Naa Yesayya Prema

Naa Yesayya Prema MP3 (Download here

నా యేసయ్య ప్రేమ
నా తండ్రి గొప్ప ప్రేమ |2|
వర్ణించగలనా నా మాటతో
నే పాడగలనా క్రొత్త పాటతో |2|
||నా యేసయ్య ప్రేమ ||

నా పాపనిమిత్తమై
సిలువనూ తానై మోసే
ఈ ఘోర పాపి కొరకై
తన ప్రాణము అర్పించెనే|2|
ఏముంది నాలో దేవా
ఏ మంచి లేనే లేదే |2|
||నా యేసయ్య ప్రేమ ||

తప్పి పోయినా నన్ను
వెతకి రక్షించితివే
ఏ దారి లేక ఉన్నా
నీ దరికి చేర్చితివే|2|
ఏముంది నాలో దేవా
ఏ మంచి లేనే లేదే|2|
||నా యేసయ్య ప్రేమ ||

Naa Kosama Ee Siluva Yagamu

Naa Kosama Ee Siluva Yagamu MP3 (Download here)

నా కోసమా ఈ సిలువ యాగము
నా కోసమా ఈ ప్రాణ త్యాగము |2|
కల్వరిలో శ్రమలు నా కోసమా
కల్వరిలో సిలువ నా కోసమా|2| || నా కోసమా ||

నా చేతులు చేసిన పాపానికై
నా పాదాలు నడచిన వంకర త్రోవలకై |2|
నీ చేతులలో… నీ పాదాలలో…
నీ చేతులలో నీ పాదాలలో
మేకులు గుచ్చినారే |2|
యేసయ్యా నాకై సహించావు
యేసయ్యా నాకై భరించావు|2| || నా కోసమా ||

నా మనస్సులో చెడు తలంపులకై
నా హృదిలో చేసిన అవిధేయతకై |2|
నీ శిరస్సుపై… నీ శరీరముపై…
నీ శిరస్సుపై నీ శరీరముపై
ముళ్ళను గుచ్చినారే |2|
యేసయ్యా నాకై సహించావు
యేసయ్యా నాకై భరించావు|2| || నా కోసమా ||

 • Kraistavunda KadaliRavayya

  క్రైస్తవుండా కదలిరావయ్యా కలుషాత్ములకు ఈ సిలువశక్తిని చాటవేమయ్యా ఎండ వానలనియు జడిసి ఎంతకాలము మూలనుందువు  ||2||
  కండలను ప్రేమింతువేమయ్యా ఈ మట్టి కండలు ఎంత పెంచిన మట్టికేనన్నా

  1. వసుధలో ప్రజలెల్లరు యేసు వాక్యంబు విని క్షుద్బోదగొని వాదించు చుండగను మిషనులెల్ల మిషలచేత మిట్టపడుచు వాదములచే యేసు బోధను మరచినారన్నా నీవెంత కాలము వారి చెంత వుందువోరన్నా ||క్రైస్తవుండా||

  2. సత్య వాక్యము సంతలో దులిపి భోదకుల దొరల భత్యములపై భాంతులు నిలపి – చిత్తమగు అనుకూల బోధలు చేసి ప్రజల మోసగించే – సూత్రదారుల చేరరాదయ్య – సుఖ భోగమిడిచి సత్య వాక్యము చాటరావయ్యా  ||క్రైస్తవుండా||

  3. శక్తిహీనుడవందు వేమయ్యా సౌజన్యమగు శుద్ధాత్మ శక్తిని పొందుకొనుమయ్యా – భక్తిహీనత పారద్రోలి భష్ట మనసు బయలు పరచి – శక్తితో సువార్త చాటుదువు సువార్తచే జయమొంది ఆత్మల రక్షించెదవు  ||క్రైస్తవుండా||

