నీ వాక్యమే నన్ను బ్రతికించెను

Nee Vaakyame Nannu Brathikinchenu (MP3 – Click here)

Open the MP3 in Chrome Browser or Click the Download Arrow in other browsers.

నీ వాక్యమే నన్ను బ్రతికించెను
భాధలలో నెమ్మది నిచ్చెను
కృపా శక్తి దయా సత్య సంపూర్ణుడా
వాక్యమైయున్న యేసు వందనమయ్యా

1. జిగటగల ఊభినుండి లేవనెత్తెను
సమతలమగు భూమిపై నన్ను నిలిపెను
నా పాదములకు దీపమాయెను
సత్యమైన మార్గములో నడుపుచుండెను ||నీ వాక్యమే||

2.వాడి గల రెండంచుల ఖడ్గము వలెను
నా లోని సర్వమును విభజించి శోధించి
పాప మాలిన్యము తొలగించి వేయుచు
అనుక్షణము క్రొత్త శక్తి నిచుచున్నది ||నీ వాక్యమే||

3. శత్రువులను ఎదుర్కొనే సర్వాంగ కవచమై
యుద్దమునకు సిద్దమనసు నిచ్చుచున్నది
అపవాది వేయుచున్న అగ్ని భాణములను
ఖడ్గమువలె అడ్డుకొని ఆర్పివేయుచున్నది ||నీ వాక్యమే||

4. పాల వంటిది జుంటె తేనె వంటిది
నా జిహ్వకు మహా మధురమైనది
మేలిమి బంగారుకంటే మిన్నయైనది
రత్న రాశులకన్న కోరతగినది ||నీ వాక్యమే||