ఎంతైనా నమ్మదగిన దేవుడవయ్యా
నా పక్షమున యుద్ధమాడు శూరుడవయ్యా
తొట్రుపడే ప్రాయములో నేనుండగా
నా కేడెము ఆధారము నా యేసయ్యా
హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ

1. ఎల్లప్పుడు ప్రభువు నిన్ను విడనాడడు
యవ్వన కాలమున కాడిమోయు నరునికి
కృపని బట్టి జాలి పడే నా దేవుడు
నా ప్రార్ధనకు చెవియొగ్గే నీతిసూర్యుడు ||హల్లెలూయ||

2. క్షమనొందని దోషినని అనుకొనవద్దు
నన్ను కాదనుకొని నిన్ను కూడా పిలచుచున్నాడు
సిగ్గు వీడి బిడియపడక ప్రభుని వేడు
ఆపదలో అండైన మహాదేవుడు ||హల్లెలూయ||