  4. నీతికై భక్తాది పరులెల్లా – నిజ విశ్వాసము నిలుపుకొన పోరాడిరే చాలా –    కత్తిపోటులు  రాళ్ళ దెబ్బలు కరుకుగల రంపములు కోతలు  -బెత్తముల కొరడాల దెబ్బలు పైబడి చేర్చే దేహము వాలలాడెను రక్తము భూమిపై ||క్రైస్తవుండా||

  5. దూతలకు లేనట్టి పరిచర్య ఓ ప్రియ సఖుడా ఖ్యాతిగా నీకిచ్చె గ్రంధంబు – ఖేతీయుల వినుము గ్రంధము తేనెవలె మధురముగా నుండును  – జ్ఞానము నీకబ్బునో హితుడా జ్ఞానంబు నొంది స్వామిని సేవించుమో సఖుడా ||క్రైస్తవుండా||

  6. ఆది సంఘము నార్పుటకునేంచి – ఆ దుష్ట నీరో అధిపతి చెలరేగి గర్వించి – ఆది క్రైస్తవ భక్తుల స్థంభముల గట్టి తారు పూసి అగ్నిని ముట్టించి కాల్వంగ –
  ఆ సంఘమొచ్చె అధిపతి అప్పుడే నశియించే  ||క్రైస్తవుండా||

  Sthutulaku patruda

  స్తుతులకు పాత్రుడా స్తుతించుచున్నాను నజరేయుడా
  నా హృదిలో నీ సన్నిధిలో మరువక విడువక స్తుతించుచున్నాను

  1. సాగిల పడితిని నీ సన్నిధిలో ఘనుడా నీ కొరకు
  నీవు నాకై చేసిన మేలుల కొరకై ||స్తుతులకు||

  2. నీ సన్నిధిలో నిలచితి నేను నీ సాక్షిగా
  నీవు పిలచిన పిలుపును ప్రచురము చేయ నిలచితి సాక్షిగా ||స్తుతులకు||

  3. పాడుచుంటిని నీ సన్నిధిలో ఆత్మతో సత్యముతో
  నేను ఆడుచుంటిని ఆనందముతో గంతులు వేయుచు ||స్తుతులకు||

  4. భజనలు చేసెద నీ సన్నిధిలో ఘనుడా నీ కొరకు
  భజయింతును భజయింతును ఘనుడా నీ కొరకు ||స్తుతులకు||

  Special song of the week (on Psalm 16)

  Nee palakarimpulo

  నీ  పలకరింపులో  ఓదార్పు ఉన్నది, యేసయ్యా యేసయ్యా
  నీ  పలకరింపులో  ఓదార్పు ఉన్నది |2|
  నా కలవరాన్ని హరియించి, ఆదరణ నిచ్చుచున్నది|2|
  *ప్రేమామయుడా యేసయ్యా |2| క్షేమాధారం  నీవయ్యా |2|
  నీ పలకరింపులో ఓదార్పు ఉన్నది |2|
  1.పాపులను పలకరించి  పాపములను క్షమియించావు
  దీనులకు చేయిచాపి ఆత్మీయతను పంచావు |2|
  నీ  పిలుపులో కనికరం, నీ  పలుకులో  పరిమళం |2|
  నీవే సంతోషం |2|   || ప్రేమామయుడా యేసయ్యా||
  2.రోగులను పలకరించి ఆరోగ్యము కలిగించావు
  మృతులకు ప్రాణం పోసి మరణంనుండి  లేపావు|2|
  నీ  పిలుపులో ఆర్ద్రత, నీ పలుకులో స్వస్థత  |2|
  నీవే  చేయూత |2|    || ప్రేమామయుడా యేసయ్యా||
  3.శిష్యులను పలకరించి  ఆందోళన తొలగించావు
  అందరికి  బోధచేసి దుర్మార్గులను మార్చావు |2|
  నీ పిలుపులో ధైర్యము, నీ పలుకులో అభయము|2|
  నీవే ఆశ్రయము |2|    || ప్రేమామయుడా యేసయ్యా||
  ||నీ  పలకరింపులో  ఓదార్పు ఉన్నది||
  *ఆర్ద్రత=మెత్తదనము(soft).