Vyardhamu Vyardhamu

వ్యర్ధము వ్యర్ధము సోదరా యేసులేని బ్రతుకు నీకు వ్యర్ధమే
వ్యర్ధము వ్యర్ధము సోదరీ యేసులేని రోజంతా వ్యర్ధమే
యేసుని నమ్ముకుంటే స్వర్గమే స్వర్గమే
యేసుని నమ్మకుంటే నరకమే నరకమే

1. మణులు మాన్యాలు ఎన్ని నీకు ఉన్నా
తరగని ధనరాసులు నీ ఇంట ఉన్నా
బంధూబలగాలు అమితముగా నీకున్నా
పాపాలను క్షమియించే యేసయ్యను లేకున్నా ||వ్యర్ధము||

2. సృష్టిని పరికించే జ్ఞానము నీకెంతున్నా
సృష్టిని పూజించే అనుభవమే నీకున్నా
చిత్ర చిత్ర పనులు చేసి చరిత్రకే ఎక్కుతున్నా
ఈ సృష్టి కి మూలమైన యేసయ్యను లేకున్నా ||వ్యర్ధము||

3. కవుల కల్పనతో దేవుళ్ళను చేసుకున్న
భక్తిలో భ్రమ చెంది గోపురాలు కట్టుకున్నా
మతమౌఢ్యం రేపుకుంటూ రాజ్యాలే ఏలుతున్నా
దేవుళ్ళకు దేవుడైన యేసయ్య లేకున్నా ||వ్యర్ధము||

Special Telugu Christian MP3 songs of the week:
1. Nanu inninallu 

2. Adilo

Baatasaari O Baatasaari

Baatasaari MP3 (Download here

బాటసారి ఓ బాటసారి,వినవయ్యా ఒక్కసారి|2|
పయనించే బాటసారి,బాటసారి ఓ బాటసారి
వినవయ్యా ఒక్కసారి

వెండి తాడు విడిపోవును
బావి యొద్ద చక్రం పడిపోవును |2|
ఇంతలో కనబడి అంతలో మాయమయ్యే |2|
నీటి బుడగలాంటిదీ జీవితం |2|
విసిరి వెళ్ళి మరలా రాని గాలి వంటిది |2|
||బాటసారి||

పరదేశులం యాత్రీకులం
శాశ్వతం కాదు ఈ దేహం |2|
మన్నైనది వెనుకటి వలె మన్నైపోవును |2|
ఆత్మ దేవుని యొద్దకు చేరును |2|
విసిరి వెళ్ళి మరలా రాని గాలి వంటిది |2|
||బాటసారి||

నీ జీవిత గమ్యమెక్కడో
యోచింపవా ఓ మానవా |2|
అగ్ని ఆరదు పురుగు చావదు|2|
నిత్య నరకమునకు పోవద్దురా|2|
యేసయ్యను నమ్ముకో, పరలోకం చేరుకో|2|
||బాటసారి||

Special song (Manavuda oh Manavuda) 

Special Song2: Kannu teristhe velugura 

Oh Nesthama

Oh Nesthama MP3 (Download here – Right Click – Save

ఓ నేస్తమా, యోచించుమా, సూర్యుని క్రింద అంతా శూన్యమే |3|
వ్యర్ధమే అంతా వ్యర్థమే, సమస్తము వ్యర్థమే వ్యర్థమే |2| ||ఓ నేస్తమా||
1. విద్య జ్ఞానాభ్యాసం శోకమే, అందము ఐశ్వర్యము ఆయాసమే |2|
కండ అండ బలమున్నా వ్యర్థమే, ఎన్ని ఉన్న నీ బ్రతుకు దుఃఖమే |2|
యేసు లేని నీ బ్రతుకు శూన్యమే, యేసు లేని నీ బ్రతుకు వ్యర్థమే |2| ||ఓ నేస్తమా||
2. లోకములో మమతలన్నీ శూన్యమే, లోక భోగములన్నీ క్షణికమే |2|
నీ దేహము లయమగుట ఖాయమే, ప్రభు యేసే నీ జీవిత గమ్యము |2|
సత్య వేదము చెప్పు నిత్య సత్యము |2| ||ఓ నేస్తమా||

Kshanikamaina bratukura

Kshanikamaina bratukura MP3

Kshanikamaina bratukura MP3 Download (Click here)

క్షణికమైన బ్రతుకురా ఇది సోదరా, క్షణికమైన సుఖమురా ఇది |2|
ఓ స్నేహితుడా, ఓ స్నేహితుడా యోచించుమా, సృష్టికర్తను స్మరణ చేయుమా
దైవ ప్రేమను మదిని నిలుపుమా, ఆ యేసు ప్రేమను నీ మదిని నిలుపుమా
క్షణికమైన బ్రతుకురా ఇది సోదరా, క్షణికమైన సుఖమురా ఇది

