Maha Viveki Yesayya

Maha Viveki Yesayya MP3 (Download here)

మహవివేకి యేసయ్య నా మదిలో
మందసమాయెను, మహానుభావుడు యేసయ్య
నాలో మ్రోగెను మృదంగమై, నిన్న నేడు రేపు ఎన్నడైన|2|
మారని త్రియేకుడు, మహిలో మన యేసుడు|2|
||మహవివేకి యేసయ్య||

ఓబేదెదోము ఇంటిలో మందసము ఉండగా
దేవుని దీవెనలు మెండుగా నిండెను|2|
దావీదు ఒంటిలో దేవుని స్తుతి వుండగ|2|
సితారాను సంధించి సదా ప్రభుని స్తుతియించి|2|
దేవుని దయపొందెను దావీదు దేవుని దయపొందెను.
||మహవివేకి యేసయ్య||

దేవునినీడలో దీనురాలు ఎస్తేరు
కన్యకలు అందరిలో రాజుదయపొందెను|2|
మోయాబుదేశములో అన్యురాలు రూతు|2|
బెత్లెహేము పురమందు బోయాజు పొలమందు|2|
దేవుని దయపొందెను ఆ రూతు దేవుని దయ పొందెను.
||మహవివేకి యేసయ్య||

Yesayya Yesayya

Yesayya Yesayya MP3 (Download here

“నేను కృపనుగూర్చియు న్యాయమునుగూర్చియు పాడెదను. యెహోవా, నిన్ను కీర్తించెదను.” -కీర్తన 101:1

యేసయ్యా యేసయ్యా |2|
నిన్నే కీర్తించెదా, కృపను గూర్చి నే పాడెదా
నీ కృపను గూర్చి నే పాడెదా|2|

ఎండిన ఎడారిలో నా జీవితం
బీడుబారిపోగా|2|
సిలువ ప్రవాహం నీ జలధారలు|2|
నాలో ప్రవహించె నా యేసయ్య|2|
||యేసయ్యా యేసయ్యా||

నీవు ఉన్న నా హృదయము
ఆనంద భరితము కాగా|2|
ఆత్మ ప్రభావం నీ పరిశుద్ధతా|2|
నాలో నివహించె నా యేసయ్య|2|
||యేసయ్యా యేసయ్యా||

ఇంతకాల నిరీక్షణ కనుల
ముందుకు రాగా|2|
సియోనులో నీ ముఖము చూస్తూ  |2|
పరవసించి పాడాలి నా యేసయ్య |2|
||యేసయ్యా యేసయ్యా||

Yesayya Nee Krupa

Yesayya Nee Krupa MP3 (Download here

యేసయ్యా ……………
నీ కృప నాకు చాలయ్యా…. నీకృపలేనిదే
నే బ్రతుకలేనయ్యా, నీ కృప లేని క్షణము
నీ దయలేని క్షణము నేను వూహించలేను
యేసయ్యా…
నీ కృప నాకు చాలయ్యా…
నీ కృపలేనిదే నేనుండలేనయ్యా…|2|
నీ కృప లేని క్షణము నీ దయలేని క్షణము
నేవూహించలేనయ్యా.
యేసయ్యా  |2|

మహిమను విడచి మహిలోకి దిగివచ్చి
మార్గముగా మారి , మనిషిగ మార్చావు
మహినే నీవు మాధుర్యముగ మార్చి
మాదిరి చూపీ…మరురూపు నిచ్చావు …|2|
మహిలో నేను మహిమను పొంద
మహిమగా మార్చింది నీ కృప |2|
||యేసయ్యా నీ కృప||

ఆజ్ఞల మార్గమున  ఆశ్రయమును ఇచ్చి
ఆపత్కాలమున ఆదుకొన్నావు
ఆత్మీయులతో ఆనందింజేసి
ఆనందతైలముతో అభిషేకించావు |2|
ఆ ఆశ తీరఆరాధనజేసే అదృష్టమిచ్చింది నీ..కృప
ఆ ఆశతీర ఆరాధనజేసే అదృష్టమిచ్చింది నీ కృప
||యేసయ్యా నీ కృప||

 

Mahonnatuda

మహోన్నతుడా నీ కృపలో నేను జీవించుట
నాజీవిత ధన్యతై యున్నది
1. మోడు బారిన జీవితాలను – చిగురింప చేయ గలవు నీవు
మారా అనుభవం మధురముగా మార్చ గలవు నీవు
2. ఆకు వాడక ఆత్మ ఫలములు ఫలియింప చేయగలవు నీవు
జీవ జలముల ఊటయైనా – నీ ఓరను నను నాటితివా..
3. వాడబారని స్వాస్ధ్యము నాకై – పరమందు దాచితివా
వాగ్ధాన ఫలము అనుభవింప – నీ కృపలో నన్ను పిలచితివా..

