Yesayya Nee Prema

Yesayya Nee Prema MP3(Download here)

యేసయ్యా నీ ప్రేమ బాంధవ్యము
మాకు అపురూప సౌందర్యము|2|
చాటింప సాగింతునా…………
నా జ్ఞానము అత్యల్పము ……..|2|
లేఖనాలు విప్పనా ప్రవచనాలు చదవనా
మన్నాను రుచిచూచి మహిమ పరచనా|2|
||యేసయ్యా నీ ప్రేమ||

మోయాబీయ సంతానం శాపగ్రస్తమైనది
నీ వంశావళియందు రూతు చేరియున్నది|2|
నీ జన్మ చరితమే నిలువెత్తు దర్మనము|2|
దిక్కులలో వెదకనా దివ్యతార నడగనా
ఆ తార వెలుగులో నీ ప్రేమను చూపనా
||యేసయ్యా నీ ప్రేమ||

కానాను విందు నీ కరుణతో నిండినది
రసము నింపియుంటివి రాతి బానల నిండ|2|
ఆపదల యందున ఆదుకొనే మిత్రుడవు|2|
అమ్మనే అడగనా రసమునే త్రాగనా
అతిధిగా నున్న నిన్ను ఆరాధించనా
||యేసయ్యా నీ ప్రేమ||

పయనించితి పయనించితి…………….
లోకమందు పయనించితి…………….
రాళ్ళురువ్వి చంపమని………………….
నీ మందర నను నిల్పగ………………|2|
ఎల్లప్పుడు నీతిగా జీవించమంటివి..|2|
నేలగీత నడగనా నీ పాదము తుడువనా
సిలువ నీడ విశ్రమించి సేదదీరనా………
||యేసయ్యా నీ ప్రేమ||

Naa Oohakandanidi

ప్రేమా – ప్రేమా – యేసు ప్రేమ
*నా ఊహకందనిది నన్ను ఆదరించినది
వర్ణింపజాలనిది నాపై నీకున్న ప్రేమ |2|
1.ఆదరణ కొదువై నేను అల్లాడి పోచుండగను
ఆదరణ కర్తవై నన్ను ఓదార్చితివా |2|
నావాళ్ళు చూపని  ప్రేమ, నన్ను విడనాడని ప్రేమ|2|
నా కొరకు త్యాగమైన నా యేసు రక్షకా
||నా ఊహకందనిది నన్ను ఆదరించినది||
2.పాపినై నేనుండగ పాపములో పడియుండగ
పాపంబు బాపుటకు ప్రాణమే ఇచ్చితివా|2|
నా కొరకు రక్తము కార్చి, నా కొరకు సిలువను మోసి
నా కొరకు బలియైన నా ప్రాణ రక్షకా
||నా ఊహకందనిది నన్ను ఆదరించినది||
3.శోధనలు ఎన్నెదురైనా శ్రమలలో నే పడియున్నా
నిన్ను నే వీడను నా యేసురాజా |2|
నా చేయి విడవకుమా, నాతోడు విడనాడకుమా|2|
నీతోనె కొనసాగెదను  నా ఆత్మ రక్షకా
||నా ఊహకందనిది నన్ను ఆదరించినది||

Naa Yesayya Prema

Naa Yesayya Prema MP3 (Download here

నా యేసయ్య ప్రేమ
నా తండ్రి గొప్ప ప్రేమ |2|
వర్ణించగలనా నా మాటతో
నే పాడగలనా క్రొత్త పాటతో |2|
||నా యేసయ్య ప్రేమ ||

నా పాపనిమిత్తమై
సిలువనూ తానై మోసే
ఈ ఘోర పాపి కొరకై
తన ప్రాణము అర్పించెనే|2|
ఏముంది నాలో దేవా
ఏ మంచి లేనే లేదే |2|
||నా యేసయ్య ప్రేమ ||

తప్పి పోయినా నన్ను
వెతకి రక్షించితివే
ఏ దారి లేక ఉన్నా
నీ దరికి చేర్చితివే|2|
ఏముంది నాలో దేవా
ఏ మంచి లేనే లేదే|2|
||నా యేసయ్య ప్రేమ ||

Maaranidi nee prema naa Yesayya

పర్వతములు తొలగిపోయినను మెట్టలు తత్తరిల్లినను నా కృప నిన్ను విడిచిపోదు.” Isaiah 54:10

NEW: YouVersion.com mobile app added Telugu BSI Bible here.

మారనిది నీ ప్రేమ నా యేసయ్యా, వీడనిది నీ బంధము మెస్సయ్యా |2|
నీ ప్రేమ కౌగిలిలో బంధించావు, నీ మమతల కోవెలకు నడిపించావు |2|
మారనిది నీ ప్రేమ నా యేసయ్యా, వీడనిది నీ బంధము మెస్సయ్యా

చెడిపోయి పడిన నన్ను చేరదీసి కడిగి కన్నీరు  తుడిచితివీ |2|
తల్లివి నీవై తండ్రివి నీవై |2| ఆదరించితివీ |2| ||మారనిది నీ ప్రేమ ||

గతిలేని నాకు స్థితినిచ్చావు, మతిలేని నాకు వరమిచ్చావు |2|
చెలిమిని చూపి , బలమును పంచి |2| ఆదరించితివీ |2| ||మారనిది నీ ప్రేమ ||