ఎంత బ్రతికినా ఈ లోకమును విడిచిపెట్టి పోవలెను తెలుసా నీకు |2|
ఊరికి పోవు త్రోవ యెరుగుమయ్యా|2|,ఆ త్రొవే యేసని తెలుసుకొనుమయా|2| ||ఓ స్నేహితుడా||

గడ్డిపువ్వును పోలిన బ్రతుకు ఎండి పోయి వాడి పోవు తెలుసా నీకు |2|
ఆవిరివంటి బ్రతుకు ఎగిరిపోవును|2| ప్రభు యేసుని నమ్మితే నిత్యజీవము |2| ||ఓ స్నేహితుడా||

Category: Prasangi as Telugu Songs

Tags:
ప్రసంగి 12:2, 10:15, 12:6-7
యోహాను సువార్త 14:6, 3:16
1 పేతురు 1:23-24

Moodunalla Muchata Kosam

Moodunalla Muchata MP3 (Private song – Download here

మూడునాళ్ళ ముచ్చటకోసం ఈ మనిషి
పడే తపన చూడరా
నీటిబుడగ లాంటిది ఈ జీవితం
ఏనాడు సమసిపోవునో ఎరుగం

1. మనిషికి తన మనసే చెరసాలరా
అవి మమతల మమకారాల బంధాలురా
వళ్ళకాటి వరకేరా భవబంధాలు
నీ కల్లానికి చేరవురా అనుబంధాలు
కల్లలైన కలలు మానుకో
ఎల్లవేళలా ప్రభుని వేడుకో  ||మూడునాళ్ళ||

2. ఇంద్రధనస్సు లాంటిదోయి సంసారము
అది కనిపించి మాయమయే రంగుల వలయం
గడ్డిపువ్వు లాంటిదోయి ఇలలో సౌఖ్యం
అది పాపానికి జీతమురా మనిషికి మరణం
నిత్యమైన సుఖము వెదకరా
నిరతము ఆ ప్రభుని కోరరా ||మూడునాళ్ళ||

3. తప్పిదములు దాచువాడు వర్దిల్లడు
అవి ఒప్పుకొని విడిచిపెట్టు ఓ సోదరా
జిగటగల ఊబి నుండి పైకి లేపి
నీ పాదములను స్థిరముగా నిలుపును ప్రభువే
తీర్పు తీర్చబడకమునుపే
తప్పక ఆ ప్రభుని కోరరా ||మూడునాళ్ళ||

నేడు ఇక్కడ రేపు ఎక్కడో

Nedu Ikkada Repu Yekkado MP3 (Click here)

నేడు ఇక్కడ రేపు ఎక్కడో తెలియని పయనము ఓ మానవా
దిగంబరిగ నీవు పుడతావు దిగంబరిగానే నీవు వెళతావు

1. నీవు ఉన్నప్పుడే యేసు ప్రభుని నమ్ముకో
నమ్ముకుంటే నీవు మోక్షమునకు పోదువు ||దిగం||

2. అది నాది ఇది నాదని అదిరి పడతావు
చివరికి ఏది రాదు నీ వెంట ||దిగం||

3. ఎప్పుడు పోవునో ఎవ్వరికి తెలియదు
ఎక్కడ ఆగునో ఎవ్వరు ఎరుగరు  ||దిగం||

కొంతసేపు కనపడి

Kontha Sepu Kanapadi MP3 (Download here

కొంతసేపు కనపడి అంతలోనే మాయమయ్యే
ఆవిరివంటిదిరా ఈ జీవితం లోకాన కాదేది శాశ్వతం
యేసే నిజ దేవుడు నిత్య జీవమిస్తాడు మరణమైన జీవమైన నిన్ను విడువడు

1. ఎదురవుతారెందరో నీ పయనములో – నిలిచేది ఎందరో నీ అక్కరలో
వచ్చేదెవరో నీతో మరణము వరకు – ఇచ్చేదెవరో ఆపై నిత్యజీవం నీకు
||యేసే||

2. చెమటోడ్చి దేవుని విడిచి కష్టములోర్చి – ఆస్తులు సంపాదించిన శాంతి ఉన్నదా – ఈ రాత్రే దేవుడు నీ ప్రాణమడిగితే – సంపాదన ఎవరిదగునో యోచించితివా ||యేసే||

3. నీ శాపము తానుమోసి పాపముతీసి  – రక్షణ భాగ్యము నీకై
సిద్ధము చేసి విశ్రాంతినియ్యగా నిన్నుపిలువగా-నిర్లక్ష్యము చేసినా తప్పించుకుందువా ||యేసే||