Nilupuma Deva Nee Sannidhilo

Nilupuma Deva Nee Sannidhilo MP3 (Download here

నిలుపుమా దేవా నీ సన్నిధిలో, నిలుపుమా దేవా నీ సన్నిధిలో
అల్ఫా ఓమెగయు నీవే ప్రభువా , ఆదియు అంతము నీవే దేవా
||నిలుపుమా దేవా||

మమ్ముల ప్రేమించి నీ రక్తముతో మా పాపములను కడిగియున్నావు |2|
ఆదిసంభూతుడా ఆశ్చర్యకరుడా |2| నీ నామమునకే మహిమ ప్రభావము |2|
||నిలుపుమా దేవా||

మా రక్షకుడవు శక్తిగల దేవుడవు, నీదు మహిమలో ఆనందముతో |2|
పరిశుద్ధాత్మతో ప్రార్ధన చేయుచు |2| నీ నామమునే స్తుతియించెదము |2|
||నిలుపుమా దేవా||

అద్వితీయుడవు ఆలోచనకర్తవు, నిత్యనివాసివి  నిర్మల హృదయుడా |2|
నిరుపమాన దివ్య తేజోమయుడా |2| నీ నామమునకే స్తుతియు ఘనతయు |2|
||నిలుపుమా దేవా||

Tambura nada swaramula

Tambura nada swaramula MP3 (Download here

NEW: Holy Bible Verses MP4 Videos posted here.

తంబుర నాద స్వరముల తోడ – తగు విధిని నిను భజన చేతు |2|
అంబరంబున కెగసే పాటలు |3|, హాయిగ హాయిగ పాడెద పాడెద|2|
||తంబుర నాద ||

సితార స్వర మండలములతో – శ్రీకర నిను భజన చేతు |2|
ప్రతిదినము నీ ప్రేమ గాధను |3|, ప్రస్తుతించి పాడెద పాడెద |2|
||తంబుర నాద ||

పిల్లన గ్రోవిని చల్లగనూది – ఉల్లమలరగ భజన చేతు |2|
వల్లభుడ నిను ఎల్లవేళల |3|, హల్లేలూయా యని పాడెద పాడెద |2|
||తంబుర నాద ||

మృదంగ తాళ తకిట ధ్వనులతో – మృత్యుంజయ నిను భజన చేతు |2|
ఉదయ సాయంత్రముల యందు |3|, హోసన్నా యని పాడెద పాడెద |2|
||తంబుర నాద ||

Naa Yesayya Naa Aradhya Daivama

Naa Yesayya, Naa Aradhya Daivama MP3 (Download here – Right Click – Save

నా  యేసయ్యా,  నా  ఆరాధ్య  దైవమా
నీవే  నా తండ్రివి,  నా  ప్రాణ నాథుడా
నీకే  నా  ఆరాధన,  నీకే  నా జివ్హార్పణ .
||నా  యేసయ్యా  నా  ఆరాధ్య  దైవమా ||
1. నా  రక్షణ  శైలమా,  నా ఆశ్రయ  దుర్గమా
ఆలోచన  కర్తవు,  నిత్యుడగు  తండ్రివి  |2|
     ||నా  యేసయ్యా  నా  ఆరాధ్య  దైవమా ||
2. ఇంతవరకు సహాయుడైన ఎబినేజరు దేవుడవు
నాకు  తోడుగా  ఉన్న  ఇమ్మానుయేలుడవు |2|
     ||నా  యేసయ్యా  నా  ఆరాధ్య  దైవమా ||
3. నేటివరకు చాలిన కృపగల  నా  యేసయ్యా
ఇక  ముందు  చూసుకొనే  యెహోవా  యీరే |2|
    ||నా  యేసయ్యా  నా  ఆరాధ్య  దైవమా ||
4. సజీవులు  సజీవులే  నిన్ను  స్తుతించెదరు
ఈ  దినమున  జీవుడనై  స్తుతియించున్నాను |2|
     ||నా  యేసయ్యా  నా  ఆరాధ్య  దైవమా ||
5. శ్వాసించే  ఈ గాలి  అది  నీ  జాలి
ఎంతైనా  నమ్మదగిన  వాత్సల్య  పూర్ణుడా |2|
   ||నా  యేసయ్యా  నా  ఆరాధ్య  దైవమా ||

Ghadandakaramulo

Ghadandakaramulo MP3

NEW: 1881 Telugu Holy Bible (complete) is posted here.

