Yuddham Yehovade

యుద్ధము యెహోవాదే – యుద్ధము యెహోవాదే – యుద్ధము యెహోవాదే
యేసు కొరకు నిలచున్నవాడా యేసు కొరకు జీవించువాడా
జయించుము అనుక్షణము జయించుము దినదినము

1. రెండంచుల ఖడ్గమును పట్టుకొని ప్రార్ధించుము –
నీ పట్టు వదలక సిలువ పైన గురిని నిల్పుము చేరువరకు నీ గమ్యస్థానము ||యుద్ధము||

2. పరలోకము నీ పక్షముండగా ప్రభు యేసే నీ ప్రక్కనుండగా
పోరాడి నిను గెల్చునెవ్వరు ప్రభువుకన్న బలవంతుడెవ్వరు ||యుద్ధము||

3. భక్తులెందరో నీకు ముందుగ శక్తిని పొంది సాగుచుండగా
ప్రభువు వారిని నడుపుచుండగా ప్రియుడా నిన్ను నడపకుండునా ||యుద్ధము||

4. మోషే ఏలియా మొదలగువారు పౌలు పేతురు పరమ భక్తులు
ఎందరెందరో ముందు నడువగా- ఏల భయము ఇక ముందంజవేయ ||యుద్ధము||

5. యెహెజ్కేలు యెషయా దానియేలు దావీదు మలాకీ ఎందరెందరో
ముందు నడువగా- ఏల భయము ఇక ముందంజవేయ ||యుద్ధము||

Yendipoyina Yemukallara

ఎండిపోయిన ఎముకల్లారా
నిద్రించుచున్న సోదరులారా
యేసయ్య స్వరమును వినండి
ప్రభు చెంత చేరండి జీవాన్ని పొందండి

1. మట్టితో నిన్ను చేసెను జీవాత్మ నీలో పోసెను
తన రూపు నీకిచ్చెను మహిమతో నిన్ను నింపెను
యేసయ్య నిన్ను పిలువగా సిగ్గుతో పరుగిడనేల ||ఎండి||

2. సొంత దొడ్డి మరిచావు మరణమార్గమును నీవు కోరావు
జీవాహారము లేక నీవు జీవచ్ఛవమై యున్నావు
యేసయ్య నిన్ను చూడగా ఎండిపోయి మిగిలావు ||ఎండి||

3. జీవాధిపతి నిన్ను ప్రేమతో పిలచుచుండెను
నూతన సృష్టి చేయ తన కరములు చాపియుండె
ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్యము చేయకుమా ||ఎండి||

Parama Jeevamu

MP3 (Download here)

పరమ జీవము నాకునివ్వ – తిరిగి లేచెను నాతోనుండ
నిరంతరము నడిపించును – మరల వచ్చి యేసు కొనిపోవును
“యేసు చాలును చాలును – యేసు చాలును చాలును”
“ఏ సమయమైన – ఏ స్థితి కైన – నాజీవితములో యేసు చాలును”
1. సాతాను శోధన లధికమైనా – సొమ్మసిల్లక సాగి వెళ్ళెదను
లోకము శరీరము లాగినను – లోబడక నేను వెళ్ళెదను
2. పచ్చిక బయలలో పరుండచేయున్‌ – శాంతి జలము చెంత నడిపించును
అనిశము ప్రాణము తృప్తిపరచున్‌ – మరణ లోయలో నను కాపాడును
3. నరులెల్లరు నను విడిచినను – శరీరము క్రుళ్ళి కృషించినను
హరించినన్‌ నా ఐశ్వర్యము – విరోధివలె నను విడచినను || యేసు చాలును ||

Deva Samsthuthi

Deva Samsthuthi (Psalm 103) MP3 (Click here):

