Karunamayuda

Karunamayuda MP3 (Download here

కరుణామయుడా ప్రభు యేసువా
దయా సంపూర్ణుడా, పరిపాలకుడా
పరమోన్నుతుడా దయా సాగరా |2|

నీ ఆత్మ నానుండి తీయకుము
నీ సన్నిధి నుండి నను త్రోయకుము |2|
దేవా దేవా, కరుణ చూపుము
నీ దయతో నింపుము ||కరుణామయుడా||

నీ ముందు నిలిచే ధైర్యమిమ్ము
ప్రార్థనాత్మ బలం నాకొసగుము |2|
దేవా దేవా, నీ కృపతో నడిపించుము
ఆత్మతో అభిషేకించు ||కరుణామయుడా||

Deva Naa Devudavu Neeve

Deva Naa Devudavu Neeve MP3 (Download here

దేవా, నా దేవుడవు నీవే
వేకువనే నిన్ను వెదకుదును|2|
నీ బలమును ప్రభావమును చూడ
నేనెంతో ఆశతో ఉన్నాను
||దేవా, నా దేవుడవు నీవే||

నీరు లేని దేశమందు దప్పిగొన్నది నా ప్రాణం |2|
నీ మీద ఆశ చేత సొమ్మసిల్లెను నా శరీరము |2|
||దేవా, నా దేవుడవు నీవే||

ఉత్సహించు పెదవులతో నా నోరు చేసేను గానం
నీ రెక్కలు చాటున శరణన్నది నా ప్రాణం |2|
||దేవా, నా దేవుడవు నీవే||

Parishuddha Agnini

Parishuddha Agnini MP3 (Download here

పరిశుద్ధ అగ్నిని పంపుము దేవా
పరిశుద్ధ ఆత్మతో నింపుము దేవా ,
మా ప్రాణ ఆత్మ శరీరములను
పరమాగ్నితో నింపి వెలిగించుమా ,
పరిశుద్ధ అగ్నిని పంపుము దేవా

పెంతెకొస్తు పండుగనాడు పంపిన ఆ ఆత్మను
మేడ గదిలో శిష్యులపై వ్రాలిన  ఆ ఆత్మను |2|
యీ అంత్య దినములందు మా అందరిపై కుమ్మరించి
నీ శక్తితో నీ బలముతో మమ్మును బలపరచుము |2|
||పరిశుద్ధ అగ్నిని పంపుము దేవా||

నీ ఆత్మని కుమ్మరించి ప్రవచన వరమీయుమా
నీ చిత్తము మాకు తెలుప దర్శనములు చూపుమా |2|
నీ వాగ్దానములతో మమ్ము తృప్తి పరచుము
నీ ఆత్మ కార్యములను మాలో చేయుము |2|
||పరిశుద్ధ అగ్నిని పంపుము దేవా||

ఆత్మలేని వారు నీ వారు కారంటివి
నీవెవరో యెరుగనని గెంటివేయుదనంటివి |2|
పవిత్రాత్మను నేడే మాపైన  కుమ్మరించి
పరిశుద్ధుల గుంపులో చేర్చుము పరిశుద్ధుడా |2|
||పరిశుద్ధ అగ్నిని పంపుము దేవా||

Hrudayama Hrudayama

Hrudayama Hrudayama MP3 (Download here

నా ప్రాణమా, నీవు ఏల క్రుంగియున్నావు? – కీర్తన 43:5

హృదయమా హృదయమా |2|
నీవేల క్రుంగియున్నావు ,
నాలో నీవేల తొందర పడుచున్నావు |2|
హృదయమా హృదయమా |2|

దేవునియందు నిరీక్షణ ఉంచుము
దేవుడే నీకు సహాయం చేయును |2|
ఆయనే నీ రక్షకుడు నీ విమోచకుడు |2|
ఆయనయందే విశ్వాసముంచుము |2|
||హృదయమా హృదయమా||

క్రుంగియున్నవేళలో లేవనెత్తి
మరణము నుండి విడిపించి |2|
శ్రమయు దుఃఖమును తీసి వేసి
సంతోషవస్త్రము ధరింప చేయును |2|
||హృదయమా హృదయమా||

