Manasunna Manchi Deva

Manasunna Manchi Deva MP3

మనసున్న మంచిదేవా నీ మనసును నాకిచ్చావా
మనసు మలినమైన నాకై మనిషిగా దిగి వచ్చావా
నా మది నీ కోవెలగా మలచుకోవయా
నా హృదిని రారాజుగా నిలిచిపోవయా

1. హృదయము వ్యాధితో నిండిన కపట కేంద్రము
దానిని గ్రహియించుట ఎవరి సాధ్యము
మనసు మర్మమెరిగిన మహనీయుడా
మనసు మార్చగలిగిన నిజదేవుడా

2. చంచల మనస్సాడించు బ్రతుకు ఆటను
వంచన చేసి నడుపును తప్పు బాటను
అంతరంగమును పరిశీలించు యేసయ్యా
స్ధిరమనస్సుతో నీ దారిలో సాగనీవయ్యా

3. నిండు మనస్సుతో నిన్ను ఆశ్రయించితి
దీనమనస్సుతో నీకడ శిరము వంచితి
పూర్ణశాంతి గలవానిగా నన్ను మార్చుమా
తరతరములకు క్షేమము చేకూర్చుమా

Nee Chethitho

Nee Chetitho MP3 (Click here)
(Click the “Download Arrow” button at the top to listen MP3.)

నీ చేతితో నన్ను పట్టుకో – నీ ఆత్మతో నన్ను నడుపు
శిల్పి చేతిలో శిలను నేను – అనుక్షణము నన్ను చెక్కుము

1. అంధకార లోయలోన సంచరించిన భయములేదు
నీ వాక్యం శక్తి గలది – నాత్రోవకు నిత్య వెలుగు  ||నీ చేతితో ||

2. ఘోర పాపిని నేను తండ్రి – పాప ఊబిలో పడియుంటిని
లేవ నెత్తుము శుద్ది చేయుము పొందనిమ్ము నీదు ప్రేమను  ||నీ చేతితో||

3. ఈ భువిలో రాజు నీవే నా హృదిలో శాంతి నీవే
కుమ్మరించుము నీదు ఆత్మను – జీవితాంతం నీ సేవచేసెదన్‌ ||నీ చేతితో||