దేవ సంస్తుతి చేయవే మనసా శ్రీమంతు‌డగు యెహొవా సంస్తుతి చేయవే మనసా
దేవ సంస్తుతి చేయుమా – నా జీవమా యెహొవా దేవుని
పావన నామము స్తుతించుమా – నా యంతరంగము లో వసించునో సమస్తమా “దేవ”
1. జీవమా, యెహొవా నీకు జేసిన మేళ్లన్ మరవకు – నీవు చేసిన పాతకంబులను
మన్నించి – జబ్బు లేవియున్ లేకుండ జేయును ఆ కారణముచే “దేవ”
2. చావు గోతినుండి నిన్ను లేవనెత్తి దయను కృపను – జీవ కిరీటముగ వేయును
నీ శిరసు మీద – జీవ కిరీటముగ వేయును ఆ కారణముచే “దేవ”
3. యౌవనంబు పక్షిరాజు యౌవనంబు వలెనె క్రొత్త – యౌవనంబై వెలయునట్లుగ
మేలిచ్చి నీదు భావమును సంతుష్టిపరచునుగా ఆ కారణముచే “దేవ”
4. పడమటికి దూర్పెంతయెడమో పాపములకును మనకునంత-యెడము కలుగజేసియున్నాడు
మన పాపములను ఎడముగానే చేసియున్నాడు ఆ కారణముచే “దేవ”
5. మనము నిర్మితమయిన రీతి తనకు దెలిసియున్న సంగతి-మనము మంటివార మంచును
జ్ఞాపకముచేసి కొనుచు కరుణ జూపు చుండును ఆ కారణముచే “దేవ”

యుద్ధ వీరులం

Yudha veerulam MP3 (Click here)

యుద్ధ వీరులం – మనము యుద్ధ వీరులం
మహిమాత్మను పొందిన ప్రార్థనా వీరులం
భయపడము జడియము
అపవాదిని ఎదిరించే ఆత్మఖడ్గ యోధులం

1. కృపకు ఆధారమగు – ఆత్మ పొందియున్నాము
పిరికి ఆత్మను పొంది – బానిసలము కాలేదు
బలహీనతలో – మనము బలవంతులమయ్యాము
శక్తిమంతుడగు యేసు – మనలో నిలిచి యుండగా ॥ యుద్ధ ॥

2. విశ్వాసమనే డాలు చేతితో పట్టుకొని
మహిమ శిరస్త్రాణమును – యేసువలన పొందాము
సర్వాంగ కవచమును – ధరించుకొని యున్నాము
స్వీకృత పుత్రాత్మయే – జయం మనకు ఇవ్వగా ॥ యుద్ధ ॥

ప్రాణేశ్వర – ప్రభు దైవకుమార

Praneswara MP3 (Click here)

ప్రాణేశ్వర – ప్రభు దైవకుమార
ప్రణుతింతును నిన్నే- ఆశతీర ప్రాణేశ్వర – ప్రభు దైవకుమార

1. నా ఆత్మతో పాటలు పాడ – నీ కృపలే నాకు హేతువులాయె -2
నిత్య నిబంధన నీతో చేసి – నీ పాద సన్నిధి చేరియున్నానే -2

2. నా ఊటలన్నియు నీ యందేనని – వాద్యము వాయించి పాడెదను -2
జీవిత కాలమంతా నిన్నే స్తుతించి – సాగెద నూతన యెరూషలేము -2

3. కమనీయమైన నీ దర్శనము – కలనైనను మెలకువనైన -2
కనబడినా నా ఆశలు తీరవే – కనిపెట్టుచుంటిని కడబూరధ్వనికి -2

పరలోకమే నా అంతపురం

పరలోకమే నా అంతపురం చేరాలనే నా తాపత్రయం
యేసుదేవరా..కనికరించవా… దారి చూపవా……\”2\” \”పరలోకమే\”
1. స్వల్ప కాలమే ఈలోక జీవితం – నాభవ్య జీవితం మహోజ్వలం
మజిలీలు దాటే మనో బలం – నీ మహిమ చూసే మధుర క్షణం \”2\”
వీక్షించు కన్నులు – విశ్వాస జీవితం నాకు నేర్పవా… \”2\” \”పరలోకమే\”
2. పాపము (శరీర కార్యములు) నెదిరించే శక్తిని నాకివ్వు – పరులను ప్రేమించే మనసే నాకివ్వు
ఉద్రేక పరచే ధురాత్మను – ఎదురించి పోరాడే శుధాత్మను \”2\”
మోకాళ్ళ జీవితం – కన్నీటి అనుభవం నాకు నేర్పవా… \”2\” \”పరలోకమే\”

రాకడ సమయము

———————————————————
లూకా సువార్త 21: 34 -మీ హృదయములు ఒకవేళ తిండివలనను, (లోక) మత్తువలనను, ఐహిక విచారములవలనను మందముగా ఉన్నందున ఆ దినము అకస్మాత్తుగా మీ మీదికి ఉరివచ్చినట్టు రాకుండ మీ విషయమై మీరు జాగ్రత్తగా ఉండుడి.

