ప్రభువా కాచితివి ఇంత కాలం

Prabhuva Kaachitivi Audio MP3 (Click here)
Open the MP3 in Chrome Browser or Click the Download Arrow in other browsers.

ప్రభువా కాచితివి ఇంత కాలం-
చావైనా బ్రతుకైనా నీ కొరకే దేవా –
నీ సాక్షిగా నే జీవింతునయ్యా ||ప్రభువా||

1. కోరి వలచావు నాబ్రతుకు – మలిచావయా
మరణ చాయలు అన్నిటిని – విరిచావయ్యా
నన్ను తలచావులే మరి పిలచావులే
నీ అరచేతులలో నను చెక్కు కున్నావులే ||ప్రభువా||
2. నిలువెల్ల గోరపు విషమేనయ్యా
మనిషిగ పుట్టిన సర్పానయ్యా
విషం విరచావులే పాపం కడిగావులే
నను మనిషిగా ఇలలో నిలిపావులే ||ప్రభువా||
3. బాధలు బాపితివి నీవేనయ్యా
నా కన్నీరు తుడిచితివి నీవెనయ్యా
నన్ను దీవించితివి నన్ను పోషించితివి
నీ కౌగిలిలో నన్ను చేర్చుకున్నావులే ||ప్రభువా||