Maaranidi nee prema naa Yesayya, veedanidi nee bandhamu Messaiah |2|
nee prema kougililo bandhinchavu, nee mamatala kovelaku nadipinchavu |2|
maranidi nee prema naa Yesayya, veedanidi nee bandhamu Messaiah

Chedi poyi padina nannu chera deesi, kadigi kanneeru tudichitivi |2|
tallivi neevai tandrivi neevai |2| adarinchitivee |2|  ||Maaranidi nee prema ||

Gati leni naku sthithi nichavu, mati leni naku varamichavu |2|
chelimini choopi, balamunu panchi |2| adarinchitivee |2|  ||Maaranidi nee prema ||

మారని దేవుడవు

Maarani Devudavu MP3(Download here)

మారని దేవుడవు నీవేనయ్యా –
మరుగై ఉండలేదు నీకు యేసయ్యా
సుడులైనా సుడిగుండాలైనా –
వ్యధలైనా వ్యాధి బాధలైనా
మరుగై ఉండలేదు నీకు యేసయ్యా
||మారని దేవుడవు||

చిగురాకుల కొసల నుండి జారిపడే మంచులా
నిలకడలేని నా బ్రతుకును మార్చితివే |2|
మధురమైన నీ ప్రేమను నే మరువలేనయ్యా |2|
మరువని దేవుడవయ్యా మారని యేసయ్యా |2|
||మారని దేవుడవు||

నా జీవిత యాత్రలో మలుపులెన్నో తిరిగినా
నిత్య జీవ గమ్యానికి నను నడిపించితివే |2|
నిలచి ఉందునయ్యా నిజ దేవుడవనుచూ |2|
నన్ను చూచినావయ్యా నన్ను కాచినావయ్యా|2|
||మారని దేవుడవు||

Aarani Prema Idi

Aarani Prema Idi MP3

Aarani Prema Idi MP3 Download (Click here)

ఆరని ప్రేమ ఇదీ ఆర్పజాలని జ్వాల ఇదీ|2|
అతి శ్రేష్టమైనది అంతమే లేనిది, అవధులే లేనిది, అక్షయమైన ప్రేమ ఇదీ |2|
కలువరి ప్రేమ ఇదీ, క్రీస్తు కలువరి ప్రేమ ఇదీ |2| ఆరని ప్రేమ ఇదీ ఆర్పజాలని జ్వాల ఇదీ

సింహాసనమునుండి సిలువకు దిగి వచ్చినది, బలమైనది మరణము కన్నా, మృతిని గెలిచి లేచినది
ఇది సజీవమైనది, ఇదే నిత్యమైనది, ఇదే సత్యమైనది, క్రీస్తు యేసు ప్రేమ ఇదీ |2|
కలువరి ప్రేమ ఇదీ, క్రీస్తు కలువరి ప్రేమ ఇదీ |2| ఆరని ప్రేమ ఇదీ ఆర్పజాలని జ్వాల ఇదీ

నా స్థానమందు నిలిచి నా శిక్షనే భరియించి, క్రయ ధనమును చెల్లించి, గొప్ప రక్షణ ఇచ్చినదీ
నాకు విలువ నిచ్చినదీ, నన్ను వెలిగించినదీ, ఆ ఉన్నత రాజ్యమందు నాకు స్థానమిచ్చినదీ |2|
ఉన్నత ప్రేమ ఇదీ, అత్యున్నత ప్రేమ ఇదీ |2| ||ఆరని ప్రేమ ఇదీ ||

Aarani prema idi aarpa jalani jwala idi |2|
athi sresthamainadi, anthame lenidi, avadhule lenidi, akshayamaina prema idi |2|
kaluvari prema idi, kreesthu kaluvari prema idi |2| aarani prema idi aarpa jalani jwala idi

Simhasanamunundi siluvaku digi vachinadi, balamainadi maranamu kanna, mruthini gelichi lechinadi
idi sajeevamainadi, ide nithymainadi, ide satyamainadi, kreesthu yesu prema idi |2|
kaluvari prema idi, kreesthu kaluvari prema idi |2| ||aarani prema idi ||

Na sthanamandu nilichi naa sikshane bhariyinchi, kraya dhanamunu chellinchi, goppa rakshana ichinadi
naaku viluva nichinadi, nannu veliginchinadi, aa unnatha rajyamandu naaku sthanamichinadi |2|
unnatha prema idi, athyunnatha prema idi |2| ||aarani prema idi ||

Yesayya Naa Hrudaya Spandana

Yesayya Naa Hrudaya Spandana MP3 (Click here)
(Click the “Download Arrow” button at the top to listen MP3.)

యేసయ్యా నా హృదయ స్పందన నీవె కదా
విశ్వమంతా నీ నామము ఘననీయము

1. నీవు కనిపించని రోజున
ఒక్క క్షణమొక యుగముగ మారెనే
నీవు నడిపించిన రోజున
యుగయుగాల తలపు మది నిండెనే  ||యేసయ్యా||

2. నీవు మాట్లాడని రోజున
నా కనులకు నిద్దుర కరువాయెనే
నీవు పెదవిప్పిన రోజున
నీ సన్నిధి పచ్చిక బయలాయెనే  ||యేసయ్యా||

3. నీవు వరునిగ విచ్చేయువేళ
నా తలపుల పంట పండునే
వధువునై నేను నిను చేరగ
యుగయుగాలు నన్నేలు కొందువనే ||యేసయ్యా||