అనుభవానికి వచ్చెనా

Anubhavaniki Vachena MP3 (Click here)
(Click the “Download Arrow” button at the top to listen MP3.)

అనుభవానికి వచ్చెనా అంతులేని వేదన
దైవవాక్కును మీరినందుకు పడెను నీకు కఠిన శిక్ష

1. మట్టినుండి మనిషిగా ప్రభు నిన్ను మలిపినాడే
ప్రక్కటెముకల పడతి చేసి నీకు తోడుగ పంపినాడే
భువిని స్వర్గము చేసి మంచి చెడులను తెలిపినాడే||అనుభవానికి||

2. రాజు నీవు రాలిపడితివి రాయి రప్పల మధ్యన
కలికి మాటకు విలువ ఫలముగ కష్టములు నిన్ను ముసిరెనా
ఆదరించిన ప్రకృతే నిను వికృతముగా మార్చెనా ||అనుభవానికి||

3. మనిషి మనుగడ విలువ ఫలముగ జన్మ పాపము అంటగట్టి
ఆరు ఋతువుల కాల చక్రం పాపభారము తలన పెట్టి
తరతరాలుగా జాతిని మరణ భయమున త్రోసినావే   ||అనుభవానికి||