Naa Yesayya Naa Aradhya Daivama

Naa Yesayya, Naa Aradhya Daivama MP3 (Download here – Right Click – Save

నా  యేసయ్యా,  నా  ఆరాధ్య  దైవమా
నీవే  నా తండ్రివి,  నా  ప్రాణ నాథుడా
నీకే  నా  ఆరాధన,  నీకే  నా జివ్హార్పణ .
||నా  యేసయ్యా  నా  ఆరాధ్య  దైవమా ||
1. నా  రక్షణ  శైలమా,  నా ఆశ్రయ  దుర్గమా
ఆలోచన  కర్తవు,  నిత్యుడగు  తండ్రివి  |2|
     ||నా  యేసయ్యా  నా  ఆరాధ్య  దైవమా ||
2. ఇంతవరకు సహాయుడైన ఎబినేజరు దేవుడవు
నాకు  తోడుగా  ఉన్న  ఇమ్మానుయేలుడవు |2|
     ||నా  యేసయ్యా  నా  ఆరాధ్య  దైవమా ||
3. నేటివరకు చాలిన కృపగల  నా  యేసయ్యా
ఇక  ముందు  చూసుకొనే  యెహోవా  యీరే |2|
    ||నా  యేసయ్యా  నా  ఆరాధ్య  దైవమా ||
4. సజీవులు  సజీవులే  నిన్ను  స్తుతించెదరు
ఈ  దినమున  జీవుడనై  స్తుతియించున్నాను |2|
     ||నా  యేసయ్యా  నా  ఆరాధ్య  దైవమా ||
5. శ్వాసించే  ఈ గాలి  అది  నీ  జాలి
ఎంతైనా  నమ్మదగిన  వాత్సల్య  పూర్ణుడా |2|
   ||నా  యేసయ్యా  నా  ఆరాధ్య  దైవమా ||

Kurchundunu nee sannidhilo

Kurchundunu nee sannidhilo MP3 (Download here – Right Click – Save

కూర్చుందును నీ  సన్నిధిలో  దేవా  ప్రతి  దినం
ధ్యానింతును నీ  వాక్యమును  దేవా  ప్రతి  క్షణం |2|
నిరంతరం నీ  నామమునే గానము చేసెదను
ప్రతిక్షణం నీ  సన్నిధినే అనుభవించెదను ||కూర్చుందును నీ  సన్నిధిలో||
1. ప్రతి విషయం నీకర్పించెద, నీ  చిత్తముకై  నే  వేచెద  |2|
నీ  స్ఫూర్తినే  పొంది  నే  సాగెద|2|  నీ  నామమునే  హెచ్చించెద |2|
నా అతిశయము  నీవే,  నా  ఆశ్రయము  నీవే
నా  ఆనందము  నీవే,  నా  ఆధారము నీవే
యేసు  యేసు,  యేసు  యేసు ||కూర్చుందును నీ  సన్నిధిలో||
2. ప్రతి దినము నీ ముఖ కాంతితో నా హృదయ దీపము వెలిగించెద |2|
నీ వాక్యానుసారము జీవించెద |2|  నీ ఘన కీర్తిని వివరించెద |2|
నా దుర్గము నీవే, నా ధ్వజము నీవే
నా ధైర్యము నీవే, నా దర్శనం నీవే
యేసు  యేసు,  యేసు  యేసు ||కూర్చుందును నీ  సన్నిధిలో||

Yesu Vypu Choochuchu

Yesu Vypu Choochuchu MP3 (Download here – Right Click – Save

యేసు వైపు చూచుచు, పందెములో ఓపికతో పరుగెత్తుదము |2|
వెనుతిరిగి చూడక విశ్వాసం వీడక |2| సాగి పోవాలీ |2| ||యేసు వైపు||

వాక్యమనే ఖడ్గమును పట్టుకొని, వీడని విశ్వాసమును కట్టుకొని |2|
అపవాది తంత్రములను అణగత్రొక్కుదాం, అంధకార క్రియలను అణిచివేయుదాం |2|
రక్షణనే శిరస్త్రాణము ధరియించుదము, నిరీక్షణ కలిగి మనము సాగిపోదము |2|
వెనుతిరిగి చూడక విశ్వాసం వీడక |2| సాగి పోవాలీ |2| ||యేసు వైపు||

సత్యమనే దట్టిని కట్టుకొని, నీతిఅనే మైమరువును తొడుగుకొని |2|
సమాధాన శుభవార్తను ప్రకటించుదాం ,సిద్ధమనసు అను జోడు తొడుగుకుందము |2|
అపవాది అగ్ని పొదిని ఆర్పి వేయుదాం, ఆత్మలో ప్రతి సమయము ప్రార్థింతుము |2|
వెనుతిరిగి చూడక విశ్వాసం వీడక |2| సాగి పోవాలీ |2| ||యేసు వైపు||

Vevela Parishuddulatho

Vevela Parishuddulatho MP3 (Download here-Right Click-Save

ప్రభువు తన వేవేల పరిశుద్ధుల పరివారముతో వచ్చును.  –యూదా 1:15

వేవేల పరిశుద్ధులతో యేసు వేగమే రానైయున్నాడు  |2|
మనము మహిమ శరీరము దాల్చి మధ్యాకాశము చేరెదము |2| ||వేవేల పరిశుద్ధులతో||

కోటాను కోట్ల దూతలతో మన యేసు ప్రభువు దిగి వచ్చును |2|
విజయ వీణలు మ్రోగగా  పరమ వరుడు అరుదెంచును |2| ||వేవేల పరిశుద్ధులతో||

గొర్రె పిల్ల పరిణయ విందుకు పిలువబడిన ధన్య జీవులు |2|
పెండ్లి వస్త్రమును ధరియించి వివాహ వేదిక పైనుందురు |2| ||వేవేల పరిశుద్ధులతో||