నీతోడు నాకుండగా

Neethodu Nakundaga MP3(Download)

నీతోడు నాకుండగా,
ఒంటరిని కానెన్నడూ|2|
నా యేసయ్యా , ఒంటరిని కానెన్నడూ,

ఈ లోకమే నాకు ఒక విష వలయం
నా జీవితమే నీకు నిలయం|2|
పరలోకమే నీవు వేసిన వలగా|2|
నను చేపట్టిన నా యేసయ్యా|2|
|| నీతోడు నాకుండగా||

కన్నీటి లోయలో లేయాను చూసి
కన్నీరు తుడిచిన కనికర దేవా|2|
నా దుఃఖ దినమున
ఆనందమొసగిన|2|
నన్నాదరించిన నా యేసయ్యా|2|
||నీతోడు నాకుండగా||

యోసేపునకు తోడైయున్నావు
గిద్యోనుకు నీవు తోడైయున్నావు|2|
మోషేకు నీవు తోడైయున్నావు|2|
నాతోడు నీవే నా యేసయ్యా|2|
||నీతోడు నాకుండగా||

Kalatha Chendaku

Kalatha Chendaku MP3(Download here)  

“కలతచెందకు కరుణించువారు లేరని
వేదనచెందకు రక్షించువారు లేరని”

*కలతచెందకూ కరుణించువారు లేరని
వేదనతో ఉండకూ దుఃఖముతో నిండకూ
దిగులు చెందకు దరిచేర్చువారు రారని
ధైర్యము వీడనీయకూ ఓటమి చెంతచేరకూ
తల్లి నిన్ను మరచినా మరువనన్నవాడు
నిన్నుకాచువాడు యేసు కునికి నిదురపోడు|2|
కుమిలిపోకు నేస్తమా కృంగిపోకు మిత్రమా|2|
||*కలతచెందకూ||

అందరు నావారనీ ప్రేమచూపువారేనని
నాకంటు ప్రాణమిచ్చువారు నాకున్నారని|2|
ఆశించిన యోసేపుకు శ్రమలు పలికే స్వాగతం|2|
అన్నలు అమ్మిననూ అందరూ దూరమైనా
నిందలు పైబడినా చెరసాల పాలైనా|2|
పాపము అంటక ఫలియించెను కొమ్మలా
పరిశుద్ధత కలిగిన భక్తుడు యోసెపులా
ధైర్యము వీడనీయకూ నేస్తమా ఓటమి చెంతచేరకూ|2|
||*కలతచెందకూ||

కడవరకుంటాడని కన్నవారి నొదులుకొని
కలిసి కలకాలం కాపురం చేయాలని |2|
ఆశించిన రూతుకు శ్రమలు పలికే స్వాగతం|2|
బ్రతుకుట బరువైన బ్రతుకే భారమైనా
చెలిమి కరువైనా చెరయే వరమనుచూ|2|
అత్తను హత్తుకున్న అనురాగమూర్తిలా…
ఆదరించబడినా అలనాటి రూతులా..
ధైర్యము వీడనీయకూ నేస్తమా ఓటమి చెంతచేరకూ|2|
||*కలతచెందకూ||

Nee palakarimpulo

నీ  పలకరింపులో  ఓదార్పు ఉన్నది, యేసయ్యా యేసయ్యా
నీ  పలకరింపులో  ఓదార్పు ఉన్నది |2|
నా కలవరాన్ని హరియించి, ఆదరణ నిచ్చుచున్నది|2|
*ప్రేమామయుడా యేసయ్యా |2| క్షేమాధారం  నీవయ్యా |2|
నీ పలకరింపులో ఓదార్పు ఉన్నది |2|
1.పాపులను పలకరించి  పాపములను క్షమియించావు
దీనులకు చేయిచాపి ఆత్మీయతను పంచావు |2|
నీ  పిలుపులో కనికరం, నీ  పలుకులో  పరిమళం |2|
నీవే సంతోషం |2|   || ప్రేమామయుడా యేసయ్యా||
2.రోగులను పలకరించి ఆరోగ్యము కలిగించావు
మృతులకు ప్రాణం పోసి మరణంనుండి  లేపావు|2|
నీ  పిలుపులో ఆర్ద్రత, నీ పలుకులో స్వస్థత  |2|
నీవే  చేయూత |2|    || ప్రేమామయుడా యేసయ్యా||
3.శిష్యులను పలకరించి  ఆందోళన తొలగించావు
అందరికి  బోధచేసి దుర్మార్గులను మార్చావు |2|
నీ పిలుపులో ధైర్యము, నీ పలుకులో అభయము|2|
నీవే ఆశ్రయము |2|    || ప్రేమామయుడా యేసయ్యా||
||నీ  పలకరింపులో  ఓదార్పు ఉన్నది||
*ఆర్ద్రత=మెత్తదనము(soft).