గాఢాంధకారములో – నేను తిరిగినను
నేనేల భయపడుదు- నా తోడు నీవుండగా

1. ఎన్నెన్నో ఆపదలు నన్ను చుట్టిననూ
నిన్ను తలచినచో అన్ని విడనాడు (2)
అన్ని కాలముల నిన్నే స్మరియింతు (2)
ఎన్నరానివయా నీకున్న సుగుణములు ||గాఢాంధ||

2. నాకున్న మనుజులెల్ల – నిన్ను విడిచిననూ
నా దేవ ఎప్పుడైనా – నన్ను విడిచితివా (2)
నా హృదయ కలశమున – నిను నేను నిలిపెదను (2)
నీ పాద కమలముల – నా దేవ కొలిచెదను. ||గాఢాంధ||

3. నా బ్రతుకు దినములలో నిన్నేల మరచెదను
నీ ఘన కార్యముల నేనెపుడు స్మరియింతు (2)
నీ ఉపకారముల నేనెపుడు తలచెదను (2)
నా యేసు పాదముల నేనిపుడు కొలిచెదను. ||గాఢాంధ||

Yehova Ninnu Poliyunna Varevvaru

యెహోవా నిన్ను పోలియున్న వారెవ్వరు, యేసువా నీకు సాటియైన వారెవ్వరు

1. సృష్టికి ఆధారుడా అద్వితీయుడా, నిత్యము నివసించుచున్న సత్యదేవుడా

అందరిలో సుందరుడ – కాంక్షనీయుడా, వందనముల కరుహుడా పూజ్యనీయుడా “యెహోవా”

2. పాపి కొరకు ప్రాణమిడిన ప్రేమ రూపుడా, లోక పాపమును మోసిన దైవ తనయుడా

మరణపు కోరలు పీకిన విజయ వీరుడా, శరణన్నచో కరుణ చూపు పరంధాముడా “యెహోవా”

Oka Divyamaina

Oka Divyamaina MP3

Oka Divyamaina MP3 Download (Click here)

ఒక దివ్యమైన సంగతితో నా హృదయము ఉప్పొంగెను |2|
యేసు రాజని నా ప్రియుడని ప్రియ స్నేహితుడు క్రీస్తని
ఒక దివ్యమైన సంగతితో నా హృదయము ఉప్పొంగెను

పదివేల మందిలో నా ప్రియుడు యేసు ధవళవర్ణుడు అతి కాంక్షణీయుడు |2 |
తన ప్రేమ వేయి నదుల విస్తారము|2|
వేవేల నోళ్లతో కీర్తింతును |2| ||ఒక దివ్యమైన ||

పండ్రెండు గుమ్మముల పట్టణములో నేను నివాసము చేయాలనీ |2|
తన సన్నిధిలో నేను నిలవాలని |2|
ప్రభు యేసు లో పరవశించాలని |2| ||ఒక దివ్యమైన ||

ప్రాణేశ్వర – ప్రభు దైవకుమార

Praneswara MP3 (Click here)

ప్రాణేశ్వర – ప్రభు దైవకుమార
ప్రణుతింతును నిన్నే- ఆశతీర ప్రాణేశ్వర – ప్రభు దైవకుమార

1. నా ఆత్మతో పాటలు పాడ – నీ కృపలే నాకు హేతువులాయె -2
నిత్య నిబంధన నీతో చేసి – నీ పాద సన్నిధి చేరియున్నానే -2

2. నా ఊటలన్నియు నీ యందేనని – వాద్యము వాయించి పాడెదను -2
జీవిత కాలమంతా నిన్నే స్తుతించి – సాగెద నూతన యెరూషలేము -2

3. కమనీయమైన నీ దర్శనము – కలనైనను మెలకువనైన -2
కనబడినా నా ఆశలు తీరవే – కనిపెట్టుచుంటిని కడబూరధ్వనికి -2

స్తుతి వస్త్రము ధరించి

Sthuthi Vastramu MP3 Audio (click here)

స్తుతి వస్త్రము ధరించి నీ సన్నిధిలో నేను

యాజకుని వలె స్తోత్ర బలులు జిహ్వ ఫలములు అర్పింతును

1. రక్షణ పాత్రను చేతబూని నీ స్తోత్రమును ప్రచురింతును
ప్రధాన యాజకుడా నీవె మాదిరిగా నీతి వస్త్రముతో సేవ చేసెదను ||స్తుతి||

2. లోకమునకు జ్యోతి వలెనే సత్య సాక్షిగా జీవించనా
సత్‌క్రియలను జరిగించి రక్షణ వస్త్రముతో తేజరిల్లెదను ||స్తుతి||

3. సిద్ధ పడిన సంఘ వధువుగ పెండ్లి విందుకు నే చేరనా
నూతన యెరుషలేమై పరిశుద్ధ క్రియలతో
పెండ్లి వస్త్రముతో వరుని చేరెదను ||స్తుతి||

అనంత జ్ఞాని నీకు

Anantha Gnani MP3 (Click here)

అనంత జ్ఞాని నీకు  అల్పుడను నాకు సహవాసమా
మహిమాన్విత నీకు మట్టినైన నాకు స్నేహమా
కృప ఇది నీ కృప
కేవలం నీ కృప
కృపా … కృపా …  కృపా …. కృపా  ||అనంత||

1. కోట్లాది జనులలో గుర్తించావు కోరుకొని కొమరునిగా లెక్కించావు
క్షమించే మనస్సు కలిగి  ఫలించే జీవమిచ్చి
పరలోక పౌరునిగ నను చేసావు. ||కృపా||

2. అప్పగించుకున్నాను నీ కృపకే నేను
గొప్ప దేవుడ నీ సన్నిధిలో ఉన్నాను
పిలిచిన వాడా నన్ను గెలచిన వాడా
ప్రేమించి ప్రేరేపించి స్థిర పరచిన వాడా. ||కృపా||