ఆశలన్నీ నీ మీదనే

Asalanni Nee meedane MP3 (Click here):

ఆశలన్నీ నీ మీదనే నా ఆశలన్నీ నీ మీదనే
నిరీక్షణ కలిగి ఎదురు చూచుచుంటిని
చెదరిన మనస్సు నలిగిన హృదయం
ఎండిన ఎముకై నేనుంటిని

1. పక్షిరాజు యవ్వనం వలె నూతన పరచుమా
అలయక సొలయక పరుగెత్తెద సేవలో
నీ కొరకై ఆశ కలిగినట్టివారు ధన్యులు
గుప్పిలి విప్పి నా కోరిక తీర్చుమా ||ఆశలన్నీ||

2. వెలుగునిచ్చు జ్యోతినై ఉండాలని
లోకమునకు ఉప్పునై బ్రతకాలని
రోగులకే ఔషదం అవ్వాలని
జీవజలపు నదిగ నేను ప్రవహించాలని ||ఆశలన్నీ||

3. మండుచున్న సంఘములను ప్రభుకొరకై కట్టెద
కోట్లాది ఆత్మలను సిలువ చెంత చేర్చెద
దిక్కులేని వారికి ఆదరణగ నుండెద
కడవరకు నీ ప్రేమను లోకమంత చాటెద ||ఆశలన్నీ||