Nee Dayalo Nee Krupalo

Nee Dayalo Nee Krupalo MP3 (Download here

నీ దయలో నీ కృపలో కాచితివి గత కాలము
నీ దయలో నీ నీడలో దాచుమయా జీవితాంతము.
నీ ఆత్మతో నను నింపుమా
నీ సేవలో ఫలియింపగా దేవా దేవా || నీ దయలో ||

కష్టకాలం దుఃఖ సమయం నన్ను వేధించగా
ప్రాణహితులే నన్ను విడచి వెలిగ నను చూడగా |2|,
ఓదార్పువై  నా చెంత నీవే ఉండినావు
నా కన్నీరు నీ కవితలో వ్రాసి ఉంచినావు |2|,
ఏమి అద్భుత ప్రేమయా, ఏ రీతి పాడనయా
నీవే నా మార్గము, నీవే నా జీవము,
నీవే నా గమ్యము, నీవే నా సర్వము,
నా మనసుతీరా నిన్ను పాడి పొగడెద దేవా || నీ దయలో ||

ఏ యోగ్యతయు లేని నా యడ నీ కృప చూపితివి
వట్టి పాత్రను మహిమతో నింపి మార్గము నీవైతివి |2|,
నీ చిత్తమే నా యందు నెరవేర్పవ్వాలని
నీ సేవయే నా శ్వాసగా కడవరకు నిలవాలని |2|,
నా మది నిండెను ఆశతో, నే పాడెద స్తుతి గీతం,
నీవే నా తోడుగా, నీవే నా నీడగా ,
ఆత్మతో నింపుమా, శక్తి నాకొసగుమా,
నా చేయి పట్టి నన్ను నీతో నడుపుము దేవా || నీ దయలో ||

Karunamayuda

Karunamayuda MP3 (Download here

కరుణామయుడా ప్రభు యేసువా
దయా సంపూర్ణుడా, పరిపాలకుడా
పరమోన్నుతుడా దయా సాగరా |2|

నీ ఆత్మ నానుండి తీయకుము
నీ సన్నిధి నుండి నను త్రోయకుము |2|
దేవా దేవా, కరుణ చూపుము
నీ దయతో నింపుము ||కరుణామయుడా||

నీ ముందు నిలిచే ధైర్యమిమ్ము
ప్రార్థనాత్మ బలం నాకొసగుము |2|
దేవా దేవా, నీ కృపతో నడిపించుము
ఆత్మతో అభిషేకించు ||కరుణామయుడా||

Yenthaina Nammadagina

ఎంతైనా నమ్మదగిన దేవుడవయ్యా
నా పక్షమున యుద్ధమాడు శూరుడవయ్యా
తొట్రుపడే ప్రాయములో నేనుండగా
నా కేడెము ఆధారము నా యేసయ్యా
హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ

1. ఎల్లప్పుడు ప్రభువు నిన్ను విడనాడడు
యవ్వన కాలమున కాడిమోయు నరునికి
కృపని బట్టి జాలి పడే నా దేవుడు
నా ప్రార్ధనకు చెవియొగ్గే నీతిసూర్యుడు ||హల్లెలూయ||

2. క్షమనొందని దోషినని అనుకొనవద్దు
నన్ను కాదనుకొని నిన్ను కూడా పిలచుచున్నాడు
సిగ్గు వీడి బిడియపడక ప్రభుని వేడు
ఆపదలో అండైన మహాదేవుడు ||హల్లెలూయ||

Tallila lalinchunu

తల్లిలా లాలించును తండ్రిలా ప్రేమించును “2”
ముదిమి వచ్చువరకు ఎత్తుకొని ముద్దాడును
చంక పెట్టుకొని కాపాడును యేసయ్యా “తల్లిలా”
1. తల్లియైన మరచునేమో – నేను నిన్ను మరువను
చూడుము నా అరచేతులలో – నిన్ను చెక్కియున్నాను “2”
నీ పాదము త్రొట్రిల్లనీయను నేను నిన్ను కాపాడువాడు
కునుకడు నిదురపోడు అనిచెప్పి వాగ్దానము చేసిన యేసయ్యా “తల్లిలా”
2. పర్వతాలు తొలగవచ్చు – తత్తరిల్లు మెట్టలన్నీ
వీడిపోదు నాకృప నీకు – నానిబంధనా తొలగదు “2”
దిగులుపడకు భయపడకు నిన్ను విమోచించెదా
నీదుభారమంతా మోసి నాదు శాంతినొసగెదా
అనిచెప్పి వాగ్దానము చేసిన యేసయ్యా “తల్లిలా”

కృపవెంబడి కృప పొందితిని

Krupa vembadi krupa MP3 (Click here)

కృపవెంబడి కృప పొందితిని నీ కృపలో తలదాచితిని
కృపవెంబడి కృప పొందితిని నీ కృపలో తలదాచితిని
యేసయ్య హల్లేలూయా యేసయ్యా హల్లేలూయా
క్షమవెంబడి క్షమ పొందితిని నీ క్షమలో కొనసాగితిని
మెస్సియ్యా హల్లేలూయా మెస్సియ్యా హల్లేలూయా
కృపా సత్య సంపూర్ణుడా – క్షమా ప్రేమ పరిపూర్ణుడా ||కృప||
1. పాపములో పరి తాపమును – పరితాపములో పరివర్తనను
పరివర్తనలో ప్రవర్తనను-ప్రవర్తనలో పరిశుద్దతను
ప్రశవించెను పరిశుద్దాత్ముడు – ప్రశరించెను శిలువ శిక్షణలో ||2|| ||కృప||
2. ఆత్మలో దీనత్వమును – దీనత్వములో సాత్వీకతను
సాత్వీకతలో మానవత్వమును – మానవత్వములో దైవత్వమును
ప్రసవించెను పరిశుద్దాత్ముడు – ప్రసరించెను దైవ రక్షణలో ||2|| ||కృప||