Paralokamandunna Maa Tandri

Paralokamandunna Maa Tandri MP3 (Download here

పరిశుద్ధుడు పరిశుద్ధుడు |2|
పరలోకమందున్న మా తండ్రీ
నీ నామము పరిశుద్ధ పరచబడునుగాక
నీ రాజ్యము మాకు వచ్చునుగాక |2|

నీ చిత్తము పరలోకమందు నెరవేరుచుండునట్లుగా |2|
ఈ భూమియందును నెరవేరునుగాక |2|
|| పరలోకమందున్న మా తండ్రీ||
పరిశుద్ధుడు పరిశుద్ధుడు |2|

మాకు కావలసిన ఆహారము అనుదినము
నీవు మాకు దయచేయుము |2| ,
మా ఋణస్థులను మేము క్షమియించినట్లు
నీవు మా ఋణములను క్షమియించుము |2|
|| పరలోకమందున్న మా తండ్రీ||

మమ్ములను శోధనలో పడనీయక
కీడునుండి మమ్ములను తప్పింపుము |2| ,
ఎందుచేతననగా రాజ్యము బలము
మహిమ నిరంతరం నీవైయున్నావు |2|
|| పరలోకమందున్న మా తండ్రీ ||
పరిశుద్ధుడు పరిశుద్ధుడు |2|