విడువను నిను

విడువను నిను ఎడబాయనని
నా కభయ మొసంగిన దేవా
నా కభయ మొసంగిన దేవా

1. నేరములెన్నో చేసి చేసి
దారి తప్పి తిరిగితినయ్యా,
నేరము బాపుము దేవా
నీ దారిని నడుపుము దేవా
||విడువను||

2. పందులు మేపుచు ఆకలి బాధలో –
పొట్టును కోరిన నీచుడనయ్యా ,
నీ దరి చేరితినయ్యా
నా తండ్రివి నీవెగదయ్యా
||విడువను||

3. మహిమ వస్త్రము సమాధానపు-
జోడును నాకు తోడిగితివయ్యా,
గొప్పగు విందులో చేర్చి
నీ కొమరునిగా చేసితివి
||విడువను||

4. సుందరమైన విందులలో
పరిశుద్ధులతో కలిపితివయ్యా,
నిండుగా నా హృదయముతో
దేవ వందనమర్పించెదను.
||విడువను||

నీవుండగా

నీ వుండగా ఈ లోకంలో నాకేమి అక్కరలేదు
నాకేది అక్కరలేదు నా దేవ నా ప్రభువా
నీ తోడుయే నాకెంతో ధన్యకరము నా యేసువా నా రక్షకా

1. నా జన్మ ఏ పాటిదో తలపోసి భయమొందితిని
ఈ ఓటి పాత్రను మహిమైశ్వర్యముతో నింపావు
నా పాదమెపుడు నీ చెంత నుండ
నాకేమి కొదువగును యేసయ్యా ||నీవుండగా||

2. తల్లి గర్బాన నుండి సాతాను సంబంధిని
ఈ మట్టి పాత్రను కలుషంబులను కడిగావు
నా నిండు మదిలో నా గుండె గదిలో
నీ కన్న వేరే లేరయ్యా ||నీవుండగా||

Yesayya Naa Pranamayya

Yesayya Naa Pranamayya MP3 (Download here

యేసయ్యా నా ప్రాణమయ్యా
నీవే నా ప్రాణమయ్యా |2|
నీవేనయ్యా నా ఊపిరయ్యా  నా ఊపిరయ్యా
నిత్యము నిన్నయ్యా కొనియాడెదనయ్యా |2|
ప్రాణమైన యేసయ్యా నా ప్రాణమైన యేసయ్యా
||యేసయ్యా నా ప్రాణమయ్యా||

నా పాపము క్షమియించుమయ్యా
నాలోన నీవుండమయ్యా |2|
నీ ప్రేమ నా పైన దయచేయుమయ్యా|2|
||యేసయ్యా నా ప్రాణమయ్యా||

నా దోషము తొలగించుమయ్యా
నీ రక్తముతో శుద్దిచేయుమయ్యా|2|
నీ అభిషేకము నా కియ్యుమయ్యా|2|
||యేసయ్యా నా ప్రాణమయ్యా||

నీ వాక్యముతో నడిపించుమయ్యా
నీ మాటలతో బ్రతికించుమయ్యా |2|
నీ మహిమతో నను నింపుమయ్యా |2|
||యేసయ్యా నా ప్రాణమయ్యా||

నీ ఆత్మను నా కియ్యుమయ్యా
నీ మార్గము చూపించుమయ్యా |2|
నీ రాజ్యమునకు కొనిపోవుమయ్యా|2|
||యేసయ్యా నా ప్రాణమయ్యా||

Naa Jeevitham

Naa Jeevitham Prabhuke Ankitam** 

నా జీవితం ప్రభుకే అంకితం
నా సంతసం ప్రభులో శాశ్వతం |2|
పాపమే బాపెనే నా ఋణం తీర్చెనే
సిలువ నీడలో దాచెనే. ||నా జీవితం||

శరణం వేడగా నాపై కరుణను చూపెను |2|
కరములు చాపెను, నన్ను స్థిరముగా నిల్పెను |2|
నా కన్నీటిని తుడిచెను, నా స్నేహితుడై నిల్చెను. ||నా జీవితం||

మలినం కడుగను యేసు రుధిరం కార్చెను |2|
మరణం పొందెను, తిరిగి మరల లేచెను |2|
నా కొరకే శ్రమనొందెను, నా భారం తొలగించెను ||నా జీవితం||

Naa jeevitham Prabhuke ankitam
Naa santhasam prabhulo sashwatam |2|
Papame bapene, naa runam teerchene
Siluva needalo dachene. ||Naa jeevitham||

Saranam vedaga, naapai karunanu choopenu |2|
Karamulu chapenu, nannu sthiramuga nilpenu |2|
Naa kannetini tudichenu, naa snehitudai nilchenu ||Naa jeevitham||

Malinam kaduganu Yesu rudhiram karchenu |2|
Maranam pondenu, tirigi marala lechanu |2|
Na korake srama nondenu, naa bharam tholaginchenu ||Naa jeevitham||

**Lyrics – Bro. ARS