మారని దేవుడవు

Maarani Devudavu MP3(Download here)

మారని దేవుడవు నీవేనయ్యా –
మరుగై ఉండలేదు నీకు యేసయ్యా
సుడులైనా సుడిగుండాలైనా –
వ్యధలైనా వ్యాధి బాధలైనా
మరుగై ఉండలేదు నీకు యేసయ్యా
||మారని దేవుడవు||

చిగురాకుల కొసల నుండి జారిపడే మంచులా
నిలకడలేని నా బ్రతుకును మార్చితివే |2|
మధురమైన నీ ప్రేమను నే మరువలేనయ్యా |2|
మరువని దేవుడవయ్యా మారని యేసయ్యా |2|
||మారని దేవుడవు||

నా జీవిత యాత్రలో మలుపులెన్నో తిరిగినా
నిత్య జీవ గమ్యానికి నను నడిపించితివే |2|
నిలచి ఉందునయ్యా నిజ దేవుడవనుచూ |2|
నన్ను చూచినావయ్యా నన్ను కాచినావయ్యా|2|
||మారని దేవుడవు||

Aarani Prema Idi

Aarani Prema Idi MP3

Aarani Prema Idi MP3 Download (Click here)

ఆరని ప్రేమ ఇదీ ఆర్పజాలని జ్వాల ఇదీ|2|
అతి శ్రేష్టమైనది అంతమే లేనిది, అవధులే లేనిది, అక్షయమైన ప్రేమ ఇదీ |2|
కలువరి ప్రేమ ఇదీ, క్రీస్తు కలువరి ప్రేమ ఇదీ |2| ఆరని ప్రేమ ఇదీ ఆర్పజాలని జ్వాల ఇదీ

సింహాసనమునుండి సిలువకు దిగి వచ్చినది, బలమైనది మరణము కన్నా, మృతిని గెలిచి లేచినది
ఇది సజీవమైనది, ఇదే నిత్యమైనది, ఇదే సత్యమైనది, క్రీస్తు యేసు ప్రేమ ఇదీ |2|
కలువరి ప్రేమ ఇదీ, క్రీస్తు కలువరి ప్రేమ ఇదీ |2| ఆరని ప్రేమ ఇదీ ఆర్పజాలని జ్వాల ఇదీ

నా స్థానమందు నిలిచి నా శిక్షనే భరియించి, క్రయ ధనమును చెల్లించి, గొప్ప రక్షణ ఇచ్చినదీ
నాకు విలువ నిచ్చినదీ, నన్ను వెలిగించినదీ, ఆ ఉన్నత రాజ్యమందు నాకు స్థానమిచ్చినదీ |2|
ఉన్నత ప్రేమ ఇదీ, అత్యున్నత ప్రేమ ఇదీ |2| ||ఆరని ప్రేమ ఇదీ ||

Aarani prema idi aarpa jalani jwala idi |2|
athi sresthamainadi, anthame lenidi, avadhule lenidi, akshayamaina prema idi |2|
kaluvari prema idi, kreesthu kaluvari prema idi |2| aarani prema idi aarpa jalani jwala idi

Simhasanamunundi siluvaku digi vachinadi, balamainadi maranamu kanna, mruthini gelichi lechinadi
idi sajeevamainadi, ide nithymainadi, ide satyamainadi, kreesthu yesu prema idi |2|
kaluvari prema idi, kreesthu kaluvari prema idi |2| ||aarani prema idi ||

Na sthanamandu nilichi naa sikshane bhariyinchi, kraya dhanamunu chellinchi, goppa rakshana ichinadi
naaku viluva nichinadi, nannu veliginchinadi, aa unnatha rajyamandu naaku sthanamichinadi |2|
unnatha prema idi, athyunnatha prema idi |2| ||aarani prema idi ||