మార్పులేని మానవుండా

Marpuleni Manavunda MP3(Download)

మార్పులేని మానవుండా
తీర్పుదినం దాగలేవు
సోదరా సోదరి తీర్పుదినం దాగలేవు

1. మారు మనస్సు నొందని నీ తీరును
జీవ గ్రంధమందు లేని పేరును
అసహ్యించుకొనును ద్వేషించును
ఎరుగడనుచు  యేసు నిను ఎంచును బాసించును
||మార్పు||

2. ఘోర పాపిగ నీవు కనబడి నేరస్తుడిగా
నీవు నిలబడి త్రోయబడి నరకాన కూలబడి
కాలబడి పోదువు ఖాయము హేయము
||మార్పు||

3. రక్షణ యేసు నొద్ద నున్నది
నిర్లక్ష్యం నీ యొద్ద నున్నది
ఇదే అనుకూలమైన సమయం
ఇదే రక్షణ దినం అందుము పొందుము
||మార్పు||

4. సిలువ రక్తము వృధా చేయకు
చేజేతుల ఉరి వేసుకు చావకు
మన ఘన ధన పరలోకం మరువకు వెరవకు.
||మార్పు||

NeeVale Nanninthaga

NeeVale Nanninthaga MP3 (Download here

నీవలే నన్నింతగా ప్రేమించలేదెవ్వరు
నీవలె నాకై ప్రాణము ఇవ్వలేదెవ్వరు
నా ప్రాణ ప్రియుడా శ్రీ యేసు విభుడా |2|
నీ ప్రేమ మధురం మధురాతి మధురం|2|
నీ ప్రేమయే నాకాధారము
ప్రభు నీవేగా నాదు ఆశ్రయము
||నీవలే నన్నింతగా||

దారి ప్రక్కన పడియుంటిని
నే దారి తప్పి చెడియుంటిని|2|
యెల్లరు నను దాటిపోయిరి|2|
జాలియే చూపకను
నీవైతే నన్ను లేవనెత్తి
నాకు నీదు జీవమిచ్చి
నీదు గృహమున చేర్చితివే
ప్రభు నాకు సేదను తీర్చితివే
||నీవలె నన్నింతగా||

నాదు గతమును చూడలేదు
నా దోషములను ఎంచలేదు|2|
నీదు రూపును నాదు ముఖమున|2|
చూచి ఎంతో మురిసితివే
నీ రక్తమిచ్చి నన్ను కొంటివి
నీతిమంతునిగా నన్ను తీర్చి
వారసునిగా చేసితివే
ప్రభు నన్ను మహిమ పరచితివే
||నీవలే నన్నింతగా||

Cheekati loyalo

చీకటి లోయలో నేను పడియుండగా
నేవే దిగివచ్చి నన్ను కనుగొంటివి
మరణపు గడియలో నేను చేరియుండగా
నీ రక్తమిచ్చి నన్ను బ్రతికించితివి
నీవే, దేవా నీవే, నీవే నీవే
నా ప్రాణదాతవు నీవే ప్రభు
చేర్చు దేవా చేర్చు, నన్ను చేర్చు
ఎత్తెన కొండపైకి నన్ను చేచ్చు
1. అరణ్యములో నేను సంచరించినను
ఏ అపాయమునకు భయపడను
నీవే నా మార్గమని నిన్ను వెంబడించెదను
నా చేయిపట్టి నన్ను నడిపించుము
నీకే, దేవా నీకే, నీకే నీకే
నా సమస్తమును నీకే అర్పింతును
చేర్చు దేవా చేర్చు, నన్ను చేర్చు
నా తండ్రి ఇంటికి నను చేర్చు ప్రభు
2. ఆకలి దప్పులు లేని  శ్రమలు అలసటలు లేని
శోధన అవేదన లేని  భయము దుఃఖములేని
మరణం కన్నీరు లేని  చీకటి ప్రవేశం లేని
నా తండ్రి ఇంటికి నన్ను చేర్చు ప్రభు
సకల సమృద్ధి ఉండు  దూతల స్తుతిగానాలుండు
భక్తుల సమూహముముండు  మహిమ ప్రవాహముండు
నిత్యం ఆరాధన ఉండు  శాశ్వత ఆనందముండు
నా తండ్రి ఇంటికి నన్ను చేర్చు ప్రభు

రక్షననే ఓడ తలుపు


       
Rakshanane Oda MP3 (Click here)

        రక్షననే ఓడ తలుపు తెరువబడింది –
        నాటి కంటే నేడు మరి చేరువలో ఉంది
        ఆలస్యం చేయకుండా కేవు తీసుకో –
        అవకాశం ఉండగానే రేవు చేరుకో
        1. నూటిరువది వత్సరాల నోవహు సువార్తను
        లెక్కచేయలేదు మరి వెక్కిరించారు ప్రజలు
        వర్షమెక్కువయింది  ఓడ తేలిపోయింది
        తట్టి తడివి చూసినా తలుపు మూయబడింది ||ఆలస్యం||
        2. చిక్కుడు కాయల కూరతో ఒకపూట కూటికొరకై
        జేష్టత్వం అమ్ముకొని బ్రష్టుడైన ఏశావు
        ఒక్క దీవెనైన నాకు దక్కలేదు తండ్రియని
        సమీపించి ఏడ్చినా శాపమే మిగిలింది  ||ఆలస్యం||
        3. మీలో ఒక్కరు నన్నుఅప్పగింప నున్నారని చెప్పగానే
        ప్రభుని మాట ఒప్పుకోలేదు యూదా
        తప్పుకుని తరలిపోయి తల్లకిందులా పడి
        నట్టనడుమ బ్రద్దలై నశియించినాడు చూడు  ||ఆలస్యం||

నేడు ఇక్కడ రేపు ఎక్కడో

Nedu Ikkada Repu Yekkado MP3 (Click here)

నేడు ఇక్కడ రేపు ఎక్కడో తెలియని పయనము ఓ మానవా
దిగంబరిగ నీవు పుడతావు దిగంబరిగానే నీవు వెళతావు

1. నీవు ఉన్నప్పుడే యేసు ప్రభుని నమ్ముకో
నమ్ముకుంటే నీవు మోక్షమునకు పోదువు ||దిగం||

2. అది నాది ఇది నాదని అదిరి పడతావు
చివరికి ఏది రాదు నీ వెంట ||దిగం||

3. ఎప్పుడు పోవునో ఎవ్వరికి తెలియదు
ఎక్కడ ఆగునో ఎవ్వరు ఎరుగరు  ||దిగం||