ఐక్యతను ఇవ్వవా ప్రభూ

Ikyatanu MP3 (Download here

ఐక్యతను ఇవ్వవా ప్రభూ
సమైక్యతను మా సంఘములలో ఉంచవా

1. పెట్టినాడయా సాతాను కలహంబులను
చెదరగొట్టి నాడయా విశ్వాసులను
గద్దించవా తండ్రి అపవాదిని
ఆత్మ బలమును మాకియ్యవా ప్రభు
||ఐక్యత||

2. సడలిన మా చేతులను బలపరచయ్యా
కృంగిన మా కాళ్ళను ధృడపరచయ్యా
తత్తరిల్లు హృదయాలను ధైర్యపరచయ్యా
విశ్వాసములో మమ్ము స్థిరపరచయ్యా
||ఐక్యత||

3. ఆత్మీయ పోరాటం మాకు నేర్పయ్యా
యుద్ధములో జయమును మాకు ఇమ్మయ్యా
జీవింపజేయుమా నీ ఆత్మ ను
ఆత్మల భారము మాకీయవా ప్రభు
||ఐక్యత||

4. కాచినావు సంఘమును నీ దయ వలెనే
నిలిపినావు బండపై నీ కృప వలెనే
చిరకాలం ఐక్యతనే బంధకములతో,
సిద్ధ పరచయ్యా నీ రాకడ కొరకు
||ఐక్యత||

ఒక్కడే యేసు ఒక్కడే

NEW: More Verse images posted here.

ఒక్కడే యేసు ఒక్కడే – ఒక్కడే పరిశుద్ధుడు
ఒక్కడే మహా దేవుడు మహిమోన్నతుడు
లోకానికి రక్షకుడు యేసు ఒక్కడే

పాపిని విడిపించువాడు – యేసు ఒక్కడే
పాపిని ప్రేమించువాడు – యేసు ఒక్కడే
జీవ మార్గమై – సత్య దైవమై
మోక్షానికి చేర్చువాడు యేసు ఒక్కడే

అద్వితీయ దేవుడు యేసు ఒక్కడే
అద్భుతములు చేయువాడు యేసు ఒక్కడే
ఆదరించి ఆశ్రయమిచ్చి
అనుక్షణము కాపాడు యేసు ఒక్కడే

నిత్యము ప్రేమించువాడు యేసు ఒక్కడే
నిత్య శాంతి నిచ్చువాడు యేసు ఒక్కడే
నా వేదనలో నా బాధలలో
నా అండగా నిలుచువాడు యేసు ఒక్కడే

మరణము గెలచినవాడు యేసు ఒక్కడే
మరల రానున్న వాడు యేసు ఒక్కడే
పరిశుద్ధులను ఆ పరమునకు
కొనిపోవువాడు యేసు ఒక్కడే