విడువను నిను

విడువను నిను ఎడబాయనని
నా కభయ మొసంగిన దేవా
నా కభయ మొసంగిన దేవా

1. నేరములెన్నో చేసి చేసి
దారి తప్పి తిరిగితినయ్యా,
నేరము బాపుము దేవా
నీ దారిని నడుపుము దేవా
||విడువను||

2. పందులు మేపుచు ఆకలి బాధలో –
పొట్టును కోరిన నీచుడనయ్యా ,
నీ దరి చేరితినయ్యా
నా తండ్రివి నీవెగదయ్యా
||విడువను||

3. మహిమ వస్త్రము సమాధానపు-
జోడును నాకు తోడిగితివయ్యా,
గొప్పగు విందులో చేర్చి
నీ కొమరునిగా చేసితివి
||విడువను||

4. సుందరమైన విందులలో
పరిశుద్ధులతో కలిపితివయ్యా,
నిండుగా నా హృదయముతో
దేవ వందనమర్పించెదను.
||విడువను||

అవే మాకున్నవి

NEW: Proverbs 1 to 17 Verses MP4 Posted here.

అవే మాకున్నవి అవే మాకున్నవి
వినగల చెవులు కనగల కనులు
నీ కృప చాటే స్తుతి గీతములు
విరిగి నలిగిన హృదయము
నుండి వలచిన కన్నీరు

ఇచ్చినవన్నీ నీవే దేవా
ఉన్నవన్నియు నీ ఈవులు దేవా
ఈనాటి దినము నీ దానము దేవా
నాదు జీవము నాకున్న స్వరము
నీ కృప దేవా
ఎంచిచూడయ తెంచిచూడగ
నా వన్నీ నీవే దేవా
||అవే మాకున్నవి||

ఎడ్లకు బదులు మాదు పెదవులు
స్తుతి యాగముగ సిద్ధము దేవా
ఎమివ్వగలను నీ సన్నిధిలోన
ఏ తైలములను బలిపశువలను
నీ ముందుకు తేనా
ఎంచిచూడయ తెంచిచూడగ
నా వన్నీ నీవే దేవా
||అవే మాకున్నవి||

మరణము నుండి మాలిన్యము నుండి
పాపము నుండి పలు భయముల నుండి
విడిపించితివి నను నడిపించితివి
పాపపు చెర సంకెళ్ళను
తెంచి కరుణించితివి
ఎంచిచూడయ తెంచిచూడగ
నా వన్నీ నీవే దేవా
||అవే మాకున్నవి||

నీవుండగా

నీ వుండగా ఈ లోకంలో నాకేమి అక్కరలేదు
నాకేది అక్కరలేదు నా దేవ నా ప్రభువా
నీ తోడుయే నాకెంతో ధన్యకరము నా యేసువా నా రక్షకా

1. నా జన్మ ఏ పాటిదో తలపోసి భయమొందితిని
ఈ ఓటి పాత్రను మహిమైశ్వర్యముతో నింపావు
నా పాదమెపుడు నీ చెంత నుండ
నాకేమి కొదువగును యేసయ్యా ||నీవుండగా||

2. తల్లి గర్బాన నుండి సాతాను సంబంధిని
ఈ మట్టి పాత్రను కలుషంబులను కడిగావు
నా నిండు మదిలో నా గుండె గదిలో
నీ కన్న వేరే లేరయ్యా ||నీవుండగా||

Sthutinchedanu

స్తుతించెదను – నిన్ను నేను మనసారా
భజించెదను – నేను నిన్ను దినదినము
స్తోత్రార్హుడవు – నీవే ప్రభూ
సమస్తము నీ కర్పించెదను

1.పూజార్హుడవు – పవిత్రుడవు
పాపిని క్షమియించె – మిత్రుడవు
పరము చేర్చి – ఫలములిచ్చే
పావనుడగు మా – ప్రభువు నీవే
||స్తుతించెదను||

2. కృపాకనికరములు – గల దేవా
కరుణ జూపి – కనికరించు
కంటిరెప్పవలె – కాపాడు
కడవరకు మమ్ము – కావుమయా
||స్తుతించెదను||

3. సర్వశక్తి గల – మా ప్రభువా
సజీవ సాక్షిగా – చేయుమయా
స్థిరపరచి మమ్ము – బలపరచుము
సదా నీకె స్తోత్రాలర్పింతున్
||స్తుతించెదను||