్రవహించాలని ||ఆశలన్నీ||

3. మండుచున్న సంఘములను ప్రభుకొరకై కట్టెద
కోట్లాది ఆత్మలను సిలువ చెంత చేర్చెద
దిక్కులేని వారికి ఆదరణగ నుండెద
కడవరకు నీ ప్రేమను లోకమంత చాటెద ||ఆశలన్నీ||

Ade Ade aa Roju

Ade Ade Aaroju MP3 (Click here)
Rakada Roju – Video (Must watch)

అదే అదే ఆ రోజు యేసయ్య ఉగ్రత రోజు
ఏడేండ్ల శ్రమల రోజు పాపులంతా ఏడ్చేరోజు
1. వడగండ్లు కురిసే రోజు, భూమి సగం కాలేరోజు నక్షత్రములు రాలే రోజు
నీరు చేదు అయ్యే రోజు, ఆ నీరు సేవించిన మనుషులంతా చచ్చే రోజు ||అదే||
2. సూర్యుడు నలుపయ్యే రోజు చంద్రుడు ఎరుపయ్యే రోజు
భూకంపం కలుగే రోజు దిక్కులేక అరిచే రోజు
ఆ రోజు శ్రమ నుండి తప్పించే నాధుడు లేడు ||అదే||
3. మిడతల దండొచ్చే రోజు, నీరు రక్తమయ్యే రోజు కోపాగ్ని రగిలే రోజు,
పర్వతములు పగిలే రోజు, ఆ రోజు శ్రమ నుండి తప్పించే నాధుడు లేడు
||అదే||
4. వ్యభిచారులు ఏడ్చే రోజు, మోసగాళ్లు మసలే రోజు
అబద్ధికులు అరిచేరోజు, దొంగలంతా దొరిలే రోజు
ఆ రోజు శ్రమ నుండి తప్పించే నాధుడు లేడు ||అదే||
5. పిల్ల జాడ తల్లికి లేదు తల్లి జాడ పిల్లకులేదు
చెట్టు కొకరై పుట్ట కొకరై అనాధలై అరిచే రోజు
ఆ రోజు శ్రమనుండి తప్పించే నాధుడు ||అదే||
6. ఓ మనిషి యోచింపవా నీ బ్రతుకు ఎలా ఉన్నాదో
బలము చూచి భంగ పడకుమా ధనము చూచి దగా పడకుమా
ఆ రోజు శ్రమనుండి తప్పించే నాధుడు లేడు ||అదే||

సీయోను యాత్రికులం

Seeyonu Yatrikulam MP3 (Click here)

సీయోను యాత్రికులం సిలువ సైనికులం
విశ్వాస యోధులం శ్రీయేసు శిష్యులం
సిలువను చాటెదం ప్రేమను చూపెదం
ప్రభు యేసు కొరకు జీవించెదం
హల్లెలూయ జయం మనదే  |2|

1. చేతట్టి పాడెదం బాకాలు ఊదెదం
ఆత్మతో పోరాడెదం ఆర్బాటం చేసెదం ||సిలువను||

2. ఎరికోను కూల్చెదం ఎడతెగక ప్రార్దించెదం
సాతాన్నిఎదిరించెదం జయభేరి మ్రోగించెదం ||సిలువను||

3. దివిటీలు వెలిగించెదం ప్రభు రాకడ చాటెదం
సర్వ లోకమునకు సాక్షార్ధమై నిలచెదం ||సిలువను||

Telugu Holy Bible for eReaders and Mobile phones

Telugu Holy Bible for eReaders and Mobile devices
Telugu Holy Bible PDFs for eReaders and Mobile phones – Normal Text
Size (66 PDFs – Click here to download)

Telugu Holy Bible PDFs for eReaders and Mobile phones – Small Text Size
(66 PDFs – Click here to download)

Telugu Holy Bible for Kindle device (.mobi format, Click here to
download)

Book of Psalms (Telugu) PDF for eReader and Mobile phones (with
chapter search in English, click here to view and download)

Mobile apps:

YouVersion.com mobile app added Telugu BSI Bible here.

Telugu Christian Lyrics and Holy Bible Mobile apps – ads free and offline mode (Android or iPhone): http://verseview.info/verseview/?cat=12 (Search for VerseView / VerseView Songbook apps in app store and download two verseview songbook and Holy Bible apps). Go to the settings and change the default language to Telugu in the mobile app.

 

నీ వాక్యమే నన్ను బ్రతికించెను

Nee Vaakyame Nannu Brathikinchenu (MP3 – Click here)

Open the MP3 in Chrome Browser or Click the Download Arrow in other browsers.

నీ వాక్యమే నన్ను బ్రతికించెను
భాధలలో నెమ్మది నిచ్చెను
కృపా శక్తి దయా సత్య సంపూర్ణుడా
వాక్యమైయున్న యేసు వందనమయ్యా

1. జిగటగల ఊభినుండి లేవనెత్తెను
సమతలమగు భూమిపై నన్ను నిలిపెను
నా పాదములకు దీపమాయెను
సత్యమైన మార్గములో నడుపుచుండెను ||నీ వాక్యమే||

2.వాడి గల రెండంచుల ఖడ్గము వలెను
నా లోని సర్వమును విభజించి శోధించి
పాప మాలిన్యము తొలగించి వేయుచు
అనుక్షణము క్రొత్త శక్తి నిచుచున్నది ||నీ వాక్యమే||

3. శత్రువులను ఎదుర్కొనే సర్వాంగ కవచమై
యుద్దమునకు సిద్దమనసు నిచ్చుచున్నది
అపవాది వేయుచున్న అగ్ని భాణములను
ఖడ్గమువలె అడ్డుకొని ఆర్పివేయుచున్నది ||నీ వాక్యమే||

4. పాల వంటిది జుంటె తేనె వంటిది
నా జిహ్వకు మహా మధురమైనది
మేలిమి బంగారుకంటే మిన్నయైనది
రత్న రాశులకన్న కోరతగినది ||నీ వాక్యమే||

ప్రభువా కాచితివి ఇంత కాలం

Prabhuva Kaachitivi Audio MP3 (Click here)
Open the MP3 in Chrome Browser or Click the Download Arrow in other browsers.

ప్రభువా కాచితివి ఇంత కాలం-
చావైనా బ్రతుకైనా నీ కొరకే దేవా –
నీ సాక్షిగా నే జీవింతునయ్యా ||ప్రభువా||

1. కోరి వలచావు నాబ్రతుకు – మలిచావయా
మరణ చాయలు అన్నిటిని – విరిచావయ్యా
నన్ను తలచావులే మరి పిలచావులే
నీ అరచేతులలో నను చెక్కు కున్నావులే ||ప్రభువా||
2. నిలువెల్ల గోరపు విషమేనయ్యా
మనిషిగ పుట్టిన సర్పానయ్యా
విషం విరచావులే పాపం కడిగావులే
నను మనిషిగా ఇలలో నిలిపావులే ||ప్రభువా||
3. బాధలు బాపితివి నీవేనయ్యా
నా కన్నీరు తుడిచితివి నీవెనయ్యా
నన్ను దీవించితివి నన్ను పోషించితివి
నీ కౌగిలిలో నన్ను చేర్చుకున్నావులే ||ప్రభువా||