Maratuna Naa Yesuni

మరతునా నా యేసును కలనైన మరతునా నా ప్రభువును
నజరేయుని పిలుపును నా యేసుని ప్రేమను

నను పిలచిన నా ప్రభువు నీతిమంతుడు
నా దేవుడు ఏనాడు మాట తప్పడు
విడువడు నిను ఎడబాయడు ఏనాడు
నీకు నిత్యజీవమిస్తానని పలికిన యేసయ్య మాటను ||మరతునా||

సత్య మార్గమందు నేను సాగిపోవుదున్
నిత్య రాజ్య మహిమలోన పాలు పొందెదన్
కడవరకు విశ్వాసం కొనసాగించి
ఆ కరుణామయుని కన్నులార వీక్షించెదన్ ||మరతునా||

ఇంత గొప్ప శక్తిమంతుడేసు ఉండగా
ఎంత గొప్ప శోధనైనా ఎదురునిలుచునా
చింతయేల జీవితాన క్రీస్తు ఉండగా
అత్యంతమైన ప్రభువు నాకు అండ ఉండగా ||మరతునా||

Samayamide

సమయమిదే సమయమిదే సంఘమ సమయమిదే
సీయోనులో చేరుటకు సంఘమ సమయమిదే
1. చూడుము భూమి మీద పాప చీకటి క్రమ్మియున్నది
జ్యోతివలె జీవించు జీవవాక్యము పట్టుకొని ||సమయమిదే||
2. ధూళి దులుపుకొనుము నీ మెడ కట్లు విప్పుకొనుము
సుందరమైన వస్త్రము వేగం ధరించి సిద్ధపడుము ||సమయమిదే||
3. నిలువుము సత్యముకై సువార్తకు పోరాడుము
సేవను చేసి నీవు త్యాగం చేయుము ప్రాణమును ||సమయమిదే||
4. సీయోను శత్రువులు సిగ్గుపడుదురు నిశ్చయముగా
సీయోను నీ పరుగు తుదముట్టించుము త్వరితముగా ||సమయమిదే||
5. సీయోనులో వసించు సర్వశక్తుడు నీ ద్వార
శోధింప ఈ దినము మార్పునొందుము స్పటికముగా ||సమయమిదే||
6. పిలుపుకు తగినట్లుగా నీవు నడువుము ప్రభుయేసుతో
ప్రేమలోనే నిలువుము నిత్యజీవము చేపట్టుము ||సమయమిదే||
7. సీయోను రారాజు నిన్ను చూచి ఏతెంచెదరు
మహిమగల కిరీటం నీకు ఆయన ఇచ్చెదరు ||సమయమిదే||

మాటలాడని మౌనమా v2

Prana tyagamu chesina – Maataladani Mounama MP3 (Click here)

ప్రాణ త్యాగము చేసిన నా దైవమా రక్తమంతా ఓర్చిన నా జీవమా ||2||

మాటలాడని మౌనమా మనసు తెలిసిన దైవమా
మరచిపోని స్నేహమా మోక్ష రాజ్యపు ద్వారమా
యేసు రాజా నీవె నాకిల జీవము నా జీవము
||మాటలాడని||

కఠినులైన మనుషులు సిలువ మ్రానును మోపిరి
కందిపోవు మోమున కంట నీరే నిలిపిరి ||2||
వారి హింసకు బదులుగా క్షమాపననే చూపిన
||మాటలాడని||

ముళ్ళతో కిరీటము అల్లి శిరస్సున గ్రుచ్చిరి
దాహమని నీవడిగిన చేదు చిరకని ఇచ్చిరి ||2||
దూషణలకు బదులుగా ఏమి తెలియని వారని ||2||
క్షమాపననే చూపిన ||మాటలాడని||

Egiri Pade Keratanni

Egiri Pade Keratanni Audio MP3 (Click here)

ఎగిరి పడే కెరటాన్ని, పోలిన మా జీవితాన్ని
ఇంతగా ప్రేమించినావా, నిత్య జీవాన్నే ప్రసాదించినావా |ఇంతగా |

1. అ సిలువలోన నీ ఘోర మరణం,
ఈ లోకాన మా రక్షణ తరుణం |అ సిలువలోన|
ఆ సిలువే మాకిలా శరణం శరణం |ఆ సిలువే|
మరువలేనయ్యా నీ ప్రేమ కిరణం |మరువలేనయ్యా | ||ఎగిరి పడే||

2. నీ కోసమే మేము జీవించెదము
మరణించిన ఇక నీ మహిమ కొరకే |నీ కోసమే|
నీ దర్శన భాగ్యము దయ చేయుము దేవా |నీ దర్శన|
నీ మహిమ రాజ్యములో నివసింపచేయుము |నీ మహిమ| ||ఎగిరి పడే||

కొంతసేపు కనపడి

Kontha Sepu Kanapadi MP3 (Download here

కొంతసేపు కనపడి అంతలోనే మాయమయ్యే
ఆవిరివంటిదిరా ఈ జీవితం లోకాన కాదేది శాశ్వతం
యేసే నిజ దేవుడు నిత్య జీవమిస్తాడు మరణమైన జీవమైన నిన్ను విడువడు

1. ఎదురవుతారెందరో నీ పయనములో – నిలిచేది ఎందరో నీ అక్కరలో
వచ్చేదెవరో నీతో మరణము వరకు – ఇచ్చేదెవరో ఆపై నిత్యజీవం నీకు
||యేసే||

2. చెమటోడ్చి దేవుని విడిచి కష్టములోర్చి – ఆస్తులు సంపాదించిన శాంతి ఉన్నదా – ఈ రాత్రే దేవుడు నీ ప్రాణమడిగితే – సంపాదన ఎవరిదగునో యోచించితివా ||యేసే||

3. నీ శాపము తానుమోసి పాపముతీసి  – రక్షణ భాగ్యము నీకై
సిద్ధము చేసి విశ్రాంతినియ్యగా నిన్నుపిలువగా-నిర్లక్ష్యము చేసినా తప్పించుకుందువా ||యేసే||