ఓ మనసా నా మనసా (Oh Manasa)

Oh Manasa Audio MP3: Click here

ఓ మనసా నా మనసా |2|
శోధనలో పడి వేదనతో ఉన్నావా |2|
ఓ మనసా నా మనసా |2|

ఎరిగి ఎరిగి శోధనలో పడి క్రుంగియుంటివా |2|
(కీర్తనలు 43:5, యోబు 15:12)
విరిగె విరిగె హృదయ పలకం ముక్కలు ముక్కలుగా |2|
(సామెతలు 7:3, యిర్మీయా 17:9, యాకోబు 4:1, సామెతలు 4:23)
కరిగి పోయావా కడలి తరంగంలా |2| (యాకోబు 1:6)
జరిగి పోయావా క్రీస్తుకు దూరంగా |2| (ఎఫెసీయులకు 2:12)
ఓ మనసా నా మనసా |2|

శోధకుడైన సాతాను నీకు గాలం వేసాడు |2|
ఎర (Lust of flesh, Lust of eye, Pride of life – 1 John 2:16) చూపించి
భ్రమ చూపించి నిను చిక్కించాడు |2|
చివరకు నిన్ను బానిస చేసి |2|
విజయ గర్వంతో తను నవ్వుతున్నాడు |2|
ఓ మనసా నా మనసా |2|
(హబక్కూకు 1:15, లూకా 22:3-5, యోహాను 13:2, ప్రకటన 6:2)

శాంతికి శత్రువై భ్రాంతికి చేరువై నీవు ఉందువా |2|
శాంతి సమాధానం మనసుకు ఉల్లాసం ఒసగే దేవుడు ఆయనే |2|
(యోహాను 14:27 , కీర్తనలు 147:3, యెషయా 61:3)
ఆయన ఘన నామం ఆరాధించుమా , ఆయన రాజ్యము ఆశించుమా |2|
(లూకా 12:31, యోహాను 4:24 , కీర్తనలు 100:4)
ఆయన ఆజ్ఞలు మరువకు మనసా |2| సామెతలు 3:1
ఆయన మేళ్ళను మరువకు మనసా |2| కీర్తనలు 103:2

ఓ మనసా నా మనసా |2|