Aadarane lekapothe

Aadarane lekapothe MP3 (Download here

“నా అంతరంగమందు విచారములు హెచ్చగా నీ గొప్ప ఆదరణ నా ప్రాణమునకు నెమ్మది కలుగ జేయుచున్నది.” – కీర్తన 94:19

ఆదరణే లేకపోతే బ్రతుకలేనూ
తండ్రీ నీ ఆదరణే నాకు చాలును |2|
నను ఓదార్చింది నీ ఆదరణే
నను బలపరచింది నీ ఆదరణే|2|
||ఆదరణే||

బలహీన సమయంలో బలపరచుటకు
నా యొద్దకు వచ్చింది నీ ఆదరణే|2|
చెదరిన నా మనసును దృఢపరచుటకు
నా యొద్దకు వచ్చింది నీ ఆదరణే
బ్రద్దలైన గుండెను ఓదార్చుటకు
నా యొద్దకు వచ్చింది నీ ఆదరణే |2|
||ఆదరణే||

అందరూ నన్ను వెలివేసినప్పుడు
తోడుగ నిలిచింది నీ ఆదరణే |2|
సూటిపోటి మాటలతో కుమిలినప్పుడు
తోడుగ నిలిచింది నీ ఆదరణే
శోధన వేదన బరువైనపుడు
తోడుగ నిలిచింది నీ ఆదరణే|2|
||ఆదరణే||

Vedanalo Odarpu Neeve

Vedanalo Odarpu Neeve MP3 (Download here

వేదనలో ఓదార్పు నీవే నీవే |2|
నను చుట్టుముట్టిన శ్రమ వలయములో |2|
నిలిపి బలపరచి విజయమిచ్చినది నీవే యేసయ్యా |2|
వేదనలో ఓదార్పు నీవే నీవే |2|

నేనుగా భరించలేని శోధనలు, నాపైన మోపలేదు ఏనాడూ |2|
నా స్థితినెరిగిన దేవుడ నీవు, ఏ స్థితికైనా చాలిన ప్రేమ చూపినావు |2|
చల్లని చూపు నిలిపినావు ||వేదనలో ఓదార్పు నీవే నీవే ||

నాకు క్షమకు యోగ్యతయే లేనప్పుడు, నీ అక్షయ రుధిరమిచ్చి కొన్నావు |2|
నా స్థితి మార్చిన దేవుడ నీవు, ఏ స్థితికైనా చాలిన ప్రేమ చూపినావు |2|
చల్లని చూపు నిలిపినావు

వేదనలో ఓదార్పు నీవే నీవే |2|
నను చుట్టుముట్టిన శ్రమ వలయములో |2|
నిలిపి బలపరచి విజయమిచ్చినది నీవే యేసయ్యా |2|
ఆ విజయముకై నీకు స్తోత్రము, నిజ దేవుడ నీకే స్తుతి స్తోత్రము |2|

Adigo Naa Nava

అదిగో నా నావ బయలుదేరుచున్నది
అందులో యేసు ఉన్నాడు నా నావలో క్రీస్తు ఉన్నాడు

1. అలలెన్ని వచ్చినా అదరను
వరదలెన్ని వచ్చినా వణకను
ఆగిపోయే అడ్డులొచ్చినా
సాగిపోయే సహాయంబు ఆయనే ||అదిగో||

2. లోతైన దారిలో పోవుచున్నది
సుడిగుండాలెన్నొ తిరుగుచున్నది
సూర్యుడైన ఆగిపోయినా
చుక్కాని మాత్రం సాగిపోవును ||అదిగో||

3. నడిజాము రాత్రిలో నడిచినా
నడిసంద్రము మధ్యలో నిలచినా
నడిపించును నా యేసు
నన్ను అద్దరికి నడిపించును ||అదిగో||

Gali Samudrapu alalatho

Gali Samudrapu alalatho MP3

గాలి సముద్రపు అలలతో నేను – కొట్ట బడి, నెట్టబడి ఉండినప్పుడు(2)
ఆదరించెనూ నీ వాక్యము – లేవనెత్తెనూ నీ హస్తము…(2)
1. శ్రమలలో నాకు తోడుంటివి – మొర్ర పెట్టగా నా మొర్ర వింటివి
ఆదు కొంటివి నన్నాదు కొంటివీ – నీ కృపలో నను బ్రోచితివి (2)
2. వ్యాధులలో నిన్ను వేడు కొనగా – ఆపదలలో నిన్ను ఆశ్రయించగా
చూపితివీ నీ మహిమన్‌ – కొని యాడెదము ప్రియయేసుని (2)

Yenni Talachina

Yenni Talachina MP3 (Click here to download)

NEW:  Holy Bible Telugu New Testament Audio MP3 is posted here.

ఎన్ని తలచినా ఏది అడిగినా – జరిగేది నీ చిత్తమే ప్రభువా ! (2)
నీ వాక్కుకై వేచి యుంటిని – నాప్రార్ధన ఆలకించుమా ! (2)
1. నీ తోడు లేక నీ ప్రేమ లేక – ఇలలోనా ఏ ప్రాణి నిలువలేదు (2)
అడవిపూవులే నీ ప్రేమ పొందగా (2)
నాప్రార్ధన ఆలకించుమా ప్రభువా – నాప్రార్ధన ఆలకించుమా “ఎన్ని”
2. నా ఇంటి దీపం, నీవేయని తెలసి – నా హృదయం నీ కొరకు పదిల పరచితి (2)
ఆరిపోయినా నావెలుగు దీపము (2)
వెలిగించుము నీ ప్రేమతో ప్రభువా – వెలిగించుము నీ ప్రేమతో “ఎన్ని”
3. ఆపదలో నన్ను వెన్నంటి యున్న – నాకాపరివై నన్ను ఆదు కొంటివి
లోకమంతయు నన్ను విడచినా (2)
నీ నుండి వేరు చేయవు ప్రభువా – నీ నుండి వేరుచేయవు “ఎన్ని”
4. నా స్థితి గమనించి నన్ను ప్రేమించి – నా కొరకై కలువరిలో యాగమైతివా
నీదు యాగమే నా మోక్ష మార్గము (2)
నీ యందే నిత్య జీవము ప్రభువా – నీయందే నిత్య జీవము “ఎన్ని”