Reyimbavalla

Reyimbavalla MP3:

రేయింబవళ్ళలోన వెల్లేటి త్రోవలోన ||2||
యేసయ్య నేల మరతువు నీవు
క్షణంబులోన లోకంబునిడుతువు ||2||

1. ఎక్కడికోయి నీవు యాత్రాపోయేది నీవు||2||
నీ ఇల్లు స్థిరము కాదు ఒళ్ళు మరచెదవు||2||
ఈలోకం నీది కాదు పరదేశివే నీవు
వచ్చిన దారినే వచ్చిన దారినే వెళ్లిపోవాలి
||రేయింబవళ్ళలోన||

2. సైతాను దారిలోన చుట్టు ఎడారి నీకు||2||
ఇరుకైన దారిలోన బరువైన కాడిమోయ||2||
ప్రధాన ఖడ్గముతో బయలుదేరాలి
ప్రభు యేసుని పూజించి ప్రార్ధించి సేవింపరారే
||రేయింబవళ్ళలోన||

Cheekati Kalam

1. చీకటి కాలము వచ్చుచుండె – కృపకాలము నుపయోగించు
తలుపులు తెరచి యుండగనే విరిగిన మనస్సుతో సాగెదవా
పల్లవి: తలుపులు తెరచి యుండగనే విరిగిన మనస్సుతో సాగెదవా
కాలమపాయముగా నుండే సమయము సద్వినియోగించు

2. బీడు భూములధికముగా – చూసిన నీవు సాగిరా
యేసుని వారికి చూపించు – ప్రేమా వార్తను చాటించు ||తలుపులు||

3. ఎన్నో రాజ్యములీనాడు – దేవుని పనికి మూయబడె
తెరచిన తలుపులు యెదురుండున్- ప్రవేశింతురు జ్ఞానులు ||తలుపులు||

4. విశ్వాసుల సహవాసమున – ప్రేమా ఐక్యత గలదు
అని చెప్పెడి దినములు – మన మధ్యకు రావలెను ||తలుపులు||

5. రానైయున్న బాధ్యతలు – మనకధికము ప్రియులారా
మనకు జయము గలుగుటకై – వినయమున పోరాడెదము ||తలుపులు||

Samayamide

సమయమిదే సమయమిదే సంఘమ సమయమిదే
సీయోనులో చేరుటకు సంఘమ సమయమిదే
1. చూడుము భూమి మీద పాప చీకటి క్రమ్మియున్నది
జ్యోతివలె జీవించు జీవవాక్యము పట్టుకొని ||సమయమిదే||
2. ధూళి దులుపుకొనుము నీ మెడ కట్లు విప్పుకొనుము
సుందరమైన వస్త్రము వేగం ధరించి సిద్ధపడుము ||సమయమిదే||
3. నిలువుము సత్యముకై సువార్తకు పోరాడుము
సేవను చేసి నీవు త్యాగం చేయుము ప్రాణమును ||సమయమిదే||
4. సీయోను శత్రువులు సిగ్గుపడుదురు నిశ్చయముగా
సీయోను నీ పరుగు తుదముట్టించుము త్వరితముగా ||సమయమిదే||
5. సీయోనులో వసించు సర్వశక్తుడు నీ ద్వార
శోధింప ఈ దినము మార్పునొందుము స్పటికముగా ||సమయమిదే||
6. పిలుపుకు తగినట్లుగా నీవు నడువుము ప్రభుయేసుతో
ప్రేమలోనే నిలువుము నిత్యజీవము చేపట్టుము ||సమయమిదే||
7. సీయోను రారాజు నిన్ను చూచి ఏతెంచెదరు
మహిమగల కిరీటం నీకు ఆయన ఇచ్చెదరు ||సమయమిదే||

Pilachuchunnadu

పిలచుచున్నాడు ప్రియమైన యేసు
పరిశుద్ధ స్థలమునకు ఎంత పాపివైనా
ప్రేమించినాడు నీ జీవితమును
ఏ భేదము లేక వేగమే రారండి
నీవు నీ ఇంటి వారు నీతోనే ఉండువారు
నిజమైన దేవుడని విశ్వసించుటకు ||పిలచు||

1. వెలుగై యున్నవాడు నీ చీకటి తొలగిస్తాడు
మంచి గంధపు మాటలు నీ మదిలో కురిపిస్తాడు
రా .. ఏ రోగివైననూ నీ పాపాలు కడుగును
మారుమనస్సు పొంది ప్రేమ కలిగియుండి
ప్రభుయేసు దేవుడని సాక్ష్యమిచ్చుటకు ||పిలచు||

2. మేడి చెట్టు ఎక్కి మరుగై యుండలేవు
యేసు వచ్చు వేళ నిదురించకు ప్రభుని మరచి
రా .. దిగి రమ్ము క్రిందకి ఏ అధికారివైననూ – యేసు నీ యింటికి వచ్చి
నేడే రక్షణ ఇచ్చి- పరలోక రాజ్యములో నిన్ను చేర్చుటకు ||పిలచు||