———————————————————
లూకా సువార్త 12:35-36 మీ నడుములు కట్టుకొనియుండుడి, మీ దీపములు వెలుగుచుండనియ్యుడి. తమ ప్రభువు పెండ్లివిందునుండి వచ్చి తట్టగానే అతనికి తలుపుతీయుటకు అతడెప్పుడు వచ్చునో అని అతనికొరకు ఎదురు చూచు మనుష్యులవలె ఉండుడి.

———————————————————–

ప్రకటన 3:3 – నీవేలాగు ఉపదేశము పొందితివో యేలాగు వింటివో జ్ఞాపకము చేసికొని దానిని గైకొనుచు మారుమనస్సు పొందుము.

రాకడ సమయములో – కడబూర శబ్ధముతో
యేసుని చేరు కొనే – విశ్వాసము నీకుందా (2)
రావయ్య యేసయ్యా – వేగమే రావయ్యా – 2
1. యేసయ్య రాకడ సమయములో – ఎదురేగే రక్షణ నీకుందా?
లోకాశలపై విజయము నీకుందా? (2)
2. ఇంపైన దూప వేదికగా – ఏకాంత ప్రార్ధన నీకుందా? (2)
యేసుని ఆశించే దీన మనస్సుందా ? (2)
3. దినమంతా దేవుని సన్నిదిలో- వాక్యం కొరకు ఆకలి నీకుందా? (2)
యేసు నాధునితో సహవాసం నీకుందా? (2)
4. శ్రమలోన సహనం నీకుందా- స్తుతియించే నాలుక నీకుందా? (2)
ఆత్మలకొరకైన భారం నీకుందా? (2)
5. నీ పాత రోత జీవితము – నీ ఘోర హృదయము మారిందా?(2)
నూతన హృదయముతో ఆరాధన నీకుందా ?(2)
6. అన్నిటి కన్న మిన్నగా – కన్నీటి ప్రార్ధన నీకుందా? (2)
ఎల్లవేళలలో స్తుతి యాగం నీకుందా? (2)

కృప కాలము దాటకముందే

Krupa Kalam dataka-munde MP3 (Click here)

కృప కాలము దాటకముందే ఈ జీవితం పోకముందే
ఈ లోకం గతియించక ముందే, క్రీస్తు యేసు ఈ భువికి రాక ముందే
కలువరిలో నా యేసుడు గాయాలతో పిలచుచున్నాడు

ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యము చేసిన యెడల
ఏలాగు నీవు తప్పించుకుందువు ఎవరు నిన్ను మోక్షము చేర్చెదరు
కృప కాలము దాటకముందే ఈ జీవితం పోకముందే

ఎందరో ప్రవక్తలు ఇంకెందరో సువార్తికులు బోధించినా రోధించినా
సర్వాన్ని త్యాగం చేసి రక్తమే కార్చి ప్రాణాలు సహితం అర్పించినా
యేసయ్య ప్రేమకు నీలో చోటే లేకున్నదా,
ఆ సిలువ మాటలు వినే మనసే లేకున్నదా || ఇంత గొప్ప రక్షణను||

కోట్లాది ధనముకంటే బంగారు కొండలు కంటే నీలోని ఆత్మ ఎంతో విలువైనది
జీవ మార్గమును(ఆత్మ ఫలములు) , మరణ మార్గమును(శరీర కార్యములు)
నీ ఎదుటే నా యేసు ఉంచెను, దేమా వలె లోకాన్ని కోరుకుందువా
పౌలు వలె పెంటలా(లోకాన్ని) ఎంచినవా || ఇంత గొప్ప రక్షణను||

అంజురపూ చెట్లు

Anjoorapu chetlu MP3 (Click here)

అంజురపూ చెట్లు – పూయక పోయిననూ – 2
ద్రాక్ష చెట్లూ – ఫలించక పోయిననూ – 2
నేను దేవునిలో సంతోషించెదనూ – నా ప్రభునందు ఆనందించెదనూ – 2

1. అన్నియునూ ఎదురై నాకు వచ్చిననూ – పరిస్థితులే అపజయముగ నను మార్చిననూ – 2
నేను దేవునిలో సంతోషించెదనూ – నా ప్రభునందు ఆనందించెదనూ – 3

2. బంధువులే నన్ను విడిచి పోయిననూ – ఊరంతా నన్ను వెలి వేసిననూ – 2
నేను దేవునిలో సంతోషించెదనూ – నా ప్రభునందు ఆనందించెదనూ – 3

3. గొఱ్ఱెలమంద దొడ్డిలో లేకపోయిననూ – సాలలో పశువులు లేక పోయిననూ – 2
నేను దేవునిలో సంతోషించెదనూ – నా ప్రభునందు ఆనందించెదనూ – 3